ఆరాధ్యుల కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రంగస్థల ప్రస్థానం: clean up, replaced: మరియు → ,, typos fixed: జులై → జూలై, లు → లు , ప్రతిష్ట → ప్రతిష్ఠ, → (2), , → ,
పంక్తి 5:
 
== రంగస్థల ప్రస్థానం ==
చిన్నతనం నుండి తన తండ్రి నాటకాలు చూస్తూ పెరిగిన కోటేశ్వరరావుకు నాటకాలపై అభిమానం పెరిగింది. [[విద్యార్థి]] దశలోనే పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించారు. 1985లో [[కళాశాల]] విద్య పూర్తి చేసి, పూర్తిస్థాయి రంగస్థల నటునిగా స్థిరపడ్డారు. వీరి నటనకు పేక్షకుల నుండి ప్రశంసలు లభించడమేకాకుండా, తెనాలిలో గల ముఖ్యమైన నటులలో ఒకరుగా గుర్తింపబడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలోనేకాక మద్రాసు కళాసాగర్ లో, బొంబాయి ఆంధ్ర మహాసభలో మరియు, ఒరిస్సాలో నాటకాలు ప్రదర్శించి, పేరు ప్రతిష్టలుప్రతిష్ఠలు సంపాదించారు. 1994లో మద్రాసులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో [[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|శ్రీకృష్ణ తులాభారం]] నాటకం ప్రదర్శించి, ప్రశంసలు పొందారు.
 
1992 జులైలోజూలైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, [[తెలుగు విశ్వవిద్యాలయం]] సంయుక్తంటా నిర్వహించిన రాష్ట స్థాయి నాటక పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి 172 నాటక సమాజాలవారు పాల్గొన్నారు. అందులో [[తెనాలి]] నుండి శ్రీ వెంకట లక్ష్మిదుర్గా నాట్యమండలి పేరుతో కోటేశ్వరరావు బృందం ప్రదర్శించిన కృష్ణరాయబారం నాటకం ప్రథమ బహుమతి (రూ. 30,000/- లు నగదు, పెద్ద జ్ఞాపిక, ప్రశంసాపత్రం) పొందింది.
 
=== నటించిన పాత్రలు ===