కె.కె.సెంథిల్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
'''కె.కె.సెంథిల్ కుమార్''' భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఈయన ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు.
== జీవిత విశేషాలు ==
కె.కె.సెంథిల్ కుమార్ 1998లో డిగ్రీ చేసాడు. అతనికి కళాశాలలో క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది. అతడు మంచి క్రికెట్ ఆటగాడు. [[కపిల్ దేవ్]]ను ఆయన రోల్ మోడల్ గా భావించాడు. తరువాత అతడు సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అయన స్నేహితుడు సలహా మేరకు FTII (ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కు దరఖాస్తు చేసాడు. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ 3 సంవత్సరాల కోర్సును దర్శకత్వం, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్ మరియు, ఛాయాగ్రహణం విభాగాలలో ఇచ్చేది. అతడు చాయాగ్రహణం కోర్సులో దరఖాస్తు చేసాడు. వారు సంవత్సరానికి10 మంది విద్యార్థులను తీసుకొనేది. రెండు సీట్లు మూడవ ప్రపంచ దేశాలకు రిజర్వు చేసేవారు. ఈ సెలక్షన్ ఇంటర్వ్యూకు 40 మంది హాజరితే ఎంపిక కాబడిన 8 మందిలో అతను ఒకరు.<ref name=":0" />
 
అతను [[పూణె]] లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఛాయాగ్రహణంలో డిగ్రీ పొందాడు.<ref>{{Cite news|url=http://www.nettv4u.com/celebrity/telugu/cinematographer/k-k-senthil-kumar|title=Telugu Cinematographer K K Senthil Kumar {{!}} Nettv4u|work=nettv4u||access-date=2018-03-30}}</ref> .
 
తరువాత ఆయనసినిమాటోగ్రాఫర్ గా ప్రస్థానాన్ని ఎంచుకున్నాడు. అతనికి సినీరంగ నేపథ్యం లేనందువల్ల కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. అపుడు సినిమా చిత్రకారుడైన పున్నయ్య సలహాతో సినిమా ఛాయాగ్రాహకుడు శరత్ వద్ద అసిస్టెంటుగా చేరాడు.
 
అతడు అసిస్టెంట్ గా మొదటి చిత్రం 1999 లో విదుదలైన [[ప్రేమకు వేళాయెరా]]. తరువాత జాబిలి సినిమాలో అసిస్టెంట్ ఛాయాగ్రాహకునిగా పనిచేసాడు. అతడు టెలివిజన్ సీరియల్ [[అమృతం (ధారావాహిక)|అమృతం]] లో కెమేరామన్ గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు [[చంద్రశేఖర్ యేలేటి]] ఇచ్చాడు. ఇది సినిమా పరిశ్రమలో ఛాయాగ్రాహకునిగా ఎదగడానికి దోహదపడింది.<ref name=":0">{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/senthilkumar.html|title=Senthil Kumar interview - Telugu Cinema interview - Telugu film cinematographer|website=www.idlebrain.com|access-date=2018-03-30}}</ref>
 
అతడు 2003లో [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా [[ఐతే (సినిమా)|ఐతే]] ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా [[ఎస్. ఎస్. రాజమౌళి]] తన సినిమా [[సై]]లో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు.
 
అతనికి ఎక్కువగా [[ఎస్. ఎస్. రాజమౌళి]] చిత్రాలతో అనుబంధం ఉంది. ఆయన బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన [[సై]] (2004), [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] (2005), [[యమదొంగ]] (2007), [[మగధీర (సినిమా)|మగధీర]] (2009), [[ఈగ (సినిమా)|ఈగ (2012)]] మరియు, [[బాహుబలి:ద బిగినింగ్]] (2015) లలో పనిచేసాడు. <ref>{{cite web|url=http://www.cinegoer.net/navigation/page-3/events/celebs-at-samsung-galaxy-tab-2-mirchi-music-awards/75.html|title=KK Senthil Kumar - Celebs At Samsung Galaxy Tab 2 Mirchi Music Awards Gallery - Gallery 1 Pic 75 - cinegoer.net|work=cinegoer.net|access-date=2018-03-30|archive-url=https://web.archive.org/web/20160304114037/http://www.cinegoer.net/navigation/page-3/events/celebs-at-samsung-galaxy-tab-2-mirchi-music-awards/75.html|archive-date=2016-03-04|url-status=dead}}</ref> 2012లో ఆయన ఛాయాగ్రహణం చేసిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమాకు SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది. <ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions1/siima2013-firstday.html|title=SIIMA Day 1 Winners of Technical, Music & Gen Next Awards - Telugu cinema news|work=idlebrain.com}}</ref><ref>{{cite web|url=http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm|title='Eega is one of the most difficult films I have shot'|date=5 July 2012|work=Rediff|archiveurl=https://web.archive.org/web/20160406142258/http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm|archivedate=6 April 2016|deadurl=yes|df=}}</ref> జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన బాహుబలి సినిమాలకు సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 123:
* CineMAA అవార్డు ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - మగధీర (2010)
* CineMAA అవార్డు ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - [[యమదొంగ]] (2008)
; ప్రెంచ్ పురస్కారం: ఫ్రెంచి సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్‍‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (AFFECT) వారు అందించే రవి కె.పోట్డార్ అవార్డును ఈ సారి సెంథిల్ కుమార్ అందుకున్నారు. 2015 అక్టోబరు 13న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఇండియన్ సినిమా పరిశ్రకు విశేషమైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు అందజేసారు. గతంలో గోవింద నిహలానీ, ఆర్ ఎం. రావు లాంటి ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు.<ref>{{Cite news|url=https://telugu.filmibeat.com/news/french-honor-for-baahubali-kk-senthil-kumar-048578.html|title=‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్‌కు ఫ్రెంచి పురస్కారం|date=2015-10-16|work=https://telugu.filmibeat.com|language=te|access-date=2018-03-30}}</ref>
 
== మూలాలు ==
పంక్తి 129:
==ఇతర లింకులు==
{{IMDb name |nm1922104}}
 
[[వర్గం:తెలుగు సినిమా ఛాయాగ్రహకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]