గుర్రం మల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విశేషాలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: మరియు → ,, typos fixed: → (3), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
[[గుర్రం మల్లయ్య|'''గుర్రం మల్లయ్య''']] ప్రముఖ చిత్రకారుడు, శిల్పి మరియు, స్వాతంత్య్ర సమరయోధుడు<ref>{{cite news|last1=అక్కల|first1=కోటయ్య|title=దేశభక్తుడు - చిత్రకారుడు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11279|accessdate=30 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 294|date=7 November 1980}}</ref>.
==విశేషాలు==
ఇతడు గుర్రం వీరయ్య, నాగలక్ష్మమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[చండూరు]]<nowiki/>లో జన్మించాడు.<ref>{{cite web|last1=వెబ్ మాస్టర్|title=Gurram Mallaiah|url=http://www.artattelangana.org/artistDetails.php?PARId=PAR122|website=art@telangana|accessdate=30 January 2018}}</ref> ఇతని స్వగ్రామం [[గుంటూరు జిల్లా]], [[మాచెర్ల]]. ఇతడు [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|బందరు జాతీయ కళాశాల]]లోని ప్రముఖ చిత్రకళా కోవిదులు ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద [[చిత్రకళ]]<nowiki/>ను అభ్యసించాడు. [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్‌మీడియట్]] వరకు చదివి తరువాత [[కలకత్తా]] వెళ్ళి అవనీంద్రనాథ్ ఠాగూర్‌వద్ద [[శాంతినికేతన్|శాంతి నికేతన్‌]]లో మూడు సంవత్సరాలు చిత్రకళాభ్యాసం చేశాడు. ఆ సమయంలో ఇతడు వేసిన చిత్రాలు, వ్రాసిన [[వ్యాసాలు]] [[బంగ్లా భాష|బెంగాలీ]] భాషా పత్రికలలోను ఇతర భాషల పత్రికలలోను ప్రచురితమయ్యాయి.
 
ఇతడు వేసిన కొన్ని ప్రముఖమైన చిత్రాలు:
పంక్తి 52:
* కుటీర పరిశ్రమ మొదలైనవి.
 
ఇతడు కలకత్తాలో [[శిక్షణ]] పొందిన తరువాత తిరిగి [[బందరు]] వచ్చి జాతీయ కళాశాలలో చిత్రకళాధ్యాపకుడిగా చేరాడు. కళాశాలలో పనిచేస్తున్నప్పుడే [[గాంధీజీ]] పిలుపును అందుకుని మద్యపాన నిషేధము, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పికెటింగులు నిర్వహించడంతో అరెస్టయ్యాడు. ఇతడు మాచర్లలో నవయుగ చిత్రకళా సమితి పేరుతో ఒక సంస్థను స్థాపించి ఎందరినో చిత్రకారులుగా తీర్చిదిద్దాడు<ref>[http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/1722/7/07_chapter%203.pdf A STUDY OF ANDHRA JATEEYA KALASALA]</ref>. [[నాగార్జున కొండ]] నుండి కొన్ని అపురూపమైన శిల్పాలను విదేశీయులు తరలించుకు పోవడాన్ని గమనించి ప్రభుత్వానికి రిపోర్టు చేసి ఆ శిల్పసంపద మన దేశం నుండి తరలిపోకుండా కాపాడాడు. [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] ప్రారంభమైన తర్వాత [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకుల]] కాలం నాటి [[నాగార్జునకొండ|విజయపురి]] శిథిలాలను, శిల్పాలను నీటిలో మునిగిపోకుండా భద్రపరచవలసిన ఆవశ్యకతను ఇతడు స్వయంగా నాటి ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]]కు విన్నవిస్తే నెహ్రూ స్వయంగా పరిశీలించి వాటి నమూనాలు తయారు చేయించి కొండపై [[మ్యూజియం]] ఏర్పాటు చేసి వాటిలో ఉంచవలసిందిగా ఆదేశించాడు. నెహ్రూ ఆదేశం ప్రకారం ఇతడే అన్ని నమూనాలు తయారు చేశాడు. నాగార్జున శిల్పకళ ప్రావీణ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఇతడు [[కోలవెన్ను రామకోటేశ్వరరావు]]తో కలిసి నాగార్జున శిల్పకళా పీఠాన్ని నెలకొల్పి 11 సంవత్సరాలు అనేక మందికి [[శిక్షణ]] ఇచ్చి మంచి శిల్పులుగా తయారు చేశాడు. కోస్లా కమిటీని పల్నాడుకు రప్పించి, నంది కొండ ప్రాంతాలను చూపించి, వారు చూసిన, చూడదలచిన ప్రాజెక్టు ఏరియాలు అన్నిటి కంటే [[నందికొండ]] అనువైనస్థలమని వారికి నచ్చచెప్పి నాగార్జునసాగర్ ఆ ప్రాంతానికి రావడానికి ఇతడు చేసిన ప్రయత్నం ఎనలేనిది. ఇతడిని [[ఆచార్య రంగా]] "అభినవ బ్రహ్మన్న"గా వర్ణించాడు.
 
==మూలాలు==
పంక్తి 60:
 
{{Authority control}}
 
[[వర్గం:చిత్రకారులు]]
[[వర్గం:శాంతి నికేతన్ పూర్వ విద్యార్థులు]]
"https://te.wikipedia.org/wiki/గుర్రం_మల్లయ్య" నుండి వెలికితీశారు