భారతీయ జనసంఘ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 6:
 
== హిందూ జాతీయ వాదం ==
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. [[1964]]లో ఏర్పడిన [[విశ్వ హిందూ పరిషత్తు]] ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. [[జవహర్ లాల్ నెహ్రూ]] కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. [[రాజస్థాన్]], [[గుజరాత్]], [[మహారాష్ట్ర]], [[మధ్యప్రదేశ్]] మరియు, [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.
 
== దేశంలో అత్యవసర పరిస్థితి కాలం ==
పంక్తి 31:
== ప్రముఖ జనసంఘ్ నాయకులు ==
;శ్యాంప్రసాద్ ముఖర్జీ
:[[1901]], [[జూన్ 6]]న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ప్రముఖుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వశించాడు. హిందూ మహాసభ మరియు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన తొలి నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన [[అశుతోష్ ముఖర్జీ]] కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెస్ వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించినాడు. స్వాతంత్ర్యానికి పూర్వం [[జవహర్ లాల్ నెహ్రూ]] నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. [[1949]]లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని [[అక్టోబర్ 21]], [[1951]]న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా [[మే 23]], [[1953]]న మరణించేవరకు కొనసాగినాడు.
;అటల్ బిహారీ వాజపేయి {{main|అటల్ బిహారీ వాజపేయి}}
:[[1924]]లో [[గ్వాలియర్]] లో జన్మించిన వాజపేయి [[1968]] నుండి [[1973]] వరకు జనసంఘ్ అధ్యక్ష పదవిని చేపట్టినాడు. 1977లో మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ మత్రివ్త శాఖను నిర్వహించాడు. 1980లో జనతాపార్టీ నుంచి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నేతలుేర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. కేంద్రంలో 3 సార్లు ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా వాజపేయే ప్రధానమంత్రిగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనసంఘ్" నుండి వెలికితీశారు