పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
పొదుపుగా చెప్పబడిన అర్థంలో ఆర్థికవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు: ఒక వ్యక్తి తన ఆదాయంలో ఖర్చుచేయకున్ననూ పాతబాకీలు చెల్లించడానికి వెచ్చించిన డబ్బు కూడా నిర్వచనం ప్రకారము పొదుపుగా పరిగణించబడుతుంది. [[అమెరికా]] స్థూలజాతీయోత్పత్తి గణాంకాలు వడ్డీలకు చెల్లించిన చెల్లింపులను పొదుపుగా పరిగణించవు.
 
ఖర్చు తగ్గించడం (Saving) మరియు, పొదుపు చేయడం (savings) పదాలకు అర్థశాస్త్రంలో వేర్వేరు అర్థాలున్నాయి. మొదటిది దాని వలన వ్యక్తి నికర ఆస్తులు పెరిగితే రెండో దాని వలన ఆస్తులలో ఒక భాగం సాధారణంగా పొదుపు భాగం పెరుగుతుంది. పొదుపును దీర్ఘకాలంలో నది (ప్రవాహం) మాదిరిగా మరియు, స్వల్ప కాలమైతే చెరువు (ప్రవాహం లేనిది) గా పేర్కొనవచ్చు.
 
పొదుపుకు [[పెట్టుబడి]]కి సన్నిహితమైన సంబంధం ఉంది. వస్తుసేవలకై ఖర్చు చేయకుండా పొదుపు ఉంచబడిన డబ్బు పెట్టుబడికి దోహదపడుతుంది. అదే సమయంలో పొదుపు కాకుండా ఖర్చు చేయబడిన వినిమయం వలన వస్తుసేవలకు డిమాండు పెరిగి మూలధనం పెరుగుతుంది తద్వారా ఆర్థికవృద్ధి జరుగుతుంది. కాబట్టి పొదుపు అనేది ఆర్థికవ్యవస్థలో రెండు రకాలుగా ప్రభావితం చేయగలుగుతుంది.
 
అయినప్పటికినీ పొదుపు పెరిగితే సర్వవేళలా పెట్టుబడి పెరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. పొదుపును బ్యాంకులలో కాని పొదుపు గుణకంగా పనిచేసే మరే విధంగా చేయనప్పుడు అంటే వ్యక్తులు అట్టే డబ్బును డబ్బురూపంలోనే ఇంట్లో దాచుకోవడం వలన ఆ పొదుపు ఆర్థికవ్యవస్థకు ఏ విధంగానూ లాభకరం కాదు. అలాంటి పొదుపు వలన పెట్టుబడి పెరగదు సరికదా ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గి దాని వలన వస్తుసేవలకు డిమాండు తగ్గుతుంది. తత్ఫలితంగా ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తిలో కోత విధించడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే కార్మికులను తొలిగించడానికి కూడా సంస్థల నిర్వాహకులు సిద్ధపడతారు. అంటే పెట్టుబడికి పనికిరాని పొదుపు వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా, వస్తుసేవలకు డిమాండు తగ్గడం, ఆదాయ మరియు, ఉద్యోగిత తగ్గడం, ఆర్థిక వ్యవస్థ తిరోగమన మార్గంలో పయనించడం జరుగుతుంది. పొదుపు మరీ తగ్గి ఖర్చు పెరిగినా దీనికి వ్యతిరేక ఫలితాలు కలిపిస్తాయి. పొదుపు తగ్గడం వలన వినిమయం అధికంగా జరిగి వస్తుసేవలకు డిమాండు పెరుగుతుంది. దానివలన ధరలు ఒక్క సారిగా పెరిగి ఆర్థికవ్యవస్థలో [[ద్రవ్యోల్బణం]] ఏర్పడవచ్చు.
 
ఆర్థిక వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందని ప్రాథమిక వ్యవసాయదశ ఆర్థికవ్యవస్థలో పొదుపు చేసే డబ్బు [[రైతు]]లకు తదుపరి సాగుచేసే సమయంలో ఉపయోగపడుతుంది. ఒకవేళ వారు ధాన్యం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బును వెంటనే వినియోగం చేస్తే ఆ తరువాత వారికే కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ తగులుతుంది.
 
