బి.జయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[బొమ్మ:b_jayamma_in_thyagayya1946.jpg|thumb|[[త్యాగయ్య (1946 సినిమా)|త్యాగయ్య]] చిత్రంలో బి.జయమ్మ]]
[[దస్త్రం:gubbi_veeranna_and_jayamma.jpg|thumb|భర్త గుబ్బి వీరన్నతో జయమ్మ]]
[[బి.జయమ్మ]]/ '''గుబ్బి జయమ్మ''' ([[1915]] - [[1988]]) ప్రముఖ [[కన్నడ సినిమా]] మరియు, రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన [[గుబ్బి వీరన్న]] నాలుగవ భార్య<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2003/03/06/stories/2003030600800200.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-04-15 |archive-url=https://web.archive.org/web/20041222002928/http://www.hinduonnet.com/thehindu/mp/2003/03/06/stories/2003030600800200.htm |archive-date=2004-12-22 |url-status=dead }}</ref>. జయమ్మ, [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] దర్శకత్వము వహించిన [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]]తో [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో భర్తచే నిర్లక్ష్యం చేయబడిన భార్య, కళ్యాణి పాత్రను పోషించింది.
 
జయమ్మ 1915లో [[కర్ణాటక]]లోని [[చిక్‌మగళూరు]]లో జన్మించింది. చిన్నతనం నుండి నటనపై ఆసక్తి కనబరిచిన జయమ్మ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో జీవనోపాధికై తొమ్మిదవ యేటనే నటించడం ప్రారంభించింది.<ref>http://www.indianetzone.com/30/b._jayamma_indian_theatre_actress.htm</ref> జయమ్మ 1924లో రసిక జనానంద నాటక సభ నిర్వహించిన [[సీతాకళ్యాణం]]లో మూగ సీత పాత్రనుపోషించింది. ఆ తరువాత జయమ్మ బాలు బసవె గౌడ నాటక కంపెనీలో చేరింది. ఆ తరువాత 1928లో గుబ్బి వీరన్న కంపెనీలో చేరి తన జీవితాన్ని ఆ కంపెనీకి అంకితం చేసింది. గుబ్బి వీరన్న కంపెనీలో ప్రధాన కథానాయకిగా ఎదిగి 1931లో వీరన్నను వివాహమాడింది. భక్త ప్రహ్లాద, [[దేవదాసి]] మరియు, సదారమే నాటకాలలో ఈమె పోషించిన కథానాయకి పాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గుబ్బి కంపెనీ 1934లో నిర్మించిన మహానాటకము కురుక్షేత్రలో [[ద్రౌపది]] పాత్ర పోషించింది. జయమ్మ [[హిందుస్థానీ సంగీతము|హిందుస్తానీ]] మరియు, కర్ణాటక [[సంగీతము]] శిక్షణ పొందింది. ఈమె మంచి కథక్ నృత్యకారిణి కూడా.
 
జయమ్మ మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది. 1931లో రాఫెల్ అల్గియాట్ అనే బెల్జియం దేశీయుడు [[దర్శకత్వం]] వహించిన మూకీ చిత్రం ''హిజ్ లవ్ అఫైర్'' మరియు, 1932లో గుబ్బివీరన్నతో కలిసి [[వై.వి.రావు]] దర్శకత్వం వహించిన ''హరి మాయ'' అనే మూకీ చిత్రంలో నటించింది.
1940లలో తెలుగు సినిమా రంగములో కూడా బాగా పేరుతెచ్చుకున్న జయమ్మకు కన్నడ సినిమా రంగములో అంతకంటే పెద్ద పేరు ఉంది. 1945లో ఈమె కథానాయకిగా నటించిన కన్నడ చిత్రం హేమారెడ్డి మల్లమ్మలో ఈమె నటన చిరస్థాయిగా నిలచిపోయింది. జయమ్మ తెలుగులో [[స్వర్గసీమ]], త్యాగయ్య, [[గుళేబకావళి కథ]], [[బ్రహ్మరధం]] మొదలైన నాలుగు సినిమాల్లో నటించింది. ఈమె మంచి [[గాయని]] కూడా. స్వర్గసీమలో కొన్ని పాటలు పాడింది.
 
"https://te.wikipedia.org/wiki/బి.జయమ్మ" నుండి వెలికితీశారు