వేదవతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''వేదవతి''' [[రామాయణం]]లో [[సీత]] పూర్వజన్మపు పతివ్రత. ఈమెను [[లక్ష్మీదేవి]] [[అవతారం]]<nowiki/>గా భావిస్తారు.
 
ఈమె [[బ్రహ్మర్షి]] కుశధ్వజుడు మరియు, మాలావతి దంపతుల కుమార్తె. ఈమె జన్మించినప్పుడు వేదధ్వని వినిపించెను. అందువలన ఈమెకు వేదవతి అని పేరుపెట్టిరి. ఈమెను [[విష్ణుమూర్తి]] కే యిచ్చి వివాహము చేయవలెనని కోరుతూ ఎంతటి రాజులకు ఇవ్వలేదు. [[విష్ణుమూర్తి]]<nowiki/>ని [[భర్త]]<nowiki/>గా పొందడానికి ఈమె తపస్సు చేయుచుండెను. ఆకాశ మార్గమున పోతూ [[రావణుడు]] ఈమెను చూచి అందానికి మోహించాడు. తనను పరిణయము చేసుకొమ్మని కోరెను. కానీ వేదవతి తిరస్కరించింది. అందులకు రావణుడు మోహంతో ఆమెను చేపట్టబూనెను. వేదవతి యోగాగ్నిలో దూకి భస్మమయ్యెను.
 
తర్వాత జన్మమున ఈమె [[లంక]]<nowiki/>లోనే ఒక పద్మమున జన్మించెను. కానీ జ్యోతిష్యులామె లంకకు అరిష్ట సూచకమని చెప్పుటవలన ఆమెను ఒక పెట్టెలో పెట్టి సముద్ర మద్యములో విడిచిరి. ఆమె మిథిలా నగరములో జనకునికి దొరికి [[సీత]]గా పేరొంది, శ్రీరామునికి భార్యగా రావణ సంహారానికి కారణభూతమయ్యెను.
"https://te.wikipedia.org/wiki/వేదవతి" నుండి వెలికితీశారు