ఎ. ఆర్. రెహమాన్: కూర్పుల మధ్య తేడాలు

20 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే , , → ,
చి వర్గం:భారతీయ గాయకులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే , , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
}}
 
'''ఎ. ఆర్. రెహమాన్''' పేరుతో పేరుగాంచిన '''అల్లా రఖా రెహమాన్''' ({{audio|A R Rahman.ogg|pronunciation}} (జ.[[6 జనవరి]] [[1967]]) ఒక ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, మరియు, దాత.<ref name="జయహో రెహమాన్">{{cite web|title=జయహో రెహమాన్|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=17580|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=27 November 2017|archiveurl=https://web.archive.org/web/20171127065448/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=17580|archivedate=27 November 2017}}</ref> రెహమాన్ జన్మనామం '''ఎ. ఎస్. దిలీప్ కుమార్'''. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.
 
రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని (ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం) ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు [[ఆస్కార్ అవార్డు]]లు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి.
 
== జీవితం ==
రెహ్మాన్‌ అసలు పేరు [[ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్]]‌. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు [[జి. వి. ప్రకాష్]] కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా [[ఇళయరాజా]], [[రమేష్ నాయుడు]], [[రాజ్ కోటి]] లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్ ''వండర్ బెలూన్'' అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు.
 
పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.
 
తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు.<ref name="అమ్మకు అంతకు మూడింతలు కొనిచ్చా!!">{{cite web|last1=జె.|first1=రాజు|first2=|last2=వీరాంజనేయులు|title=అమ్మకు అంతకు మూడింతలు కొనిచ్చా!!|url=http://archives.eenadu.net/11-26-2017/movies/latest-movie-news.aspx?item=interviews&no=271|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=27 November 2017|archiveurl=https://web.archive.org/web/20171127055241/http://archives.eenadu.net/11-26-2017/movies/latest-movie-news.aspx?item=interviews&no=271|archivedate=27 November 2017|location=హైదరాబాదు}}</ref>
పంక్తి 31:
 
== సంగీత ప్రస్థానం ==
సినిమాల్లోకి రాక మునుపు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమకూర్చాడు. తెలుగులో రెహమాన్ మొదటి ప్రాజెక్టు అదే. బాపు కుమారుడు వేణుగోపాల్ వ్యక్తిగతంగా రెహమాన్ కు మంచి స్నేహితుడు కూడా.
 
తన సంగీత జీవితాన్ని [[రాజ్ - కోటి]] లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం [[సంతోష్-శివన్]] ల దర్శకత్వంలో [[మోహన్ లాల్]] కథానాయకునిగా నటించిన [[యోధ]] సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా [[రోజా]] ద్వారా మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్ సంగీతం సమకూర్చేవాడు. అలా మణిరత్నంతో పరిచయం ఏర్పడింది.
పంక్తి 38:
 
== గౌరవాలు బిరుదులు ==
టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్‌ కు ''మొజార్ట్ ఆఫ్ మద్రాస్'' బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. "[[స్లమ్‌డాగ్ మిలియనీర్]]" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన "[[గోల్డెన్ గ్లోబ్ అవార్డు]]", రెండు [[ఆస్కార్ అవార్డు]]లను అందుకొన్న తొలి భారతీయుడు. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు.
 
2005 లో టైం మ్యాగజీన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్ లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది. 2009 లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశోలురైన వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు.
 
== కుటుంబం ==
పంక్తి 110:
* [[:en:Swadesh|స్వదేశ్]]
* [[:en:Lagan|లగాన్]]
* [[:en:Rang de basanti|రంగ్ దెదే బసంతి]]
* [[:en:Guru (2007 film)|గురు]]
* [[జోధా అక్బర్]] (2008)
71,534

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2884256" నుండి వెలికితీశారు