మల్లికార్జున్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 7:
|occupation = గాయకుడు, సంగీత దర్శకుడు
}}
'''మల్లికార్జున్''' ఒక [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ గాయకుడు, సంగీత దర్శకుడు. ఈటీవీలో ప్రసారమైన [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] కార్యక్రమం ద్వారా పరిచయమై తరువాత సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకున్నాడు.<ref name=andhrajyothy>{{cite web|last1=వేమూరి|first1=రాధాకృష్ణ|title=ఓపెన్‌ హార్ట్‌లో గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున్‌|url=http://www.andhrajyothy.com/pages/openheartarticle?SID=182779|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=18 November 2016}}</ref> 150 కి పైగా పాటలు పాడాడు. [[కత్తి కాంతారావు]] సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు.<ref name=telugucinemacharitra>{{cite web|last1=గొరుసు|first1=జగదీశ్వర్ రెడ్డి|title=తాన్ సేన్ అనే వాళ్ళు|url=http://telugucinemacharitra.com/%E0%B0%97%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D/|website=telugucinemacharitra.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=19 November 2016}}</ref> [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] మరియు, ఇతర గాయకులతో కలిసి అనేక సార్లు విదేశే పర్యటనలు కూడా చేశాడు. పలు పాడుతా తీయగాలో తన సహగాయని యైన [[గోపిక పూర్ణిమ]] ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.<ref name=indiaglitz>{{cite web|title=Singers get married in the month of lovers|url=http://www.indiaglitz.com/singers-get-married-in-the-month-of-lovers-telugu-news-36496.html|website=indiaglitz.com|publisher=indiaglitz.com|accessdate=19 November 2016}}</ref> వారికి ఓ పాప ఉంది.
 
== వ్యక్తిగత జీవితం ==
మల్లికార్జున్ స్వస్థలం [[విశాఖపట్నం]]. తండ్రి నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేస్తుండంతో [[శ్రీశైలం]] కి బదిలీ అయింది.<ref name=telugucinemacharitra/> మల్లికార్జున్ ఇక్కడే జన్మించడం వల్ల అక్కడి దేవుడి పేరును పెట్టారు. అతనికి ఓ సోదరి ఉంది. ఆమె [[విజయవాడ]]లో జన్మించింది. ఆమె పేరు కనకదుర్గ. పాడుతా తీయగా లో పరిచయమైన గోపిక పూర్ణిమతో [[చెన్నై]]లో తరచు కలుస్తుండటంతో పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్ళకు పెళ్ళి చేసుకున్నారు.<ref name=andhrajyothy/> పాడుతా తీయగా ద్వారా వీరిరువురికీ బాగా పరిచయం, అభిమానం ఉన్న [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] పర్యటనలో ఉండటం వలన ఈ వివాహానికి హాజరు కాలేకపోయాడు. బాలు సోదరి మరియు, గాయని ఎస్. పి. శైలజ, గీత రచయిత [[భువనచంద్ర]], నటుడు [[చంద్రమోహన్]] తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.<ref name=indiaglitz/> వీరు [[చెన్నై]]<nowiki/>లోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ఉండటం వల్ల వీరికి తెలుగులోనే కాక [[తమిళం]], [[కన్నడ]] సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇవే కాకుండా కచేరీలు, ఆధ్యాత్మిక ఆల్బమ్స్ కూడా చేస్తున్నారు.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/మల్లికార్జున్" నుండి వెలికితీశారు