మార్టినా నవ్రతిలోవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
*'''1981''': ఈ ఏడాది తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచింది. ఆ తరువాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు ప్రవేశించింది. వింబుల్డన్‌లో సెమీస్ వరకు వెళ్ళగా, అమెరికన్ ఓపెన్‌లో ఫైనల్ వరకు ప్రవేశించింది.
*'''1982''': [[1982]]లో మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ప్రవేశించి రెండిటిలో విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో [[క్రిస్ ఎవర్ట్]] చేతిలో ఓడిపోగా, వింబుల్డన్‌లో క్రిస్ ఎవర్ట్ పైనే విజయం సాధించి టైటిల్ గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ తైటిల్‌ను కూడా గెలువగా, అమెరికన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగింది.
*'''1983''': ఈ ఏడాది 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం నాలుగవ రౌండ్‌లో నిస్క్రమించింది.
*'''1984''': [[1984]]లో కూడా 3 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే చేరగలిగింది. సాధించిన మూడు టైటిళ్ళను కూడా ఫైనల్లో క్రిస్ ఎవర్ట్ పైనే గెలవడం విశేషం.
*'''1985''': ఈ ఏడాది తొలిసారిగా 4 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. అందులో రెండింటిలో టైటిల్ సాధించింది. వింబుల్డన్ మరియు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో క్రిస్ ఎవర్ట్ పైనే గెలిచి టైటిల్ సాధించగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్రిస్ ఎవర్ట్ చేతిలో పరాజయం పాలైనది. అమెరికన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఓడిపోయింది.
 
==మూలాలు==