మాస్టర్ వేణు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా సినిమా సంగీత దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 37:
'''మాస్టర్ వేణు''' ([[1916]] - [[8 సెప్టెంబర్]], [[1981]]) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఇతని అసలు పేరు '''మద్దూరి వేణుగోపాల్'''. వేణు మేనమామ అయినటువంటి రామయ్య నాయుడు గారి వద్దనే వాద్య [[సంగీతం]] నేర్చుకున్నారు. పదేళ్ళ వయసుకే ఈయన [[హార్మోనియం]] వాయించడంలో దిట్ట అయ్యాడు. 14వ యేట నుండే వేణు కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. [[భీమవరపు నరసింహరావు]] గారి స్వరసారథ్యంలో వచ్చిన "[[మాలపిల్ల]]" సినిమాకి సహాయకునిగా అలాగే హార్మోనిస్ట్ గా పనిచేశాడు. బొంబాయిలో మనహర్ బార్వే నడుపుతున్న "స్కూల్ ఆఫ్ మ్యూజిక్"లో చేరి, ఆరు నెలలు తిరగకుండానే ఆ విద్యాలయంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. అప్పట్నుంచే "మాస్టర్ వేణు" అయ్యాడు. వేణుకి [[నౌషాద్]] స్వరపరిచిన గీతాలంటే ఎనలేని మక్కువ. 1946లో వేణు బొంబాయి నుంచి తిరిగి వచ్చి మద్రాసులో ఉన్న ''హెచ్.ఎం.వి'' కంపెనీలో రెండేళ్ళు పనిచేశాడు. అక్కడ చాలా ప్రైవేట్ పాటలు స్వరపరచాడు.
 
విజయా వారు అమెరికా నుండి "హేమాండ్ ఆర్గాన్" అనే కొత్త వాద్యాన్ని ఆ రోజుల్లో పదహారు వేల రూపాయలకు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఈ వాద్యాన్ని అప్పట్లో వేణు తప్ప ఎవ్వరూ వాయించలేకపోయేవారు. ఆ వాద్యాన్ని "గుణసుందరి కథ", "పాతాళభైరవి" మరియు, "మల్లీశ్వరి" తదితర చిత్రాల్లో ఉపయోగించాడు.
 
==వ్యక్తిగత వివరాలు==
"https://te.wikipedia.org/wiki/మాస్టర్_వేణు" నుండి వెలికితీశారు