"గుండు సూది" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే (3), , → , (2), , → ,
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, నిషేదా → నిషేధా, శతాబ్ధం → శతాబ్దం using AWB)
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే (3), , → , (2), , → ,)
[[దస్త్రం:pin-artsy.jpg|right|thumb| కార్క్ బోర్డులో గుండు సూదులు]]
 
కాగితాలను, పదార్ధాలను, మరియు/లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి '''గుండు సూదులు''' ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా [[ఉక్కు]]తో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలో గుచ్చడానికి వీలుగా చేస్తారు. మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండు భాగాన్ని [[ప్లాస్టిక్]] ఉపయోగించి కూడా చేస్తున్నారు.
 
కాగితాలను, పదార్ధాలను మరియు/లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి '''గుండు సూదులు''' ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా [[ఉక్కు]]తో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలో గుచ్చడానికి వీలుగా చేస్తారు. మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండు భాగాన్ని [[ప్లాస్టిక్]] ఉపయోగించి కూడా చేస్తున్నారు.
== చరిత్ర ==
[[దస్త్రం:గుండు సూది.jpg|right|thumb|గుండు సూది]]
కంచు కనుగొనబడడంతో కంచుయుగం ప్రారంభమైంది. ఈ కొత్త లోహం నుండి ముందుకంటే మంచి చిన్న సూదులను తయారు చేసుకోవచ్చునన్న సంగతిని వారు కనుగొన్నారు. కాని కొన్ని పెద్ద సైజు సూదులు కూడా తయారు కాబడ్డాయి. గ్రీకు స్త్రీలు ధరించిన జాలువారు వస్త్రాలు ఒకప్పుడు ఈ కంచు సూదులతో జత చేయబడి ఉండేవి. లోహ యుగానికి చెందిన రోమన్లు దంతంతో, కంచుతో చేయబడిన సూదులను వాడేవారు. బంగారు సూదులను కూడా వారు వాడేవారు. వారు తయారు చేసుకున్న కంచు సూదులు చిన్నవిగా నాజూకుగా ఉండేవి. వారు [[వెండి]]తో చేసిన సూదులను కూడా వాడి ఉంటారు. పెరువియన్స్ గోరీలలో ఈ లోహంతో చేయబడ్డ సన్నని సూదులను కనుగొన్నారు. స్పానియార్డులు దాన్ని కనుగొన్నప్పుడు పెరువియన్స్ కంచు యుగంలో ఉండడం జరిగింది. తీగతో తయారుచేయబడిన మొదటి సూదులు [[ఇంగ్లాండు]]లో 15వ శతాబ్దంలో తయారుచేయబడ్డాయి. దీనికి కారణం 1483వ సంవత్సరంలో సూదుల దిగుమతిని నిషేధిస్తూ చట్టం అమలుచేయబడడమే. నిషేధాజ్ఞ అమలులో ఉన్నప్పటికి [[ఫ్రాన్స్]], [[జర్మనీ]] దేశాలనుండి తెచ్చిన సూదులే ఎక్కువగా ఇంగ్లాండులో వాడకంలో ఉండేవి.
 
8వ హెన్రీ భార్య కాథరిన్ హూవర్డ్ కోసం ఇత్తడి సూదులను ఇంగ్లాండుకు మొదటిసారిగా తెప్పించారని చెప్పబడుతోంది. గ్లౌసెస్టర్‌షైర్లో స్ట్రౌడ్ వద్ద 17వ శతాబ్దంలో ఇత్తడి సూదులను తయారుచేసే యంత్రాన్ని జాన్ టిల్స్‌బి నెలకొల్పాడు. అతి త్వరలో బ్రిస్టల్ మరియు, బర్మింగ్‌హోం పట్టణాల వద్ద నాణ్యతకు పేరుగాంచిన సూదుల కార్ఖానాలు ప్రారంభింపబడ్డాయి. అమెరికన్ స్థావరాలైన దేశాలకు ఇంగ్లాండు నుండి సూదులు ఎగుమతి చేయబడ్డాయి. విప్లవ కాలం వరకు సూదులను తయారుచేసే ప్రయత్నాలు అక్కడ జరగలేదు. ఇంగ్లాండులో తయారయే సూదులతో సరితూగే సూదులను తయారుచేసే కంపెనీకి బహుమతిని ఇస్తామన్న ప్రకటన 1775లో వెలువడింది. కానీ ఈ బహుమతి ఫలానా కంపెనీ గెలుచుకున్నట్లు మనకు దాఖలాలు లేవు. 1812వ సంవత్సరం దాకా సూదులను తయారుచేసే కంపెనీ అమెరికాలో నెలకొల్పబడలేదు. అప్పట్లో ఈ ప్రయత్నం విజయవంతమైన ప్రయత్నం కాదనుకున్నారు. 1836వ సంవత్సరంలో హూవెహూవే కంపెనీ సూదులు తయారీని క్రమబద్ధం చేడంలో విజయాన్ని సాధించింది. ఆ తరువాత అమెరికాలో మిలియన్ల సూదులు తయారుచేయబడ్డాయి.
 
19వ శతాబ్దం వరకు సూదులు చాలావరకు చేతిలోనే తయారయ్యేవి. 1824వ సంవత్సరంలో అమెరికాకు చెందిన లెముయల్ డబ్ల్యురైట్ సూదులను తయారుచేసే యంత్రాన్ని కనుగొన్నాడు. ఈ సూదులు ఘనమైన తలను పదునైన తోకను ఒకే తీగ సహాయంతో చేయడం జరిగింది. తయ యంత్రానికి అతడు ఒక పేటెంటును ఇంగ్లాండులో సంపాదించాడు దిట్టమైన తలగల గుండు సూదులు మొట్టమొదట ఇంగ్లాండులో తయారు చేయబడ్డాయి. తరువాత కొంతకాలానికి [[న్యూయార్క్]] నగరానికి చెందిన వైద్యుడు డా||జాన్ ఇంగ్లాండ్ హూవెహూవే సరైన తలగలిగిన గుండు సూదులను తయారుచేసే యంత్రాన్ని కనుగొన్నాడు హూవెహూవే కంపెనీవారు ఈ యంత్రాన్ని వాడారు. కన్నెక్టికట్లోని డెర్బీ వద్ద తమ కంపెనీను నెలకొల్పాడు.
 
మరికొన్ని సంవత్సరాల తరువాత [[కాగితం|కాగితాలను]] గట్టిగా పట్టుకునేందుకు వుపయోగపడే గుండుసూదులను తయారుచేసే యంత్రాన్ని శామ్యూల్ స్లోకం కనుగొన్నాడు. సమయాన్ని పొదుపు చేసే ఈ యంత్రం విజయవంతం కావడంతో మరికొన్ని పరిశోధనల కారణంగా గుండుసూదులు పూర్తిగా యంత్రాలతో చేయబడ్డాయి. గుండుసూదులను [[ఉక్కు]], [[ఇత్తడి]], [[ఇనుము]] తీగలతో తయారు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2885140" నుండి వెలికితీశారు