== పొదుపు మరియు, వడ్డీ రేటు ==
సాంప్రదాయ ఆర్థిక వేత్తలు వడ్డీరేటు పొదుపు మరియు, పెట్టుబడులను సమన్వయ పరుస్తాయనే అభిప్రాయాన్నివెలిబుచ్చారు. పొదుపు పెరిగితే వడ్డీరేట్లు తగ్గుతాయని, తద్వారా పెట్టుబడి పెరుగుతుందని, పొదుపు పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయని పెట్టుబడి తగ్గుతుందని సాంప్రదాయక ఆర్థికవేత్తలు సిద్ధాంతీకరించారు. కాని [[జాన్ మేనార్డ్ కీన్స్|జె.ఎం.కీన్సు]] ఆర్థికవేత్త వడ్డీరేట్లను నిర్ణయించేది పొదుపుకు కాని పెట్టుబడి దగ్గరి సంబంధం లేదని (ఆ రెండూ వడ్డీరేటుతో అవ్యాకోచసంబంధం కలిగినవిగా) నిర్థారించాడు. స్వల్పకాలంలో వస్తువులకు ఉండే డిమాండు మరియు, సప్లయి సామర్థ్యమే వడ్డీరేటును నిర్ణయిస్తుదని కీన్సు తన సిద్ధాంతంలో తెలిపినాడు.
 
== వ్యక్తిగతమైన పొదుపు ==
భవిష్యత్తు అవసరాల కొరకు ప్రస్తుత ఆదాయం నుంచి కొంత భాగం ఖర్చుచేయకుండా దాచిపెట్టడమే పొదుపు అయినప్పటికీ [[ద్రవ్యోల్బణం]] వలన దాని విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి సాధారణంగా [[వడ్డీ]] లభించే డిపాజిట్ రూపంలో [[భవిష్యత్తు]] వినియోగాలకై బ్యాంకులలో నిల్వ చేస్తుంటారు. కొందరు వ్యక్తులు తమ [[ఆదాయం]]లో పెట్టుబడి పథకాలైన షేర్లు కొనడానికి డబ్బు వినియోగిస్తారు. కాని అందులో పెట్టుబడి నష్టభయం ఉంటుంది. [[నగదు]]గా పొదుపుచేయడానికి, షేర్లలో పెట్టుబడి రూపంలో పొదుపు చేయడానికి ఈ కారణమే వ్యక్తులను నిర్దేశిస్తుంది. తక్కువ ఆదాయం కలవారు నగదు రూపంలోనే పొదుపు చేస్తుంటారు. కాని ద్రవ్యోల్బణం సమయంలో వడ్డీరేటు కంటే ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉంటే వారి పొదుపు నికర విలువ తగ్గుతుంది లేదా బ్యాంకు సంక్షోభం వచ్చినప్పుడు కూడా వారు నష్టపోవలసి వస్తుంది. చాలా సందర్భాలలో పొదుపు మరియు, పెట్టుబడి పదాలను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడడానికి ఇలాంటి స్థితే కారణం. ఉదాహరణకు: చాలా డిపాజిట్ అక్కౌంట్లు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేయడానికి పెట్టుబడి అక్కౌంట్లుగా ఉపయోగపడుతున్నాయి. వ్యక్తులు చేసిన పొదుపు ఆర్థిక సంస్థల ద్వారా పెట్టుబడి రూపంలో ఆర్థికవ్యవస్థలో ప్రవేశిస్తుంది.
 
== ఒక్కరే చాలు లేదా అసలే వద్దు ==
పంక్తి 26:
 
== వడ్డీ రేటులు ==
వాస్తవ వడ్డీరేటు అనగా పన్ను మినహాయింపులు మరియు, ద్రవ్యోల్బణ రేటు తగ్గింపులు. కొన్ని సందర్భాలలో వాస్తవ వడ్డీరేటు శూన్యం కంటే తక్కువ ఉండవచ్చు దాన్నే ద్రవ్యోల్బణ నష్ట ప్రభావంగా పేర్కొనవచ్చు.
 
== పొదుపును నిర్ణయించే కారకాలు ==
అర్థశాస్త్రం ప్రకారం పొదుపును నిర్ణయించే కారకాలను క్రిందివిధంగా విభజించవచ్చు:
;ఆదాయం:
పొదుపును నిర్ణయించే ప్రధాన కారకం ఆదాయం. ఆదాయం అధికంగా ఉంటే సాధారణంగా పొదుపు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఆదాయానికి మరియు, పొదుపునకుఆవినాభావ సంబంధం ఉన్నట్టు. తక్కువ ఆదాయం కలవారికి వారికి లభించే కొద్ది ఆదాయం వారి అవసరాలను తీర్చుకోవడానికే ఉపయోగపడుతుంది. కాబట్టి వినియోగం చేయగా పొదుపుగా మిగిలే భాగం అతిస్వల్పంగా ఉంటుంది.
;వస్తుసేవల ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) :
నిత్యావసరాలకు వినియోగించే వస్తుసేవల ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణ సమయంలో దానికి తగనట్లుగా ఆదాయం పెరగనిచో ఖర్చు పెరిగి పొదుపు భాగం తగ్గడం సాధారణమే.
"https://te.wikipedia.org/wiki/పొదుపు" నుండి వెలికితీశారు