భూమి వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 21:
|}
 
'''భూమి వాతావరణం''', [[భూమ్యాకర్షణ శక్తి]] వల్ల [[భూమి]]ని అంటిపెట్టుకుని ఉన్న [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]]లతో నిండి ఉన్న పొర. భూమిని ఆవరించి ఉన్న ఈ పొరలో సుమరుగా 78.08% [[నత్రజని]], 20.95% [[ఆమ్లజని]], 0.93% [[ఆర్గాన్]], 0.038% [[కార్బన్ డై ఆక్సైడ్]], అటూఇటుగా ఒక శాతం [[నీటి ఆవిరి]] మరియు, అతిస్వల్ప పరిమాణాలలో ఇతర వాయువులు ఉన్నాయి. ఈ వాయువుల కలయికను సాధారణంగా '''గాలి''' అని పిలుస్తారు. భూమిపైన ఉన్న జీవరాసులను అతినీలలోహిత కిరణాల బారినుండి కాపాడటానికి మరియూ పగలు/రాత్రుల ఉష్ణోగ్రతలను విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవకుండా చూడాటానికి ఈ వాతావరణం ఎంతయినా అవసరం.
 
ఫలానా చోట భూవాతావరణం అంతమై అంతరిక్షం మొదలౌతుందని విభజన రేఖ గీయటం కష్టం, అంతరిక్షం దగ్గరౌతున్నకొద్దీ వాతావరణం కొద్ది కొద్దిగా పలుచబడిపోతుంది. వాతావరణంలోని ముప్పావుభాగం భూమిచుట్టూ 11 కి.మీ.లలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతరిక్షం నుండి భూమిని చేరుకుంటున్నప్పుడు భూమి ఉపరితలానికి 120 కి.మీ.ల నుండే భూవాతావరణ ప్రభావాన్ని పసిగట్టవచ్చు. కొన్ని సందర్భాలలో ''కార్మాన్ రేఖ''ను భూవాతావరణానికీ, అంతరిక్షానికీ మధ్యన విభజన రేఖగా పరిగణిస్తూ ఉంటారు, ఇది భూమి ఉపరితలానికి 100 కి.మీ.ల దూరంలో నెలకొని ఉంటుంది.
పంక్తి 51:
* బాహ్యావరణము (Exosphere) :
 
ఎక్సోబేస్ పైన ఉన్న భూ వాతావరణాన్ని బాహ్యావరణము (Exosphere) అంటారు. ఇక్కడి అణువులు ఒకదానికొకటీ ఎంత దూరంగా ఉంటాయంటే, అవి ఒక దానికొకటీ ఢీకొనకుండా వందల కొద్దీ కి. మీ. ప్రయానణించగలవు. అణువులు ఢీ కొనకపోవడం వలన వాతావరణం fluid ధర్మాలను ప్రదర్శించదు. ఈ స్వేచ్ఛాయుత అణూవులు ballistic trajectories కలిగి అయస్కాంతావరణం (magnetosphere) లోకి గాని solar wind లోకి గాని ప్రవేశిస్తాయి.బాహ్యావరణంలో ముఖ్యంగా ఉదజని (hydrogen) మరియు, హీలియం (helium) ఉంటాయి.
 
=== వేరే పొరలు ===
"https://te.wikipedia.org/wiki/భూమి_వాతావరణం" నుండి వెలికితీశారు