ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎పురుషులు టోపీ ధరించడం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
 
'''ముస్లింల ఆచారాలు'''. ముస్లిం అనగా [[ఇస్లాం]]ను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు.
ఇస్లాం సూచనలకు మూలాధారాలు: [[ఖురాన్]], [[సున్నహ్]], [[హదీసులు]] మరియు, [[షరియా]].
 
ముఖ్య గమనిక: ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు.
పంక్తి 14:
: '''మూఢ విశ్వాసం''': కొందరు మౌల్వీలు, [[జిన్]] లు తమ వశంలో ఉన్నాయని, వాటి ద్వారా ఏలాంటి కార్యాలైనా సిధ్ధింపజేస్తామని పామరులకు నమ్మబలికి వారివద్దనుండి డబ్బులు రాబట్టడం తరచూ చూస్తూంటాము. ముస్లింలై ఉండీ [[అల్లాహ్]] పై బలమైన విశ్వాసంలేని వారు, ఇలాంటి మూఢనమ్మకాల షికారు అవుతారు. షికారుచేయువాడు ధార్మికవిషయాలు తెలిసినవాడేనని మరువకూడదు. కానీ ఇతనికి తెలిసింది అసత్యమనేది సత్యం.
 
ఈ చేష్టలు మరియు, మూఢవిశ్వాసాలనుండి ప్రజలను బయటపడవేయడానికే [[ఇస్లాం]] అవతరించింది.
ఇస్లాం సదాచారాలకు పుట్టినిల్లు.
ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు.
పంక్తి 23:
 
ఇస్లాం [[నికాహ్]] లేదా వివాహాన్ని ధర్మబద్ధం చేసి ప్రోత్సహించింది. నికాహ్ చేసుకోవడం దైవప్రవక్త సత్సంప్రదాయం. [[సున్నత్]] బ్రహ్మచర్యాన్నీ, వైరాగ్యాన్నీ ఇస్లాం వ్యతిరేకించింది. వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలో ఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్ధీకరిస్తుంది. వ్యభిచారం లేదా [[హరామ్]] నిషిద్ధం. వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక జాడ్యమేమనగా నికాహ్ రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు. ఇందులో అయ్యే ఖర్చు వర్ణనాతీతం. దుబారా ఎక్కువ.
భారతదేశంలో ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ. ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలామంది మౌల్వీలు, మౌలానాలు మరియు, ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ: షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు. వీళ్లెవరూ నూర్ బాషా, దూదేకుల సాయిబుల్ని పెళ్ళిచేసుకోరు సరిగదా లదాఫ్, పింజారీ అనే పేరులతో అవమానిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసం సమయం వచ్చిందంటే, అల్లాహ్ ముందు అందరూ సమానమే అని ఘోషిస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి స్వర్గప్రాప్తిని కలిగిస్తుందా? ఆచరించేది మనమే అయినపుడు దాని నింద నిష్టూరాలు ఇతరుల మీద మోపడం అల్లాహ్ దృష్టిలో శిక్షార్హం.
 
== నామకరణాలు ==
పంక్తి 39:
 
== పురుషులు టోపీ ధరించడం ==
[[ముహమ్మద్ ప్రవక్త]] ఎల్లప్పుడూ తలను పగడీ లేదా టోపీతో కప్పి ఉంచేవారు. దీనిని అనుసరిస్తూ ముస్లింలలో పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకు మరియు, గౌరవానికి ప్రతీకలు. ఇవి పలు రకాలు: టోపీ, ఫెజ్ వగైరా. కాని ఇది తప్పనిసరి కాదు. టోపీ లేకుండానే నమాజ్ చదివే ముస్లింలు మనకు అక్కడక్కడా గోచరిస్తారు.
 
==ఈద్ ముబారక్==
{{ప్రధాన వ్యాసం|ఈద్ ముబారక్}}
పండుగల సందర్భంగా [[ఈద్ ముబారక్]] తెలుపుతారు. "ఈద్ ముబారక్" అనగా "ఈద్ శుభాకాంక్షలు" లేదా "పండుగ శుభాకాంక్షలు". ప్రధాన పండుగలైన [[ఈదుల్ ఫిత్ర్]] (రంజాన్ పండుగ), మరియు [[ఈదుల్ అజ్ హా]] (బక్రీదు పండుగ) సందర్భంగా ఈద్ ముబారక్ అని సంబోధిస్తారు. అలాగే [[మీలాదున్ నబి]] (ముహమ్మద్ ప్రవక్త జన్మ దినం) సందర్భంగా "మీలాదున్నబి ముబారక్" అని సంబోధిస్తారు. పుట్టిన రోజు సందర్భంగా "యౌమ్ ఎ పైదాయిష్ ముబారక్" అనీ. అలాగే ఇతర మతస్తుల పండుగల సందర్భంగా "దీపావళి ముబారక్" అనీ, "క్రిస్మస్ ముబారక్" అనీ సంబోదిస్తారు.
 
