సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 19:
'''సాగరసంగమం''' [[కె.విశ్వనాథ్]] దర్శకత్వంలో 3 జూన్ 1983న విడుదలైన తెలుగు సినిమా. [[కమల్ హాసన్]], [[జయప్రద]] ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]] పతాకంపై [[ఏడిద నాగేశ్వరరావు]] నిర్మించాడు. ఇందులో గాయని [[ఎస్.పి.శైలజ]], [[శరత్ బాబు]] ముఖ్యమైన పాత్రల్లో నటించారు. [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను [[వేటూరి సుందరరామ్మూర్తి]] రచించాడు. ఇందులో హాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించాడు.
 
ఈ సినిమాను తెలుగు మరియు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో '''సలంగై ఒలి''' (మువ్వల సవ్వడి అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో '''సాగర సంగమం''' అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=113|ps=సాగర సంగమం}}
 
ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు [[నంది పురస్కారాలు]] గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ చోటు దక్కించుకుంది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=120|ps=సాగర సంగమం}} రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై, రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=113|ps=సాగర సంగమం}}
పంక్తి 26:
నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది. బాలకృష్ణ ([[కమల్ హాసన్]]) అనే పేద యువకుడు స్వయంకృషితో నాట్యం నేర్చుకొంటాడు. [[కూచిపూడి]], [[భరతనాట్యం]], [[కథక్]] రీతులలో ప్రవీణుడౌతాడు. కాని వాణిజ్యం, విచ్చలవిడితనం పెచ్చుమీరిన సినిమా రంగంలో ఇమడలేకపోతాడు. అతని ప్రతిభను గుర్తించిన మాధవి ([[జయప్రద]]) అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది. [[ఢిల్లీ]]లో మహామహుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో అతని నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరిక్షణంలో బాలకృష్ణ తల్లి ([[డబ్బింగ్ జానకి]]) చనిపోవడంతో అతడు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొనలేకపోయాడు. అతనికి తోడుగా నిలచిన మాధవిపై అతనికి ప్రేమ మొదలౌతుంది కాని మాధవికి అంతకు మునుపే పెళ్ళవుతుంది. వీరి ప్రేమ గుర్చి తన భర్తకు చెప్పి అతన్ని పిలిపిస్తాడు .అతను సమర్డించినప్పతటికి బాలకృష్ణ మాత్రం వారిరివురు కలసి భార్యభర్తలుగా ఉండాలని కాంక్షించి తన ప్రేమను పక్కకు పేడతాడు. తల్లి మరణం,ప్రేమ వైఫల్యంతో ఆత్మన్యూనతభావంతో బాలకృష్ణ దాదాపు తాగుబోతు అవుతాడు.
 
తరువాతి భాగంలో మాధవి కూతురు ([[శైలజ]])కు బాలకృష్ణ గురువౌతాడు నాట్య కళ గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు.ఆపై ఆమె నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే జనాల చప్పట్లు మరియు, తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పోంది నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ మరణించడంతో కథ ముగుస్తుంది. చివరిగా కనిపించే మాట NO END FOR ANY ART (ఏ కళకు అంతం లేదు)
 
