"లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
 
'''[[లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్]]''' (ఆంగ్లం: Life is Beautiful) [[2012]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రం. ఈ సినిమాకు కథ మరియు, దర్శకత్వాన్ని [[శేఖర్ కమ్ముల]] అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైన అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి [[మిక్కీ జె. మేయర్]] సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో [[అమల అక్కినేని]], [[శ్రియా సరన్|శ్రియ]], [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[శేఖర్ కమ్ముల]] మరియు, చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.<ref name="లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ">{{cite web|title=లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ|url=https://www.apherald.com/Movies/ViewArticle/4241/life-is-beautiful-review-life-is-beautiful-news-/|website=www.apherald.com|accessdate=30 March 2018}}</ref>
 
==కథ==
[[విశాఖపట్నం|విశాఖపట్నం]]లో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి [[తాతయ్య]], అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. నాగరాజు ( సుధాకర్)తో చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి మరియు, సన్ షైన్ వాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది? అసలు కాలనిల నడుమ తగువులు ఎందుకు? తెలుపడమే మిగితా కథ సారాంశం.
 
==నటవర్గం==
 
==నిర్మాణం==
[[లీడర్ (2010 సినిమా)|లీడర్]] సినిమా విడుదల ఏడు నెలల తర్వాత [[2010]], [[ఆగస్టు]] నెలలో శేఖర్ కమ్ముల ఈ సినిమా యొక్క ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట హీరో [[వరుణ్ సందేశ్|వరుణ్ సందేశ్‌]]తో తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నూతన నటీనటులను ఎంపిక చేసారు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణం [[జూన్]] [[2011]]లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసి [[జులై 6]], [[2012]]న తొలి బుల్లి ప్రచార చిత్రాన్ని సినిమా బృందం విడుదల చేసింది. అదే విధంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు, చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా అమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2884412" నుండి వెలికితీశారు