వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

చి fix bot edits to avoid date validation errors
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
మహర్షి వాల్మీకి ఎవరు? వల్మీకము ([[పుట్ట]]) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను [[రామాయణము]]<nowiki/>గా మహాకావ్యరచన గావించి నవాడిగా [[ఆదికవి]] అయ్యాడు.
 
అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము మరియు, పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. [[వేదవ్యాసుడు]] తాను [[మత్స్యగంధి]], [[పరాశరుడు|పరాశరు]]<nowiki/>ల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా [[సీత]]<nowiki/>ను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని మహర్షిని. [[సీత]] నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” అంటాడు. (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)
 
[[ఫైలు:Valmiki ramayan.jpg|thumb|right|వాల్మీకి మహర్షి [[రామాయణం]] రచన చేస్తున్న దృశ్యం]]
పంక్తి 40:
“వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధను: ఖండమా ఖండాలస్య”   అర్థము:సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను చూడండి! అందులో నుండిఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు-ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు, ప్రబంధౌచిత్యానికి ప్రతీక.వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.` కిరాతులు క్షత్రియులే, వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు (మనుస్మృతి).        
 
కిరాతుడు [[[ఋషి]]గా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే. [[తపస్సు]] ఆయన ప్రధానసద్గుణము, నిరంతరాధ్యయనము, సత్ప్రవర్తనల ఫలితమే మహాఋషిగా ఆవిర్భవింపచేశాయి. వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల (వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము. వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చును.  వీరు మహర్షి, ఆదికవి వాల్మీకి ఉత్ద్బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్య ము లోనికి వచ్చి ఉంటారు. ఆకతాయి రచయతలు ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొరబడి ఉండవచ్చును.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్ మరియు, హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య, డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహకరిస్తున్నాయి (మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్-జస్టిస్ భల్లా, ద [[టైమ్స్ ఆఫ్ ఇండియా]],ఇంగ్లీష్ డైలీ, 2010 మే 22)[[పంజాబ్]] మరియు, హరియానా హైకోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్ మరియు, హరియానా,విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు.డాక్టరు సహదేవ,చైర్ పర్సన్ గా, వాల్మీకి చైర్ అనే విభాగమును,ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు,అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి). క్రీ.పూ.నుండి  అందుబాటులో ఉన్న వేదములు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా, ఎప్పుడూ దొంగగా,దారిదోపిడీదారుడిగా వ్రాయబడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్‌ను జస్టిస్ భల్లా ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడకూడదు, నాటికలు,టి.వి.సీరియల్స్, సినిమాలు తీయరాదు, వాల్మీకి మహర్షిని దొంగ, దారిదోపిడీదారుడు అని బోయలను, వాల్మీకులను కించపరిచే విధముగా మాట్లాడితే నేరము, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును. మహర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో ( ఆధ్యాత్మికరామాయణము, స్కాంధపురాణము,తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి  వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు, చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
 
వాల్మీకిమహర్షిని ఆదికవి, ఋక్షకుడు, భార్గవుడు, కవికోకిల, వాక్యావిశారదుడు, మహాజ్ఞాని, [[భగవాన్]] అని కూడా పిలుస్తారు. వాల్మీకిమహర్షి “ఓం  ఐ౦ హ్రీం క్లీ౦ శ్రీ౦” అనే బీజాక్షరాలు సరస్వతీ, లక్ష్మి,మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయము చేశారు. (దేవిభాగవతము, వేదవ్యాసవిరచితము, తెలుగు అనువాదము)    
పంక్తి 54:
వాల్మీకి అసలుపేరు అగ్నశర్మ అని అతని తండ్రి పేరు ప్రచెతసుడు ఋషి అలాగే అతనికి సుమలీ అనే మరోక పేరు కుడ వుంది ప్రచేతసుడు భృగు వంశంలో జన్మించినవాడు వాల్మీకి చిన్నతనం తన తండ్రి ప్రచెతసుడి దగ్గర నుండి అడవిలొ తప్పి పొవడం బొయవానికి దొరికాడు అని.
దినికి సాక్ష్యం వాల్మీకిని భార్గవుడుగా పిలవడం.
భృగు మహర్షీ వంశస్థులైనటువంటి ప్రచెతసుడు మరియు, వాల్మీకి వారియొక్క గొత్రం భృగు మహర్షీ గొత్రం.
 
వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు, లవుడు, కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ సమానుడని, బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షిగా అవుతరించాడని నమ్మేవారున్నారు. ”విప్రో వాల్మీకిస్సు మహాశయా”అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పాడని, అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. స్వగుణధర్మముతో బోయవాడిగా   పుట్టినవాడు ఆదికవిగా, మహర్షిగా, బ్రాహ్మణుడిగా  గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొనియాడారు.
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు