28,602
దిద్దుబాట్లు
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి...వడుగా ! ఎవ్వరి వాడవు? నీకేమి కావలయును కోరుకొమ్మన్నాడు.
"ఒంటి వాడను నేను. నాకు ఒకటి మరియు రెండడుగుల మేర యిమ్ము . అయినను అడుగమంటివి కనుక అడిగితిని. దాత పెంపు సొంపు తలపవలెను గదా! కావున నాకు మూడడుగుల నేలనిమ్ము, చాలు'' అని మాయావడుగు పలికెను. ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించెను. బలి గురువుకు వినయముగా నమస్కరించి ...ఇచ్చెదనని పలికితిని. ఆడిన మాట తప్పను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నీవిచ్చినచో అఖిలంబు పోవును. అంతేకాక...
అది పాపము కాదు. అని శుక్రాచార్యుడు వివరించెను. దానికి బలి చక్రవర్తి ..కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతింబొందరే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనంగలదే! శిబి లాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి కదా! భార్గవా! అని పలుకుతూ తన మాటను తోసి పుచ్చిన రాజును పదభ్రష్ఠునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు.
== శుక్రాచార్యుడు ఏకాక్షుడగుట==
అయినను బలిచక్రవర్తి హరిచరణములు కడిగి, త్రిపాద ధరిణిం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశరంధ్రమును బొడువగా కన్ను పోగొట్టుకొని శుక్రాచార్యుడు ఏక నేత్రుడయ్యెను. ''పుట్టి నేర్చుకునెనో, పుట్టక నేర్చెనో.. ఈ పొట్టి వడుగునకీ చిట్టి బుద్ధులెట్లబ్బెనో, ఈతని పొట్టనిండా అన్నీ భూములే..'' అని నవ్వుతూ మూడడుగుల నేలను బలి వడుగుకు దానమిచ్చెను.
|
దిద్దుబాట్లు