మార్టినా నవ్రతిలోవా: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రారంభ జీవితం: వ్యాసం విస్తరణ
పంక్తి 8:
1956, అక్టోబర్ 18న చెకొస్లోవేకియా లోని ప్రేగ్ నగరంలో జన్మించింది. ఆమెకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. [[1962]]లో ఆమె తల్లి మిరొస్లావ్ నవ్రతిల్‌ను వివాహం చేసుకుంది. అతడే మార్టినాకు తొలి టెన్నిస్ గురువు. [[1972]]లో మార్టినా 15 సంవత్సరాల వయస్సులోనే చెకొస్లోవేకియా జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను సాధించింది. [[1974]]లో తొలిసారిగా ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది.
==గ్రాండ్‌స్లామ్ విజయాలు==
*'''1973''': [[1973]]లో తొలిసారిగా గ్రాండ్‌స్లాంలో ప్రవేశించిన మార్టినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. వింబుల్డన్‌లో 3వ రౌండ్ వరకు చేరుకోగా, అమెరికన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
*'''1974''': [[1974]]లో కూడా ప్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. వింబుల్డన్‌లో తొలిరౌండ్ లోనే నిష్రమించగా, అమెరికన్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు వెళ్లింది.
*'''1975''': ఈ ఏడాది తొలిసారిగా రెండు గ్రాండ్‌స్లాం ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్‌లలో ఫైనల్స్ వరకు ప్రవేశించగా, వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరింది. అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్స్ వరకు ఆడింది.
*'''1976''': [[1976]]లో ఆమె ఆతతీరు ఆశాజనకంగా లేదు. వింబుల్డన్‌లో సెమీస్ వరకు వెళ్ళగలిగింది. అమెరికన్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
*'''1977''': ఈ ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు, అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది.
*'''1978''': [[1978]]లో నవ్రతిలోవా తొలిసారిగ గ్రాండ్‌స్లాం టైటిల్‌ను గెలుపొందింది. వింబుల్డన్ సింగిల్స్‌ను తన ఖాతాలో జమచేసుకుంది. ఆ తరువాత జరిగిన అమెరికన్ ఓపెన్‌లో సెమీస్ వరకు ప్రవేశించింది.
*'''1979''': [[1979]]లో కూడా క్రితం సంవత్సరపు ఫలితాలనే పునరావృత్తం చేసింది. వింబుల్డన్ సింగిల్స్‌ను మళ్ళీ గెలువగా, అమెరికన్ ఓపెన్‌లో కూడా సెమీస్ వరకు వెళ్ళగలిగింది.
 
==మూలాలు==