ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: లు కంటే → ల కంటే, ె → ే (2), , → , (5)
పంక్తి 49:
ఏది ఏమైతేనేమి. ఎప్పుడో, ఎవ్వరో కనిపెట్టేరు. పళ్లనీ, పళ్ల రసాలనీ అలా ఆరు బయట వదిలెస్తే అవి పులిసి, క్రమేణా ఆల్కహాలుగా మారతాయని. ఏమవుతుందంటే మన కంటికి కనబడని [[ఈస్ట్]] (yeast), లేదా తెలుగులో మధుశిలీంధ్రం, అనే పుట్టగొడుగు జాతికి చెందిన సూక్ష్మజీవులు ఈ రసంలో పడి, రసంలోని చక్కెరని ఆల్కహాలుగా మార్చెస్తాయి. దీనినే పులియబెట్టడం అని కాని, కిణ్వప్రక్రియ అని కాని, ఫేనీకరణం అని కాని తెలుగులోనూ, ఫెర్మెంటేషన్ (fermentation) అని ఇంగ్లీషులోనూ అంటారు. తెలిసో, తెలియకో అనాది మానవుడు ఇలా పులిసిన పదార్థాలు తిన్నాడు. తదౄపేణా కలిగే చిరు ఆనందానుభూతిని చవి చూసేడు. అనుభవించిన మానవుడు రుచి మరిగేడు. ప్రత్యేకం పనిగట్టుకుని పదార్థాలని పులియబెట్టి ఆ సారాన్ని సారాబుడ్లలో పోసి తాగడం మొదలు పెట్టేడు. మొట్టమొదటి వ్యాపారం వ్యభిచారం అయితే మొట్టమొదటి పరిశ్రమ సారా చెయ్యడం అయి ఉంటుంది. మొట్టమొదట మానవుడు మచ్చిక చేసుకున్న జీవి – గుర్రమూ కాదు, కుక్కా కాదు, కోడీ కాదు – ఈ మధుశిలీంద్రం అని ఢంకా కొట్టి చెప్పవచ్చు.
 
ఈ ఈస్ట్ సర్వాంతర్యామి. ఇది గాలిలో తేలియాడుతూ సర్వత్రా వ్యాప్తి చెందిన జీవి. ఇది మన శరీరం మీదా, లోపలా కూడా ఉంటుంది. మనలోలాగే ఈ ఈస్టులో రకరకాల జాతులు ఉన్నాయి. వీటిల్లో ఒక జాతి ఫేనీకరణంలో అందెఅందే వేసిన చెయ్యి. అందుకనే పెరుగు బాగా తోడుకోవాలంటే పక్కింటికి వెళ్లి ఈ ఈస్టు “తోడు” తెచ్చుకుంటాం. [[తరవాణీ]] తయారు చెయ్యాలన్నా ఈ రకం “తోడు” కావాలి.
 
ఈ ఫేనీకరణం (పులియబెట్టడం) అనే ప్రక్రియ వెనక ఉన్న శాస్త్రంలో పెద్ద రాచరహశ్యం ఏమీ లేదు. ఈ మధుశిలీంధ్రం కణాలు చక్కెరని తిని “మలమూత్రాల” వలె రెండు వ్యర్ధ పదార్థాలని విడుదల చేస్తాయి: ఒకటి ఎతల్ ఆల్కహాలు, రెండవది బొగ్గుపులుసు వాయువు లేదా కార్బన్ డై ఆక్సైడ్ (carbon dioxide). రసాయనశాస్త్రపు దృష్టిలో, మనం వందలు పోసి కొనుక్కున్న “షివాస్ రీగల్” సీసాలో ఉన్నది మిలియన్ల పైబడి ఈస్టు కణాలు విసర్జించిన “దేహజలాలు.”
పంక్తి 81:
 
ఈ ఐసోప్రోపైల్ ఆల్కహాలుకి ప్రొపనోలుప్రొపనోల కంటే మంచి పేరు మరొకటి ఉంది; అదే 2-ప్రొపనోలు. ఇక్కడ 2 ని చూడగానే రెండవ (ఎటునుండి లెక్కించినా రెండవదే!) కర్బనపు అణువుకి ప్రత్యేకత ఉంది అని చెబుతోంది. ఏమిటా ప్రత్యేకత? అక్కడ (-OH) గుంపు ఉండడం. కనుక “2-ప్రొపనోల్” అని చెప్పగానే రెండవ (మధ్య) కర్బనపు అణువుకి హైడ్రాక్సిల్ గుంపు తగిలించి ఉంది, మిగిలినవాటికి ఉదజని అణువులే తగిలించి ఉన్నాయి అని అర్థం. ఈ “2-ప్రొపనోల్”ని తెలుగులో “2-త్రయోల్” అని పిలవచ్చు.
 
