భూపతిరాజు సోమరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వికీ శైలి ప్రకారం సవరణలు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''భూపతిరాజు సోమరాజు,''' ప్రసిద్ధి చెందిన [[గుండె]] వ్యాధి నిపుణుడు.ఇతను [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఆకివీడు]] గ్రామంలో [[సెప్టెంబరు 25]], [[1948]]లో జన్మించాడు. గ్రామంలోని ప్రాథమిక విద్యానంతరం, ఈయన [[గుంటూరు వైద్య కళాశాల]] నుండి 1970 లో వైద్య విద్యలో పట్టా పొందాడు.చదువులోనే కాకుండా ఆటలలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాడు.1974 లో పి.జి.ఐ., [[చండీఘర్]] నుండి ఎమ్.డి. తరువాత 1977లో డి.ఎమ్. ([[కార్డియాలజీ]]) సంపాదించాడు.
 
తరువాత [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] వైద్య సర్వీసులో కార్డియాలజీలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా చేరాడు. [[ఉస్మానియా వైద్య కళాశాల]] మరియు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో 1983 వరకు పనిచేశాడు.ఇతనికి వైద్య విద్యార్థులకు బోధించడం చాలా ఇష్టమైన విషయం.చాలా మంది విద్యార్థులు ఇతని నైపుణ్యానికి ముగ్ధులయ్యేవారు. [[నిజాం వైద్య విజ్ఞాన సంస్థ]]లో చేరాడు. నైపుణ్యత ఆధారంగా [[ఎన్.టి.రామారావు]] కాలంలో కార్డియాలజీ ప్రొఫెసరుగా 1987లో పదోన్నతి పొందాడు.
 
ప్రస్తుతం సోమరాజు [[కేర్ హాస్పిటల్]] హెడ్, ఛైర్మన్.ఇతని ముఖ్యమైన ఉద్దేశం పేదవారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలకు అందజేయడం. ఈ సంస్థలో ఇంతవరకు ఇలాంటి సేవలు చాలా మందికి అందించి, ఉన్నతమైన సేవలందిస్తున్నాడు.
"https://te.wikipedia.org/wiki/భూపతిరాజు_సోమరాజు" నుండి వెలికితీశారు