లాలా అమర్‌నాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను (2), చినాడు → చాడు, → (2) using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''లాలా అమర్ నాథ్''' ([[1911]] - [[2000]]) [[1933]] నుంచి [[1952]] వరకు 19 సంవత్సరాలు [[భారతదేశం]] తరఫున టెస్ట్ [[క్రికెట్]] ఆడిన కుడిచేతివాటం గల బ్యాట్స్‌మెన్.
==జీవితం==
[[సెప్టెంబర్ 11]], [[1911]] న [[పంజాబ్]] లోని [[కపుర్తాలా]]లో లాలా అమర్‌నాథ్ జన్మించాడు. దేశ విభజన తరువాత భారత దేశానికి నాయకత్వం వహించిన తొలి [[భారతదేశపు టెస్ట్ కెప్టెన్లు|కెప్టెన్]] కూడా ఇతనే. అతని కుమారులు [[సురీందర్ అమర్‌నాథ్]] మరియు, [[మోహిందర్ అమర్‌నాథ్]]. మొహీందర్ అమరనాధ్ కూడా టెస్ట్ క్రికెట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను [[2000]]లో మరణించాడు.
 
==ప్రస్థానం==
[[1933]] [[డిసెంబర్ 15]] న తొలి టెస్ట్ ఆడుతూ సెంచరీ సాధించాడు. అది టెస్ట్ క్రికెట్ లో భారతీయుడు సాధించిన తొలి శతకం. తొలి టెస్ట్ లోనే శతకం సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. [[1952]] డిసెంబర్ వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన లాలా అమర్‌నాథ్ మొత్తం 24 టెస్టులు ఆడి 878 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం మరియు, 4 అర్థ శతకాలున్నాయి. టెస్ట్ క్రికెట్ లో [[బౌలింగ్]] చేసి 45 వికెట్లు కూడా పడగొట్టాడు. [[డొనాల్డ్ బ్రాడ్‌మెన్]]ను హిట్ వికెట్ ద్వారా ఔట్ చేసి అతనిని ఆ విధంగా ఔట్ చేసిన ఏకైక బౌలర్ గా నిల్చాడు. అతను రెండు పర్యాయాలు టెస్ట్ సీరీస్ లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. పటౌడీ సీనియర్ తర్వాత ఒకసారి, [[విజయ్ హజారే]] తర్వాత మరోసారి నాయకత్వ పగ్గాలు చేపట్టాడు. తొలిసారిగా [[పాకిస్తాన్]]ను టెస్ట్ సీరీస్ లో అతని నాయకత్వం లోనే భారత్ విజయం సాధించింది.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/లాలా_అమర్‌నాథ్" నుండి వెలికితీశారు