ఈ ఐసోప్రోపైల్ ఆల్కహాలు (2-త్రయోల్) లక్షణాలు కొన్ని పరిశీలిద్దాం. ఇది విష పదార్థమే కాని మెతల్ ఆల్కహాలు (మెతనోలు) అంత అన్యాయం కాదు. దీనికున్న ఘాటైన రుచి వల్ల ప్రజలు పరాగ్గా కూడా దీనిని తాగడానికి ఇష్టపడరు. తాగకుండా ఉంటే ఇది ప్రమాదకరమైనది కాదు. ఈ 2–త్రయోల్ శరీరానికి పూసుకుంటే చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకనే పైపూతలకి వాడే సెంట్లు, అత్తరులు, గీసుకునే ముందు గడ్డానికి పులుముకోడానికి, సిరాలలోను దీనిని విరివిగా వాడతారు. చిన్న పిల్లలకి జ్వరం బాగా వస్తే, ఉష్ణాన్ని త్వరగా తగ్గించడానికి వైద్యులు ఈ 2-త్రయోల్ ని శరీరానికి రాసి, మర్దనా చేస్తారు. మర్దనా చెయ్యడాన్ని ఇంగ్లీషులో “రబ్బింగ్” అంటారు కనుక దీనిని రబ్బింగ్ ఆల్కహాల్ (rubbing alcohol) అని కూడా పిలుస్తారు. ఈ రబ్బింగ్ ఆల్కహాలుకి తెలుగు పేరు మర్దనోలు. ఇది శరీరానికి రాసి మర్దనా చేసే ముందు చర్మం ఎక్కడా పగిలిపోయి కాని, చీరుకుపోయి కాని, తెగిపోయి కాని ఉండకూడదు. పైన ఉన్నంతసేపే దీని ఉపయోగం; లోపలికి వెళితే ప్రమాదం.
పంక్తి 92:
[[దస్త్రం:Alcohol by Country.png|thumb|200px|Total recorded [[alcohol consumption by country|alcohol per capita consumption]] (15+), in litres of pure alcohol<ref>[http://www.who.int/entity/substance_abuse/publications/global_status_report_2004_overview.pdf Global Status Report on Alcohol 2004]</ref>]]
 
* కొన్ని ఆల్కహాలులని, ముఖ్యంగా ఇథనాల్ (ఎతనాల్‍) మరియు, మిథనాల్ (మెతనాల్‍) వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
* ఆల్కహాల్‍ని పరిశ్రమలలోనూ, శాస్త్రీయ ప్రయోగశాల పరీక్షలలోనూ మాత్రమే కాకుండా [[ద్రావణి]] (Solvent) గా కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని వైద్య సంబంధమైన [[మందులు]], పరిమళ ద్రవ్యాలు మరియు, వెనీలా వంటి పదార్ధాలకు ద్రావకంగా ఉపయోగిస్తున్నారు.
* ఇథనాల్ క్రిమి సంహారకంగా చర్మం మీద [[సూదిమందు]] (injections) ఇచ్చే ముందు కొన్ని సార్లు అయొడిన్ తో కలిపి ఉపయోగిస్తారు. ఇథనాల్ కలిపిన సబ్బులు తయారుచేస్తున్నారు.
* ఆల్కహాల్ [[సంగ్రహాలయం|సంగ్రహాలయాలలో]] కొన్ని శరీరభాగాల్ని నిలవచేయడానికి ఉపయోగిస్తున్నారు.
పంక్తి 188:
ఆల్కహాలు [[పరిశ్రమ]]లలో వివిధ పద్ధతులలో తయారుచేయవచ్చును:
* [[కిణ్వనప్రక్రియ]] (Fermentation) ద్వారా పిండి పదార్ధాలను జలవిశ్లేషణం (Hydrolysis) ద్వారా విడగొట్టిన [[చక్కెర]]ల నుండి తయారుచేసిన [[గ్లూకోజ్]] పై [[ఈస్ట్]]ను నిర్ధిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించి తయారుచేస్తారు.
* [[ముడి చమురు]] (crude oil) లోని ఇథిలీన్ లేదా ఇతర ఆల్కీనులను విడగొట్టి హైడ్రేషన్ ద్వారా ఇథనాల్ ను తయారుచేస్తారు. ఈ చర్యకు ఫాస్ఫారిక్ ఆమ్లం ఉత్ప్రేరకంగా అధిక ఉష్ణోగ్రత మరియు, పీడనం వద్ద జరిపిస్తారు.
* [[మిథనాల్]]ను [[కార్బన్ డై ఆక్సైడ్]] మరియు, [[హైడ్రోజన్]] వాయువును విలీనం చేసి దానికి [[రాగి]], జింక్ ఆక్సైడ్ మరియు, అల్యూమినియం ఆక్సైడ్ లను ఉత్ప్రేరకాలుగా 250&nbsp;°C ఉష్ణోగ్రత వద్ద అధిక పీడనం ఉపయోగించి తయారుచేస్తారు.
 
=== అంతర్గతంగా ===
పంక్తి 200:
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], ఉత్తర ఆల్కహాలీయం, (Alcohol, part 2), [[భారతి]], Bharathi, 65 (8) : 39-44, August 1988.
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], ఆల్కహాలు, (Alcohol), [[భారతి]], Bharathi, 65 (3) :16-21, March 1988.
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, ఇ-పుస్తకం, కినిగెకినిగే ప్రచురణ, kinige.com
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు