మాగంటి బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
[[కలకత్]]తాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. [[బెంగాల్]] ఆంధ్రా అసోసియేషన్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తరువాత అతను అన్నపూర్ణాదేవిని పెండ్లాడాడు.
 
"మల్లాది సత్యలింగం ప్రతిభా విద్యార్ధి"గా అతను [[అమెరికా]]లో ఉన్నత చదువులకు వెళ్ళాడు. అక్కడ "న్యూయార్క్ స్టేట్ కాలేజి ఆఫ్ అగ్రికల్చర్"లో బి.ఎస్‌.సి చదివాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్‌.సి పూర్తి చేశాడు. ప్రొఫెసర్ వెబర్ అనే పండ్ల నిపుణుని వద్ద పని చేశాడు. కార్నెల్ విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్పు లభించింది. కార్నెల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వ్యవసాయక సంఘం (International Agricultural Society of the Cornell University) కి అతను స్థాపకుడు మరియు, మొదటి ప్రెసిడెంట్ కూడాను. [[కాలిఫోర్నియా]]లో హిందూస్తాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.
 
తరువాత బాపినీడు [[భారత దేశం]] తిరిగి వస్తూ మధ్యలో [[జపాన్]] దేశాన్ని సందర్శించాడు. 1923లో [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీలో చేరాడు. కిసాన్ ఉద్యమం ప్రాంభించాడు. "ఆంధ్ర రైతు సభ" మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేశాడు. గోదావరి-కృష్ణా సెటిల్మెంట్ సెంట్రల్ కమిటీలో చురుకుగా పనిచేశాడు. కిసాన్ ఉద్యమాలు నడిపినందుకు ఆరు నెలలు జైలు శిక్ష అననుభవించాడు.
"https://te.wikipedia.org/wiki/మాగంటి_బాపినీడు" నుండి వెలికితీశారు