జంషీద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎బీదరుతో వైషమ్యాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 12:
ఆదిల్షా ఆక్రమించుకొన్న బీదరు ప్రాంతాల మూలంగా ఆయనకు నిజాంషా కంటే కొంత పైచేయి అయ్యింది. ఈ విషయాన్ని నిరసించిన నిజాంషా, ఆదిల్షాను చికాకు పెట్టేందుకు, ఆదిల్షాకు ఆధీనంలో ఉన్న [[షోలాపూర్|షోలాపూరు]] కోటపై దండెత్తాడు. ఇద్దరి బలాలు సమానంగా ఉండటంతో ఇబ్రహీం ఆదిల్షా తనకు మద్దతుగా జంషీద్ కులీని సహాయాన్ని కోరాడు. జంషీద్ అందుకు అంగీకరించాడు కానీ, ప్రతిగా అలీ బరీద్ ను విడుదల చేయాలని షరతు పెట్టాడు. ఆదిల్షా, అలీ బరీదును విడుదల చేసిన వెంటనే, జంషీద్ ఆదిల్షాకు సహాయం చేయకుండా బీదరు వెళ్లి అలీ బరీదును ఏ సింహాసనం నుండైతే తను పూనుకొని దించాడో మళ్లీ అదే సింహాసనం ఎక్కించాడు. దీనితో పరిస్థితి యధాస్థితికి చేరుకొని బీజాపూరు, అహ్మద్‌నగర్ మధ్య వైషమ్యాలు కొన్నాళ్ళు చల్లబడ్డాయి.
 
జంషీద్ ఎప్పుడైనా సిద్ధమే అని కయ్యానికి కాలుదూసే సుల్తాను. ధైర్యశాలి. దక్కను సుల్తానుల మధ్య గొడవల్లో అవసరమైన దానికంటే ఎక్కువగానే తలదూర్చేవాడు. ఈయన పాలనాకాలంలో బీదరు, బీజాపూరు మరియు, అహ్మద్‌నగర్ మధ్యన జరిగిన అనేక గొడవల్లో స్వయంగా పాల్గొన్నాడు. ఈయన దౌత్య చతురతతో ఎప్పుడూ గెలిచే పక్షం వైపునే ఉండేవాడు. ఈయన కవి కూడా.
 
==చరమదశ==