హిరోషిమా: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[జపాన్]]కు చెందిన చారిత్రక పట్టణం '''హీరోషిమా''' (Hiroshima). ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన [[హోంషు]]లో ఉంది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] చివరిలో [[1945]], [[ఆగష్టు 6]] న [[అమెరికా]] [[అణుబాంబు]]కు గురై, నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.
 
హీరోషిమా నగరాన్ని [[1589]]లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది. బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు, సైనిక వ్యవస్థను కలిగి [[1905]]లో జరిగిన జపాన్-[[రష్యా]] యుద్ధంలో సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధానస్థావరం హీరోషిమానే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు కూడా ఈ నగరంలో ఉండేవి. కాబట్టి ఈ నగరాన్ని ధ్వంసంచేయాలని అమెరికా నిర్ణయించి 1945, ఆగస్ట్ 6 న బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అనొలాగే (Enola Gay) అణుబాంబును ఉదయం గం.8.15 ని.లకు జారవిడిచింది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా శాశ్వతంగా ఈ నగరం చరిత్రలో నిల్చిపోయింది. ఈ సంఘటన వల్ల వెంటనే 70 వేల ప్రజలు మరణించగా, ఆ తర్వాత గాయాల వల్ల అణుధూళి వల్ల 90,000 నుండి 1,40,000 వరకు మరణించినట్లు లెక్కవేశారు <ref>{{ఇంగ్లీష్}}http://www.rerf.or.jp/general/qa_e/qa1.html {{Webarchive|url=https://web.archive.org/web/20070919143939/http://www.rerf.or.jp/general/qa_e/qa1.html |date=2007-09-19 }} రేడియేషన్ ఎఫెక్ట్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్</ref>. నగరంలోని దాదాపు 69% భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది జరిగిన కొద్దికాలానికే 1945, సెప్టెంబరు 17 న పెద్ద టైఫూన్ ఈ నగరంపై విరుచుకుపడింది. దీని వల్ల మరో 3 వేలమంది మరణించడం, ఆస్తి నష్టం సంభవించడం జరిగింది.
 
[[2006]] ప్రకారము ఈ నగర జనాభా 11,54,391 <ref>{{ఇంగ్లీష్}}{{cite web |url=http://www.stat.go.jp/English/data/kokusei/2000/final/hyodai.htm#21 |title=జపాన్ జనాభా, పట్టీ 92 |publisher=Statistics Bureau |accessdate=2007-08-14}}</ref>. ఈ నగర విస్తీర్ణం 905.08 చ.కి.మీ..<ref name="statprofile">{{ఇంగ్లీష్}}{{cite web |url=http://www.city.hiroshima.jp/kikaku/joho/toukei/12_pro/profile-e.html |title=2006 Statistical Profile |publisher=The City of Hiroshima |accessdate=2007-08-14 |website= |archive-url=https://web.archive.org/web/20080206110108/http://www.city.hiroshima.jp/kikaku/joho/toukei/12_pro/profile-e.html |archive-date=2008-02-06 |url-status=dead }}</ref>
[[1910]]లో ఈ నగరం జనాభా 1,43,000 <ref name="terry">{{ఇంగ్లీష్}}{{cite book |title=టెర్రీస్ జపనీస్ ఎంపైర్ |author=టెర్రీ, థామస్ ఫిలిప్|publisher=హౌగ్టన్ మిఫ్లిన్ కో|date=1914 |pages= పేజీ 640}}</ref> ప్రపంచ యుద్ధం ముందునాటికి 3,60,000, [[1942]] నాటికి 4,19,182 వరకు పెరిగింది.<ref name="statprofile"/> 1945 లో ఆణుబాంబు దాడికి గురైన తరువాత జనాభా 1,37,197 కు పడిపోయింది.<ref name="statprofile"/> [[1955]] నాటికి మళ్ళీ యుద్ధ పూర్వసమయం నాటి జనాభాకు చేరింది.<ref>{{ఇంగ్లీష్}}{{cite book |title=Post-conflict Reconstruction in Japan, Republic of Korea, Vietnam, Cambodia, East Timor |author=డి రాహమ్-అజిమి, నస్రిన్, మాట్ ఫుల్లర్, మరియు హిరోకో నకయామా |publisher=ఐక్యరాజ్య సమితి ప్రచురణ |year=2003 |pages=పేజీ 69}}</ref>
 
==మూలాలు==
<references/>
 
[[వర్గం:జపాన్ పట్టణాలు మరియు, నగరాలు]]
 
[[en:Hiroshima]]
"https://te.wikipedia.org/wiki/హిరోషిమా" నుండి వెలికితీశారు