ముదిగొండ నాగలింగశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పాత్రికేయులు తొలగించబడింది; వర్గం:గుంటూరు జిల్లా పాత్రికేయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎జీవిత సంగ్రహం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 37:
 
==జీవిత సంగ్రహం==
వీరు 1876లో [[గుంటూరు జిల్లా]] [[తాడికొండ]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అహోరపతి మరియు, జ్వాలాంబిక. వీరు ఉద్భటారాధ్య వంశజులు, శక్తివిశిష్టశివాద్వైతి, భరద్వాజస గోత్రులు, ఆపస్తంబ సూత్రులు. వీరు ముదిగొండ నందికేశ్వర ఆరాధ్యుల వారిదగ్గర విద్యనభ్యసించారు. తరువాత పశ్చిమ గోదావరి జిల్లా [[కొత్తపల్లి అగ్రహారం]]లోని ఇవటూరి లింగయ్య శాస్త్రి వద్ద శాస్త్రాధ్యయనం చేశారు. తర్వాత కాళహస్తిలోని శ్రీనివాస శాస్త్రి వద్ద వ్యాకరణ శాస్త్రాన్ని, శ్రీనివాస దీక్షితుల వద్ద మీమాంస వేదాంతాది శాస్త్రాలను, నీలకంఠ శంకరరామానుజ మధ్వభాష్యాలను అధ్యయనం చేశారు. వీరు చదువుతున్నపుడే " రక్షారుద్రాక్ష చండమార్తాండ " అనే ఖండన గ్రంథాన్ని రచించారు. ఆనాడు రామనాథపురం రాజావారిచే నిర్వహించబడిన వైయాకరణ పరీక్షలో ఉత్తీర్ణులై పారితోషికం పొందారు. [[శార్వరి]] సంవత్సరంలో మద్రాసులో జరిగిన సభలో పండితులతో చర్చాగోష్టిలో శివుడే జగత్కారణ మనుట వేదసమ్మతమని సిద్ధాంతీకరించి ఆత్మకూరు సంస్థానాధీశుల నుండి సన్మానం పొందారు.
 
వీరు తెనాలి చేరి అక్కడి తెలుగు సంస్కృత కళాశాలలో పదకొండు సంవత్సరాలు సాహిత్య వ్యాకరణాధ్యాపకులుగా పనిచేశారు. తరువాత ఆ ఉద్యోగాన్ని విరమించి ' శైవరహస్య బోధిని ' అనే మాసపత్రిక నడిపి తన జీవితాంతం మతసేవలోనే కాలం గడిపారు. వీరు తన పత్రికలలో కారణోత్తరం, చంద్ర, జ్ఞానోత్తరం, ముకుటోత్తరం అనేవాటిని ఆంధ్ర తాత్పర్యంతో ప్రకటించారు.