ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎విశేషములు: clean up, replaced: మరియు → ,
పంక్తి 36:
తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే [[కవిత్వం]] చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండిఉండాలనిపిస్తున్నది. తనకు పాండిత్యం లేదని మొల్ల వ్రాసినది సంస్కృతిలో భాగమైన అణకువ, విధేయత వంటి లక్షణాల కారణంగానే తప్ప వేరే కాదని స్త్రీ రచయిత్రుల చరిత్ర వ్రాసిన [[నిడదవోలు మాలతి]] భావించారు.<ref name="నిడదవోలు మాలతి">{{cite book|last1=నిడదవోలు|first1=మాలతి|title=Telugu Women Writers, 1950-1975|date=2013|url=https://tethulika.files.wordpress.com/2010/03/telugu-women-writers-1950-19752.pdf|accessdate=24 May 2015}}</ref>
 
[[గ్రంధావతారిక]]ను బట్టి ఈమె తక్కిన కవయిత్రులవలె గురువునొద్ద విద్యనభ్యసించలేదని, గోపరపు శ్రీకంఠ మల్లేశుకృపను [[కవిత్వము]]ను చెప్పనేర్చినదనియు తెలియుచున్నది. ఈమె కావ్యలక్షణాదికముల నేమియు నెరుంగక పోయినను నన్నయ తిక్కనాది కవుల గ్రంథములను మాత్రము క్షుణ్ణముగా చదివినదని ఈమె [[పద్యము]]<nowiki/>ల తీరు నడకలను బట్టి చెప్పవచ్చును.ఈమెపై పోతన కవితా ప్రభావము ఎక్కువగాగలదు. '''పలికెడది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట...''' అని పోతన చెప్పిన మాదిరిగనే ఈమె రామాయణమందు '''చెప్పమని [[రామావతారము|రామచంద్రుడు]], చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్''' అని పల్కినది. సర్వగుణాకరుడు శ్రీరాముని చరితమును నెందరెన్ని విధముల రచన గావించినను నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనలపొందై యలరారు చుండుటతానీ గ్రంథమును చేపట్టుటకు కారణమని చెప్పినిది.మరియు, అట్టి మహాత్ముని చరితమును కందువ మాటల్ నందముగా కూర్చి పఠితలకు శ్రోతలకు విందును గూర్తునని ముందంజ వేసింది.
గ్రంథావతారిక యందు చెప్పబడిన విషయముల వల ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరుధుని [[పుత్రకామేష్ఠి]], శ్రీరామచంద్రుని జననమాదిగా రావణవధానంతరము ముగియుచున్నది.ఉత్తరరామాయణముని స్పృశించలేదు.
 
"https://te.wikipedia.org/wiki/ఆతుకూరి_మొల్ల" నుండి వెలికితీశారు