మావో జెడాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చైనా ప్రముఖులు తొలగించబడింది; వర్గం:చైనా వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 22:
}}
 
'''మావో జెడాంగ్''' (Mao Zedong) (జననం: డిసెంబరు 26, [[1893]]-మరణం: 1976 సెప్టెంబరు 9) ను మావో సే టుంగ్ (Mao Tse-tung) అని కూడా పలుకుతుంటారు. [[1949]]లో [[చైనా]]లో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడి [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]] (PRC) స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు మావో. అప్పటి నుండి [[1976]]లో మరణించే వరకు ఈయన చైనాను పరిపాలించాడు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తులలో మావో కూడా ఒకరు. మావో చైనా యొక్క సైనిక, పారిశ్రామిక, వ్యావసాయిక, మేధోపరమైన మరియు, సాంస్కృతిక పరమైన అన్ని ప్రణాళికలను నియంత్రించాడు.
 
కమ్యూనిష్టులు [[చైనా]]లో అధికారంలోకి వచ్చిన తరువాత మావో ప్రపంచమంతటా సుపరిచితుడు అయ్యాడు. చైనాలో పిన్నలు, పెద్దలు ఆయన నినాదాలను మరియు, ఆయన రచనలను అధ్యయనం చేసారు. [[గెరిల్లా యుద్ధం]] మరియు, సామ్యవాద విప్లవాలలో రైతాంగం యొక్క పాత్ర మొదలైన అంశాల గురించి ఆయన రచనలు చైనా వెలుపల చాలా ప్రభావం చూపాయి. [[మావో]] ఒక కవి కూడా.
 
== బాల్యం మరియూ చదువు ==
పంక్తి 36:
అధికారంలోకి రాగానే మావో [[సోవియట్ యూనియన్]]తో స్నేహం చేసి వారి సహాయంతో చైనా సైన్యాన్ని బలోపేతం చేసాడు. [[1950]]-53 మధ్య జరిగిన [[కొరియా యుద్దం]]లో సామ్యవాద దేశమైన [[ఉత్తర కొరియా]]కు మావో సహాయం చేసాడు.
 
కొరియా యుద్ధం తరువాత వ్యావసాయిక మరియు, పారిశ్రామిక ఉత్పాదకతను పెంచటానికి మావో చర్యలు తీసుకున్నాడు. [[1958]]లో ''[[గొప్ప ముందడుగు]] '' (Great Leap Forward) అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. [[సోవియట్ యూనియన్]]ను అనుసరించకుండా [[చైనా]] తనదైన పంథాలో నడవటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం విజయ వంతం కాలేదు. [[1960]] వ దశకంలో సోవియట్ యూనియన్ చైనాల మధ్యన విభేదాలు పొడసూపాయి.
 
అణు పరిశోధనా కార్యక్రమాన్ని ప్రారంభించి [[1960]] వ దశకంలో మావో నాయకత్వంలో చైనా [[అణుపరీక్ష]]లు జరిపినది.[[1959]]లో మావో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ఛైర్మన్ పదవి నుండి తప్పుకున్నాడు. కానీ దేశం మీద మరియు, పార్టీ మీద నియంత్రణను మాత్రం వదులుకోలేదు. 1960వ దశకంలో చైనా, సోవియట్ విభేదాలు ముదిరి కమ్యూనిష్టు ప్రపంచ నాయకత్వం కొరకు పరస్పరం సంఘర్షించుకున్నారు. [[మార్క్స్]], [[లెనిన్]] మరియు, [[స్టాలిన్]] ల అసలైన వారసుడు తానేనని మావో భావించాడు. సోవియట్ కమ్యూనిష్టులు [[అమెరికా]] యెడల అనుసరిస్తున్న మెతక వైఖిరి మావోకు నచ్చలేదు.
 
== సాంస్కృతిక విప్లవం ==
1960వ దశకం మధ్యలో చైనా దౌత్యపరమైన అనేక అపజయాలను చవిచూసింది. మావో ఈ సమయంలోనే విప్లవ స్ఫూర్తిని నిలిపి ఉంచుటకొరకు సంస్కరణ వాదులకు వ్యతిరేకంగా [[సాంస్కృతిక విప్లవం|సాంస్కృతిక విప్లవా]]నికి ([[1966]]-69) పిలుపునిచ్చాడు. పాత ఆచారాలు, పాత అలవాట్లు, పాత సంస్కృతి మరియు, పాత ఆలోచనా విధానాన్ని తుదముట్టించుట ఈ విప్లవ లక్ష్యంగా చెప్పబడింది.
 
[[1970]] వ దశకం ప్రారంభంలో [[చైనా]] పశ్చిమ దేశాలతో తన సంబంధాలను మెరుగు పరచుకున్నది. మావో [[1976]] సెప్టెంబరులో మరణించాడు.
 
మావో మరణం తరువాత చైనా నాయకులు అతని విధానాలను చాలావరకు వదులుకున్నారు. చైనా పరిశ్రమలను, వ్యవసాయాన్ని, సాంకేతిక పరిజ్ఞాన్ని మరియు, సైన్యాన్ని ఆధునీకరించుటకు [[జపాన్]], [[అమెరికా]] మరియు, ఐరోపా దేశాల సహాయాన్ని అర్థించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మావో_జెడాంగ్" నుండి వెలికితీశారు