బంగాళదుంప: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 66:
 
=== పంట నిలవ, అమ్మకం ===
సామాన్యంగా బంగాళాదుంపలను భూమిలోనుండి తీసిన వెంటనే అమ్మకం చేయరు. కొంతకాలం నిల్వ ఉంచిన బంగాళాదుంపలకు ఎక్కువ ధర పలుకుతుంది. కొన్నిసార్లు పంటను వెంటనే "కొత్త బంగళాదుంపలు"గా అమ్మటం జరుగుతుంది. బంగాళదుంపలను నిలువ ఉంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతయినా అవసరం. నిల్వ చేసే ప్రదేశం వెలుగు తక్కువగా, మంచి గాలి తగిలేట్టుగా ఉండాలి. ఎక్కువకాలం నిల్వ ఉంచాలనుకుంటే, నిలవ ప్రదేశంలో 40°ఫా ఉష్ణోగ్రత ఉంచాలి. వ్యాపారపరంగా నిల్వచేసే గిడ్డంగులలో అయితే అరు నెలల వరకు, మరియు ఇళ్ళల్లో అయితే కొన్ని వారాలవరకు నిల్వచెయ్యవచ్చు.
 
ఆహార మరియు, వ్యవసాయ సంస్థ [[FAO]] లెక్కల ప్రకారం, 2006వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 315 మిలియన్ టన్నుల బంగాళదుంపల దిగుబడి వచ్చినదట. ఈ దిగుబడిలో నాలుగవ భాగం దిగుబడి ఛైనాలో జరిగినదట.
 
== రకరకాలైన వంటలు ==
[[File:బంగాళాదుంప కూర (2).jpg|thumb|బంగాళాదుంప అల్లం మరియు, పచ్చిమిర్చి కూర]]
[[File:బంగాళాదుంప చిక్కుడుకాయ పోపు కూర (2).jpg|thumb|బంగాళాదుంప చిక్కుడుకాయ పోపు కూర]]
బంగాళదుంపతో రుచికరమైన [[వంట]]లు, [[కూరలు]], [[చట్నీలు]], [[ఫలహారాలు]] మరియు, ఇతర ఆహార పదార్ధాలు తయారుచేయవచ్చును. ఉడకబెట్టిన కూర, వేపుడు, కుర్మా వంటివి తరచు తెలుగు నాట చేసే కూరలు. ఇంకా బజ్జీల వంటి తినుబండారాలు చేస్తారు. ఊరగాయలు కూడా పడుతుంటారు. బంగాళదుంప చిప్స్ వంటి తినుబండారాలు మార్కెట్లో లభిస్తాయి. పాశ్చాత్య దేశాలలో బంగాళ దుంపతో చేసే పదార్ధాలు అక్కడి అలవాట్లకు తగినవిగా ఉంటాయి. ఇవి భారతీయ వంటకాలకంటే భిన్నమైనవి. ఏమైనా బంగాళ దుంపను తరిగి, లేదా ఉడకబెట్టి లేదా వేయించి అనేక రకాలైన, రుచికరమైన పదార్ధాలు తయారు చేయడం చాలా సమాజాలలో సర్వసాధారణం అయింది.
 
* బంగాళదుంప వేపుడు
పంక్తి 84:
ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో [[పిండి పదార్ధాలు]] ([[కార్బోహైడ్రేటులు]]) ప్రధానమైన ఆహార పదార్థం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్థం ఉంటుంది. ఇది ముఖ్యంగా [[స్టార్చ్]] రూపంలో ఉంటుంది. ఈ స్టార్చి‌లో కొద్ది భాగం [[పొట్ట]]లోను, [[చిన్న ప్రేవులు|చిన్న ప్రేవులలోను]] స్రవించే [[ఎంజైములు]] వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం [[పెద్ద ప్రేవు]]లోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి (''[[:en:resistant starch|resistant starch]]'') వలన శరీరానికి [[ఆహార పీచు పదార్ధాలు]] ([[:en:Dietary fiber|Dietary fiber]]) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు (శరీర పౌష్టికత, [[కోలన్ క్యాన్సర్]] నుండి భద్రత, <ref>Hylla S, Gostner A, Dusel G, Anger H, Bartram HP, Christl SU, Kasper H, Scheppach W. Effects of resistant starch on the colon in healthy volunteers: possible implications for cancer prevention. Am J Clin Nutr. 1998;67:136-42.</ref> [[గ్లూకోజ్]] ఆధిక్యతను తట్టుకొనే శక్తి, <ref>Raban A, Tagliabue A, Christensen NJ, Madsen J, Host JJ, Astrup A. Resistant starch: the effect on postprandial glycemia, hormonal response, and satiety. Am J Clin Nutr. 1994;60:544-551.</ref> [[కొలెస్టరాల్]] తగ్గింపు, [[ట్రైగ్లిజరైడులు]] తగ్గింపు వంటివి<ref>Cummings JH, Beatty ER, Kingman SM, Bingham SA, Englyst HN. Digestion and physiological properties of resistant starch in the human large bowel. Br J Nutr. 1996;75:733-747.</ref>). దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.<ref>Englyst HN, Kingman SM, Cummings JH. Classification and measurement of nutritionally important starch fractions. Eur J Clin Nutr. 1992;46:S33-S50.</ref>
 
బంగాళ దుంపలలో పలువిధాలైన [[విటమిన్]]‌లు, [[ఆహారంలో ఖనిజ లవణాలు|ఖనిజ లవణాలు]] (''[[:en:Dietary mineral|minerals]]'') ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల [[విటమిన్-సి]] (ఒక రోజు అవసరంలో 45%), 620 మి.గ్రా. [[పొటాషియం]] ( అవసరంలో 18%), 0.2 మి.గ్రా. [[విటమిన్-B6]] (అవసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్ది మోతాదులలో [[థయామిన్]], [[రైబోఫ్లావిన్]], [[ఫోలేట్]], [[నియాసిన్]], [[మెగ్నీషియం]], [[ఆహారంలో ఐరన్|ఐరన్]], [[ఆహారంలో జింక్|జింక్]] వంటి పదార్ధాలు లభిస్తాయి. ఇంతే కాకుండా బంగాళదుంప [[తొక్క]]లో ఉన్న [[పీచు పదార్థం]] కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో [[:en:carotenoids|కార్టినాయిడ్స్]] మరియు, [[:en:polyphenols|పాలీఫినాల్స్]] వంటి [[:en:phytochemicals|ఫైటో రసాయనాలు]] ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.
 
==అందానికి బంగాళాదుంప :==
పంక్తి 98:
ఫేస్‌మాస్క్‌లు : ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి.
 
పొడి చర్మము ఉన్నవాళ్ళు తురిమిన బంగాళాదుంప మరియు, అర చెంచా పెరుగు కలిపి దానిని మూకానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా తయారవుతుంది.
 
== అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం ==
"https://te.wikipedia.org/wiki/బంగాళదుంప" నుండి వెలికితీశారు