వట్టివేరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చల్లదనానికి వట్టి వేళ్ల ఉపయోగము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాంతన → సాంత్వన using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35:
భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరి రక్షించడానికి కూడా వట్టి వేళ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. దీని వేళ్లు భూమి లోపలకి చాలా లోతు వరకు వెడతాయి. అందువల్ల నీటి ఎద్దడిని తట్టుకో గలవు. భూమి కోతకు గురి కాకుండా కాపాడగలవు. దాని వలన భూసారం పరిరక్షించ బడుతుంది. చెరువు కట్టలు, కాలవగట్టులు, మొదలగు వాటియందు వీటిని పెంచడం వల్ల ఆ గట్లు నీటి కోతకు గురికాకుండా అరి కట్ట వచ్చు. దీని వలన కలుపు మొక్కలను కూడా అరికట్టవచ్చు. అంతేగాక ఈ గడ్డి నుండి వచ్చే సువాసన వలన పంటలకు సోకే క్రిమి కీటకాలు దరిచేరవు. దాంతో పంటలకు ఇది ఎంతో ఉపయోగ కారి.
 
ఈ గడ్డివేళ్లు భూమిలో చాల లోతుకు పోతున్నందున అక్కడున్న నీటిలోని కాలుష్యాన్ని శుభ్రపరచి భూమిని, నీటిని శుభ్రపరచగలము. మరియు ఈ గడ్డి వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) ను చాల వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, టోపీలు, చేతి విసన కర్రలు తయారు చేస్తారు. కాగితం తయారీకి కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకంలో చల్లదనాన్ని కలిగించడానికి ఈ వట్టి వేళ్లు చాలా ఉపయోగము.
 
==పుట్టుక==
ఖస్ ఖస్ గా పిలువబడే ఈ గడ్డి జాతి పుట్టుక భారత దేశమే. కాని దీని నుండి తీసే పరిమళ తైలం మరియు, ఇతరత్రా ప్రయోజనాల కొరకు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని పెంచు తున్నారు. ఇతర దేశాలలో తయారయ్యే అన్ని రకాల పరిమళాలలో వట్టి వేళ్ల తైలం తప్పక కలుపుతారు. ఇన్ని కారణాల వలన వట్టి వేళ్లను ప్రస్తుతం విరివిగా పెంచు తున్నారు.
 
[[వర్గం:పోయేసి]]
"https://te.wikipedia.org/wiki/వట్టివేరు" నుండి వెలికితీశారు