== స్త్రీలు హిజాబ్ ధరించడం ==
{{ప్రధాన వ్యాసం|హిజాబ్}}
[[Image:Hijabexamples2.jpg|left|''హిజాబ్''కు నాలుగు ఉదాహరణలు. గడియారపు ముల్లు విధంగా పైఎడమ నుండి, [[టర్కీ]]; [[దుబాయి]] [[యు.ఏ.ఇ.]]; [[టెహరాన్]] [[ఇరాన్]]; మరియు, [[జైపూర్]], [[రాజస్థాన్]], [[భారతదేశం]].|thumb]]
 
'''హిజాబ్''' లేదా '''పరదా''' ('''[[అరబ్బీ భాష|అరబ్బీ]] : حجاب ''')
 
ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా ''గౌరవంతో కూడిన హుందాతనం'', ''వ్యక్తిగతం'', మరియు ''సద్-నీతి''.<ref name="dict">{{cite book | last = Esposito | first = John | authorlink = John Esposito | title = [[The Oxford Dictionary of Islam]] | publisher = [[Oxford University Press]] | year = 2003 | doi = | id = ISBN 0-19-512558-4 }}, p.112</ref> ఈ పదము [[ఖురాన్]] లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడింది. దీనినే ఉర్దూలో ''పరదా'' లేదా ''నఖాబ్'', అరబ్బీలో 'ఖిమార్' '''خمار''' అంటారు.
 
ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. ''[[బురఖా]]'' భారతీయ, ఆఫ్ఘానీ, ఇరాకీ మరియు, ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడ ఉన్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.
 
== సమాధులను సందర్శించడం ==
పంక్తి 77:
* సమాధుల వద్ద సాష్టాంగ ప్రణామాలు చేయరాదు.
* సమాధులలో వున్న వారితో నోములు (మన్నత్ లు) నోచరాదు.
* సమాధులలో ఉన్న వారితో ప్రార్థనలు చేయరాదు. కారణం అన్ని ప్రార్థనలు ఆలకించువాడు మరియు, తీర్చువాడు [[అల్లాహ్]] ఒక్కడే.
* సమాధుల చుట్టూ '[[తవాఫ్]]' (ప్రదక్షిణ) లు చేయరాదు.
* సమాధుల వద్ద ఔలియాలను స్తోత్తం చేస్తూ ఎల్లవేళలా [[మన్ ఖబత్]]లు పాడుకుంటూ ఉండిపోరాదు. ఇలా చేస్తూ పోతే అసలైన ఈశ్వరుడిని ([[అల్లాహ్]]) ను మరచిపోతారు.
* సమాధులే మనకు సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే గృహద్వారాలు అనే వింత పోకడను విడనాడాలి.
* తల నీలాలు సమర్పించరాదు.
* సమాధులలో నిద్రించేవారి పేరున, ఔలియాల పేరున తావీజులు, తాయెత్తులు ధరించరాదు. కారణం ఔలియాలు ఇవన్నీ నేర్పించలేదు. ఇలాంటి మూఢ మరియు, అంధవిశ్వాసాలను దూరం చేయడానికే 'ఔలియాలు' పనిచేశారు. తిరిగి 'ఔలియా'ల పేరుతో ఈ మూఢవిశ్వాసాలను నెలకొల్పి, ఔలియాలకు చెడ్డపేరు తేకూడదు.
 
