కమలాకర కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎సినీ విమర్శకునిగా: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 44:
[[కృష్ణా పత్రిక]]లో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; [[న్యూ థియేటర్స్]], [[ప్రభాత్]] వారి [[హిందీ]] సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను [[బెజవాడ]] వెళ్ళి చూసి వచ్చేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి. తెలుగు, [[హిందీ]] సినిమాలే గాక [[ఆంగ్ల]] చిత్రాల గురించి కూడా వ్రాసేవాడు. '[[గుడ్ ఎర్త్ ]]' అనే సినిమా లోని గొప్ప దనాన్ని గురించి వరసగా నాలుగు సంచికల్లో వ్రాశాడు.
 
ఆయన సినిమా విమర్శలకు ఎంతో విలువ ఉండేది. ఆ విమర్శలు విజ్ఞులందరికీ ప్రామాణికంగా ఉండేవి. ఆ విమర్శల్ని చదివి, వాటిలో 'బాగుంది' అని వ్రాస్తేనే ఆ సినిమాలను చూసేవాళ్ళు, బాగలేదని వ్రాస్తే చూడని వాళ్ళు కూడా ఉండేవారు. [[కృష్ణా పత్రిక]] స్థాపకుడు మరియు, సంపాదకుడు అయిన [[ముట్నూరు కృష్ణారావు]] కామేశ్వరరావు గురించి "మా సినీఫాన్" అని గర్వంగా చెప్పేవాడు.
 
ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన "[[ద్రౌపదీ వస్త్రాపహరణం]]", "[[ద్రౌపదీ మానసంరక్షణం]]" చిత్రాలను రెండింటినీ సరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికలలో వ్రాసిన విమర్శలు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. ఎందుకంటే 'వస్త్రాపహరణం' ఆర్థికంగా విజయవంతమైంది; 'మానసంరక్షణం' దెబ్బతిన్నది. కానీ కామేశ్వరరావు మాత్రం 'మానసంరక్షణం' 'వస్త్రాపహరణం' కంటే మంచి చిత్రమని ప్రశంసించాడు. వస్త్రాపహరణం లోని లోటు పాట్లను విమర్శించాడు. వస్త్రాపహరణంలో నాటి ప్రముఖ స్టేజి నటులంతా నటించారు. బహుళ ప్రచారంలో ఉన్న పద్యాలనే ఆ సినిమాలో వాడారు. [[హెచ్. ఎం. రెడ్డి]] ఆధ్వర్యంలో [[హెచ్.వి.బాబు]] దర్శకత్వంలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది.