శాంతకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
 
==బాల్యం==
శాంతకుమారి అసలు పేరు '''వెల్లాల సుబ్బమ్మ'''. సుబ్బమ్మ [[వైఎస్ఆర్ జిల్లా]] [[ప్రొద్దుటూరు]] లో మే 17, 1920 సంవత్సరంలో ''వెల్లాల శ్రీనివాసరావు'' గారికి జన్మించారు. శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను [[చెన్నై|మద్ర్రాసు]]<nowiki/>లో ఉన్న ప్రొ.పి. సాంబమూర్తి గారి వద్దకు [[కర్ణాటక]] సంగీతం మరియు, వయొలిన్ నేర్చుకోవటానికి దరఖాస్తు చేయించారు. [[డి.కె.పట్టమ్మాళ్]] సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ [[కర్ణాటక సంగీతం]] లో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో [[వయొలిన్]] లో ఉత్తీర్ణురాలైంది. తరువాత [[గురువు]]<nowiki/>గారితో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు [[సంగీతము|సంగీతం]] నేర్పించేది.
 
==సినీ జీవితం==
సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు [[మాయాబజార్]] (1936) లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ నిరాకరించడంతో, పి.వి.దాసు మరియు, అతని మేకప్ మనిషైన మంగయ్య వప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు.
 
శాంతకుమారీగా మారిన నట-గాయక సంచలనం తరువాత సినిమా [[సారంగధర]] (1937). ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన [[పి.పుల్లయ్య]] గారిని ఇష్టపడి పెళ్ళిచేసుకొంది. పెళ్ళిచేసుకొన్న తరువాతకూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది. శాంతకుమారి [[పి.పుల్లయ్య]] దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/శాంతకుమారి" నుండి వెలికితీశారు