==తారాగణం==
పంక్తి 55:
=== చిత్రీకరణ ===
 
ఈ సినిమాను [[మద్రాసు]], [[విశాఖపట్నం]], [[హైదరాబాదు]] మరియు, [[ఊటీ]]<nowiki/>లో చిత్రీకరించారు. "వేవేల గోపెమ్మలా" పాటను విశాఖపట్నంలోని [[భీమిలి]] బీచులోనున్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయ గార్డెన్స్ లో చిత్రీకరించారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=105|ps=సాగర సంగమం}} [[జయప్రద]] ఇంట్లో జరిగే సన్నివేశాలు, "మౌనమేలనోయి" పాట, సముద్రపు ఒడ్డులో తీసిన సన్నివేశాల్నీ విశాఖపట్నంలోనే చిత్రీకరించారు. "ఓం నమఃశివాయ" పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్ లోని [[ఈనాడు]] కార్యాలయంలో చిత్రీకరించారు. మద్యం మత్తులో ఓ బావి మీదున్న పైపుపై [[కమల్ హాసన్]] నాట్యం చేసే "తకిట తథిమి" పాటను మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో 30 అడుగుల బావి సెట్ వేసి తీశారు. "నాదవినోదము" పాటను ఊటీలో తీశారు. [[వి. శాంతారాం]] తీసిన [[ఝనక్ ఝనక్ పాయల్ బాజే]], [[నవరంగ్]] సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన [[గోపీకృష్ణ (నాట్యాచార్యుడు)|గోపికృష్ణ]] ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించాడు. అతడు ఈ పాట కోసమే ప్రత్యేకంగా [[బొంబాయి]] నుండి వచ్చాడు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=106|ps=సాగర సంగమం}} పతాక సన్నివేశాల్లో వచ్చే "వేదం అణువణువున నాదం" పాట చిత్రీకరణకు ముందు హాసన్ కు ఓ హిందీ సినిమా షూటింగులో కాలికి తీవ్రమైన గాయమైంది. దాంతో, నెలరోజులపాటు ఈ సినిమా చిత్రీకరణను వాయిదా వేశారు. ఆ తరువాత విడుదలకు ఆలస్యమవుతుందని పునః ప్రారంభించారు. అయితే, అప్పటికీ హాసన్ ఇంకా కోలుకోలేదు. అడుగు తీస్తే అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడతడు. అయినప్పటికీ నృత్యం చేయడానికి పూనుకున్నాడు. "షాట్" అనగానే నృత్యం చేయడం, "కట్" అనగానే క్రింద పడిపోవడం. అలా, ఆ పాట పూర్తయింది.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=111|ps=సాగర సంగమం}}
 
చిత్రీకరణ జరిపే సమయంలోనే స్క్రిప్టులో లేని కొన్ని అంశాలను సృష్టించడం జరిగింది. ఖైరతాబాద్ వినాయక విగ్రహం ముందు హాసన్ నృత్యం చేసే ఘట్టం. ఆ ప్రాంతంలో చిత్రీకరించే సమయంలో దర్శకుడు [[కాశీనాథుని విశ్వనాథ్|విశ్వనాథ్]]<nowiki/>కి ఓ ఆలోచన వచ్చింది. అదే, ఓ సినిమా నృత్య దర్శకుడి వద్ద సహాయకుడిగా చేరడానికి వెళ్ళి, అక్కడి పరిస్థితుల వల్ల మథనపడి, వినాయక విగ్రహం ముందు నృత్యం చేసే ఘట్టం. ఆ సన్నివేశం మొత్తాన్ని అప్పటికప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఆ నృత్య ఘట్టంలో నేపథ్య సంగీతంగా [[పండిట్ రవిశంకర్]] మ్యూజిక్ బిట్ ని వాడమని సిఫార్సు చేశాడు హాసన్. విశ్వనాథ్ కు ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తన ఇంట్లో ఉన్న రవిశంకర్ ఎల్.పి.రికార్డుని తెప్పించాడు హాసన్.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=106|ps=సాగర సంగమం}} జయప్రద ఇచ్చిన డాన్స్ ఫెస్టివల్ ఆహ్వాన పత్రికలో తన ఫోటోను చూసుకొని హసన్ ఉద్వేగంతో ఏడవడం వరకు మొదట అనుకున్న సన్నివేశం. అయితే, దాన్ని చిత్రీకరించే సమయంలో విశ్వనాథ్ కెమెరా వెనుక నుండి నవ్వమని హాసన్ కు సైగ చేశాడు. అలా చెప్పిన వెంటనే హసన్ ఏడుపులోంచి నవ్వులోకి మారిపోయాడు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=111|ps=సాగర సంగమం}}
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు