ఆయేషా మీరా హత్య కేసు: కూర్పుల మధ్య తేడాలు

-{{Orphan}}
ట్యాగు: 2017 source edit
చి →‎పర్యవసానాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
 
== పర్యవసానాలు ==
మొదట హాస్టల్ వంటమనిషిని విచారించిన [[రక్షకభటుడు|పోలీసులు]] తర్వాత [[తెనాలి]]కి చెందిన శివాంజనేయులు పై పలు పరీక్షలు చేసి ఇతనే నేరస్థుడని తెలిపారు. వారి కుటుంబీకులు [[మానవ హక్కులు|మానవ హక్కుల]] సంఘానికి ఫిర్యాదు చేయటంతో పోలీసులు అతనిని వదిలివేశారు. తర్వాత దొంగతనం మరియు, మానభంగం కేసులను ఎదుర్కొంటున్న [[జగిత్యాల]]కు చెందిన ఉపేందర్ సింఘ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. 15 రోజుల విచారణ అనంతరం ఇతనే నేరస్థుడని ప్రకటించారు. తల్లి లక్ష్మీబాయి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా, అతనిని కూడా వదిలేశారు. అటు తర్వాత గుర్విందర్ సింఘ్ ఆలియాస్ లడ్డు కాలి ముద్రలు ఘటనాస్థలంలో సేకరించినవాటికి సరిపోలుతున్నాయని అతని పై ఛార్జి షీటు దాఖలు చేశారు. ఇతని [[కుటుంబము|కుటుంబం]] కూడా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి, విడుదల చేయించుకొన్నారు. ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కేసులో చేర్చడానికి యత్నించారు. <ref> [https://www.sakshi.com/news/top-news/ayesha-meera-murder-case-mystery-yet-to-find-463911 పలు మలుపులు తిరిగిన కేసు]</ref> కానీ ఆ తర్వాత అప్పటికే ఇతర నేరాల క్రింద సబ్ జైలులో శిక్షలను అనుభవిస్తున్న పిడతల సత్యనారాయణ ఆలియాస్ సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొంటూ ఆగష్టు 2008 న అతనిని మొదటిసారిగా అదుపులోకి తీసుకొనటం జరిగినది. పోలీసులే పెద్దమొత్తంలో ఇతనికి డబ్బు ముట్టజెప్పి నేరాన్ని అంగీకరించేలా చేశారు. పేద దళిత కుటుంబానికి చెందిన సత్యం బాబు తల్లి-చెల్లి బాధ్యతలు తనపై ఉండటంతో దీనిని ఒప్పుకొన్నాడు. సత్యం బాబు తల్లి మరియమ్మ మాత్రం అసలైన నేరస్థులను తప్పించేందుకే తమ పలుకుబడిని ఉపయోగించి తన కుమారుడిని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, దీనిని ఖండిస్తూ [[హైదరాబాదు]]<nowiki/>లో నిరాహార దీక్ష చేపట్టినది. 21 మే 2010 సత్యం బాబును చికిత్స నిమిత్తం [[హైదరాబాదు]] నుండి విజయవాడ తీసుకెళుతుండగా [[నల్గొండ]] లోని [[సూర్యాపేట]] పోలీసులు భోజనం కోసం ఆగగా సత్యంబాబు తప్పించుకు పారిపోయాడు. కొద్ది గంటలకే మళ్ళీ సత్యం బాబును అదుపులోకి తీసుకొనటం జరిగినది.<ref> [http://zeenews.india.com/news/andhra-pradesh/accused-in-andhra-girls-rape-and-murder-escapes_628467.html సత్యం బాబు పరారీ]</ref>
 
== విమర్శలు ==