ఫలక్‌నుమా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నిర్మాణాకృతి: clean up, replaced: శంకు స్థాపన → శంకుస్థాపన
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
| architect =
| operator = తాజ్ హోటల్స్
| owner = నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా, అమీరే పైగా (1884 నుంచి 1897 వరకు) మరియు, తరువాత హైదరాబాదు నిజాం
| Present owner = ఏడవ నిజాం, ముఖర్రంఝా బహాదుర్ (1967-till date)
| cost = 60 లక్షలు
పంక్తి 33:
| footnotes =
}}
తెలంగాణాలోని [[హైదరాబాద్]]లో ఉన్న '''ఫలక్‌నుమా ప్యాలెస్''' ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది [[హైదరాబాదు|హైదరాబాద్]] రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది<ref>{{cite web|url=https://en.wikipedia.org/wiki/Falaknuma_Palace|title=Taj Falaknuma Palace}}</ref>, తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్‌నుమాలో 32 ఎకరాల (13 హెక్టార్లు) ప్రదేశంలో [[చార్మినార్]] నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ [[ప్రధానమంత్రి]] మరియు, ఆరవ [[నిజాం]] [[మహబూబ్ అలీ ఖాన్|నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్]] యొక్క మామయ్య మరియు, బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. .<ref>{{cite web| url = http://hyderabad.clickindia.com/travel/falaknumapalace.html| title = Falaknuma Palace| author = | date = | accessdate = | website = | archive-url = https://web.archive.org/web/20080316040430/http://hyderabad.clickindia.com/travel/falaknumapalace.html| archive-date = 2008-03-16| url-status = dead}}</ref> [[ఉర్దూ]]లో ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం.
 
అందులోని ఒక అద్దం విలువ నేడు రూ. 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని మూడు వందల ఎకరాల్లో నిర్మించారు.<ref>{{cite web|url=http://dome.mit.edu/handle/1721.3/36809|title=Falaknuma palace|date=3 March 2015}}</ref> ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాని సర్‌ వికారుల్‌ ఉమ్రా ఇక్బాల్‌ దౌలా బహదూర్‌ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు.1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్‌ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్‌ ఎడ్వర్డ్స్‌, వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌, తొలి భారతీయ గవర్నర్‌ జనరల్‌ [[సి.రాజగోపాలాచారి]], భారత తొలి [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]] డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గతంలో ఈ ప్యాలెస్‌లో విడిది చేశారు.
పంక్తి 49:
[[Image:Falaknuma Palace 09 - Dining table.jpg|thumb|right|డైనింగ్ హాలు]]
[[Image:Falaknuma Palace 13 - Library.jpg|thumb|right|గ్రంథాలయం]]
ప్యాలెస్ లోని అద్భుతాల్లో... ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్ కు ఇసుక, సున్నం, నీటితో కలిపిన డెకరేషన్ అచ్చంగా బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్యాలెస్ లో 60 విలాసవంతమైన గదులు మరియు, 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్ లోని భోజనశాలలో ఉన్న డైనింగ్ టేబుల్ పై ఒకేసారి 100 మంది అతిథులు ఒకేసారి కూర్చుని భోజనం చేయవచ్చు. 108 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తున్న డైనింగ్ టేబుల్ ను బంగారం, క్రిస్టల్ తో తయారు చేశారు. ప్యాలెస్ లోని [[గ్రంథాలయం]]<nowiki/>లో భారత్ దేశంలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలున్నాయి. ఇక్కడ బిలియర్డ్స్ టేబుల్స్ చాలా అరుదైనవి. ఇలాంటి టేబుల్స్ రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్ లోని [[బకింగ్ హామ్ పాలెస్|బకింగ్ హామ్ ప్యాలెస్]] లో ఉంటే మరొకటి ఫలక్ నుమా ప్యాలెస్ లో మాత్రమే ఉంది.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/features/smartbuy/luxury-and-fashion/article1121289.ece|title=Taj Falaknuma Palace review - One with the sky, one with royalty|publisher=The Hindu Business Line}}</ref>
 
ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలెన్నో ఫలక్ నుమా ప్యాలెస్ సొంతం. 1883లోనే ఈ భవనములో విద్యుత్, టెలిఫోన్ ఉపయోగించారు. కరెంట్ ఉపయోగించారనడానికి భారతదేశంలోనే అతి పెద్ద స్విచ్ బోర్డు ఇక్కడ చూడవచ్చు. ఈ భవనానికి ఆరోజుల్లో విద్యుత్తును అందించడానికి బొగ్గు ఆదారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతంపేరు ఇంజన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని ఈ నాటికి అదే పేరుతో పిలుస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఫలక్‌నుమా_ప్యాలెస్" నుండి వెలికితీశారు