క్షేమేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''క్షేమేంద్రుడు''' క్రీ.శ. 11 వ శతాబ్దంలో కాశ్మీర దేశానికి చెందిన సంస్కృత కవి, అలంకారికుడు మరియు, నాటక కర్త. ఇతను గొప్ప అలంకారికుడైన అభినవగుప్తుని శిష్యుడు. కాశ్మీర రాజు అనంతుని ఆస్థాన కవి. క్షేమేంద్రుడు వివిధ విషయాలపై సుమారు 33 గ్రంథాలు రాసాడని ప్రతీతి. ఇతని గ్రంథాలలో [[సంస్కృతం]]లోని బృహత్కథామంజరి, రామాయణ మంజరి, భారత మంజరి, ఔచిత్య విచార చర్చ, కళావిలాస, నర్మమాల, భోదిసత్వ అవదాన కల్పలత, చారుచర్య వంటి గ్రంథాలు ప్రసిద్ధిపొందాయి. సాహిత్యంలో ఏదో ఒక అంశానికి చెందిన రచనలకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న క్షేత్రాలలో లోతైన పరిజ్ఞానంతో సాహితీ రచనలను చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి క్షేమేంద్రుడు.
 
==జీవిత విశేషాలు==
క్రీ.శ 1050 ప్రాంతంలో జీవించిన క్షేమేంద్రుడు కాశ్మీర్ దేశంలో ఒక కులీన సాంప్రదాయుక [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు.{{sfn|Haksar|2011|p=xv}} ఇతని తండ్రి ప్రకాశేంద్రుడు. వీరు ఒకప్పుడు కాశ్మీర దేశాన్ని ఏలిన జయాపీడుని యొక్క [[మంత్రి]] అయిన నరేంద్రుని వంశానికి చెందినవారు.{{sfn|Warder|1992|p=365}} ఉన్నత కుటుంబీయుడు కావడంతో క్షేమేంద్రుడు బాల్యం నుండే చక్కని శిక్షణ పొంది కవిత్వంలో మంచి ప్రతిభను కనపరిచాడు. గొప్ప అలంకారికుడు మరియు, శైవ దార్శనికుడు అయిన అభినవ గుప్తునికి శిష్యుడైనాడు.{{sfn|Haksar|2011|p=xv}} జన్మతా శైవుడైనా తరువాతి కాలంలో వైష్ణవానికి మారాడు. వైష్ణవంతోపాటు [[బౌద్ధ మతము|బౌద్ధం]]<nowiki/>పై గ్రంథాలు రచించాడు. కాశ్మీర రాజు అనంతు (క్రీ.శ. 1024-33) ని కాలంలోనూ, అతని పుత్రుని (క్రీ. శ. 1033-89) కాలంలోనూ ఆస్థాన [[కవి]]<nowiki/>గా ఉన్నాడు.<ref name="ముదిగంటి">{{cite book|last1=ముదిగంటి|first1=గోపాలరెడ్డి|last2=[[ముదిగంటి సుజాతారెడ్డి]]|title=సంస్కృత సాహిత్య చరిత్ర|page=279|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|edition=2002|accessdate=26 July 2017}}</ref> ఇతనికి వ్యాసదాసు అనే పేరుకూడా ఉంది. బహుశా భారతమంజరి రచనానంతరం క్షేమేంద్రుడు తన గ్రంథాలలో తనను తాను 'వ్యాసదాసు'నిగా అభివర్ణించుకొనివుండవచ్చు. {{sfn|Warder|1992|p=365}}
 
==రచనలు==
పంక్తి 60:
 
==మూలాలు==
 
[[వర్గం:కవులు]]
[[వర్గం:సంస్కృత కవులు]]
"https://te.wikipedia.org/wiki/క్షేమేంద్రుడు" నుండి వెలికితీశారు