సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
 
== చరిత్ర ==
1969 లో హరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. అప్పట్లో దీన్ని '''శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజి''' అనేవారు. 1971, అక్టోబరు 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి. అది మొదలు, [[చంద్రయాన్|చంద్రయాన్-1]], [[మార్స్ ఆర్బిటర్ మిషన్]]<nowiki/>తో సహా ఎన్నో ప్రయోగాలకు ఈ కేంద్రం వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ [[సతీష్ ధావన్]] జ్ఞాపకార్థం 2002, సెప్టెంబరు 5న '''''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్''''' గా మార్చారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV మరియు, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు.
 
షార్‌లో ప్రస్తుతం రెండు లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణమ్లో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.