==ఆచారాల పరంగా ముస్లింలలో నేటి స్థితి==
ముస్లింలు విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించరు. కాని [[దక్షిణ ఆసియా]] మరియు, [[పర్షియన్]] మరియు, [[షియా మతం]] యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో క్రింది విషయాలు గోచరిస్తాయి. భారతదేశంలోని ముస్లిం సమాజాలలో వీటి ప్రవేశం ఎలా జరిగిందంటే, [[నవాబ్|నవాబులు]] దాదాపు [[షియా]] మతానికి చెందినవారు. ఉదాహరణకు [[లక్నో]] నవాబు, [[అవధ్]] నవాబు, [[బెంగాలు]] నవాబు, [[బహమనీ సుల్తానులు]], [[కుతుబ్ షాహీ వంశము]], [[ఆసఫ్ జాహీ వంశము]], [[టిప్పూ సుల్తాన్]], ఆర్కాడు నవాబు, మదురై నవాబు, వీరందరూ షియాలే. మైసూర్ సామ్రాజ్యానికి పాలకునిగా ఎదిగిన [[హైదర్ అలీ]] క్రీ.శ.1761-82 మధ్య మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన మైసూరులోని నంజనగూడులో నంజుండేశ్వరాలయం అనే గొప్ప దేవాలయంలో తన పేరుతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని కోరి హైదరు లింగం అనే లింగం ప్రతిష్ఠించారు. ఆ లింగానికి ధూపదీపనైవేద్యాలు జరిపించేందుకు హైదరాలీ చాలా సొమ్మునిచ్చి దేవాదాయాన్ని ఏర్పాటుచేశారు. హైదరాలీకి ఒక ప్రియమైన ఏనుగుకు కంటిజబ్బు చేసి ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్థానికుల సూచనతో నంజుండేశ్వరస్వామికి మొక్కుకున్నారు. కొద్దిరోజుల్లోనే ఆ ఏనుగుగున్నకు జబ్బునయం కాగా సంతోషంతో నవరత్నాలు పొదిగిన బంగారు హారాన్ని సమర్పించుకున్నారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref> వీరి పరిపాలనా కాలంలో చాలా [[దర్గాలు]], [[ఆషూర్ ఖానా]] లు, ముహర్రం పీర్ల పండుగలు, (నేటికినీ [[లక్నో]] మరియు, [[హైదరాబాదు]] నగరాలలో చూడవచ్చును), ఫాతెహా ఖ్వానీలు, కుండోంకే ఫాతెహా (రజబ్ నెలలో ఇమాం జాఫర్-ఎ-సాదిక్ మన్నత్ లేదా నోము), ఘడీ కే ఫాతెహా, చరాగోంకే ఫాతెహా (దీపాల మన్నత్), దర్గాల వద్ద 'షిఫా ఖానా' లు, చెరువులు గుంటలు, కొలనులలో మునగడం లాంటి విషయాలు, వెలిశాయి. ఇలాంటి అంధవిశ్వాసాల నుండి మానవాళిని కాపాడడానికే [[ఇస్లాం]] అవతరించింది. కాని, నేటికినీ చాలా మంది ముస్లింలు 'అజ్ఞాన కాలం'లోనే విహరిస్తున్నారనే భావన నేటి లోకం భావిస్తున్నది. పెద్ద పెద్ద ముస్లిం సుల్తానులు [[ఔలియా]] ల వద్ద నోములు నోచితే (ఉదాహరణకు [[అక్బర్]] తనకు సంతానం లేదని [[సలీం చిష్తీ]] అనే సూఫీ [[ఔలియా]] సమాధి వద్ద మన్నత్ (నోము) చేశాడు) సాధారణ జనం అలాంటి చక్రవర్తులను అనుకరించడంలో అతిశయోక్తిలేదు.
 
* [[దర్గాహ్|దర్గాలు]]
పంక్తి 92:
* [[ఔలియాల నషాన్]]లు ([[ఔలియా]] ల పేరును తగిలించి అక్కడక్కడా ప్రతిష్ఠానాలు)
 
పైన ఉదహరించిన విషయాలు [[ఇస్లాం]] ప్రబోధించినవా కావా అనే వాటి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ సరైన విషయాలేనని [[సున్నీ బరేల్వీ జమాత్]], సరైనవి కావు అని [[తబ్లీగీ జమాత్]] పరస్పర విరుద్ధ ప్రకటనలు మరియు, బోధనలు చేపడుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు, వీరిమధ్య అడపాదడపా వాగ్వాదాలు, చిన్న చిన్న కొట్లాటలు, మరియు ఒకరికి వ్యతిరేకంగా ఒకరి దూషణలు సర్వ సాధారణం.
 
== పురుషులకు ఖత్నా (సున్తీ) చేయడం ==
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు