చాగంటి కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యక్తిత్వం: Removed few lines due to the reality. He is currently owning an individual house at Kakinada. Apart of that, it is not sure about the work culture at FCI
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: దాశరధీ → దాశరథీ, లో → లో (2), ె → ే , సంబందము → సంబంధము, విద్యార్దు → విద్యా
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
 
'''[[చాగంటి కోటేశ్వరరావు]]''' ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన తూర్పు గోదావరి జిల్లా [[కాకినాడ]] వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. [[1959]] [[జూలై 14]]వ తేదిన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన [[మనసు]]<nowiki/>లను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది [[బిరుదు]]<nowiki/>లను అందుకున్నారు.
 
మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు, 40 రోజుల పాటు శ్రీ [[లలితా సహస్ర నామ స్తోత్రము]]ను అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది [[తెలుగు]] వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.
 
చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.
 
ఆయన ధారణాశక్తి గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.
 
ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.
 
అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.
 
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.
 
చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.
 
ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.
 
== ప్రవచనాలు==
పంక్తి 98:
# దక్షిణామూర్తి వైభవం
# దశావతారములు
# దాశరధీదాశరథీ శతకం
# దీపావళి చరిత్ర
# దేవాలయ వైశిష్ట్యము
పంక్తి 112:
# ధ్యాన ప్రక్రియ
# నవరత్న మాలిక
# నవవిధ భక్తి స్వరూపం
# నేటి సమాజం
# నైమిశారణ్యము
పంక్తి 154:
# లలితా వైభవం
# లలితా సహస్ర నామ స్తోత్ర వివరణ
# వాగ్గేయకార వైభవం
# వాహన ప్రయాణం
# విద్యార్దులకువిద్యార్థులకు మార్గదర్శనం
# విద్యార్ధులకువిద్యార్థులకు సందేశం
# వినాయక వైభవం
# వివాహ వైభవం
పంక్తి 171:
# శివ మహిమలు
# శివ లింగ తత్వము
# శివభక్తి-శరణాగతి
# శివానందలహరి
# శీలనిర్మాణం
పంక్తి 188:
# శ్రీ రామాయణ వైభవం
# శ్రీ రామాయణం ఆవశ్యకత
# శ్రీ రామాయణం-మానవీయ సంబందములుసంబంధములు
# శ్రీ వినాయక వైభవం
# శ్రీ వేంకటాచల వైభవం
పంక్తి 234:
 
== వ్యక్తిత్వం ==
చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోఇండియాలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. చాగంటివారు ఆఫీసుకు సాధారణంగా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ప్రవచనాలకు ఆయన పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు.
 
== చిత్రమాలిక ==
<gallery>
దస్త్రం:Pravachana chakravarti Chaganti+160.jpg|కంచి కామకోటి పీఠాధిపతులు మరియు, చాగంటి కోటేశ్వరావు
దస్త్రం:Chaganti koteswarao.jpg|చాగంటి కోటేశ్వర రావు
దస్త్రం:Pravachana-chakravarti.jpg|చాగంటి కోటేశ్వర రావు