ఇమ్మడి జగదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సుల్తానుల సేవలో: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
 
==సుల్తానుల సేవలో==
పదహారవ శతాబ్దంలో గోల్కొండ రాజ్యంలోని కోటలను రక్షించడానికి నాయక్వారీలనే హిందూ సైనికదళముండేది. వారి నాయకుడైన జగదేవరావు ధైర్యవంతుడు మరియు, చురుకైనవాడు. తొలుత జంషీద్ కులీ కుతుబ్‌షా వద్ద పనిచేసి కార్యదక్షతతో మంచిపేరు తెచ్చుకున్నాడు. 1550లో [[జంషీద్ కులీ కుతుబ్ షా]] మరణించిన తర్వాత కొడుకు సుభాన్‌ను రాజమాత బిల్కిస్ జమాన్ కోరిక రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ''ఐనుల్ ముల్క్''‌గా [[అహ్మద్‌నగర్]] నుండి సైఫ్ ఖాన్‌ను [[గోల్కొండ]]<nowiki/>కు పంపించారు. అయితే సైఫ్ ఖాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తనే రాజు అవ్వాలనే రాజ్యకాంక్ష పెంచుకున్నాడు. ఇది భరించలేక ముస్తఫా ఖాన్ వంటి కొందరు అధికారులు [[విజయనగరం]]<nowiki/>లో ఉన్న ఇబ్రహీం కులీకి గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టవలసిందిగా [[రహస్యం|రహస్య]] వర్తమానాన్ని పంపారు.
 
గోల్కొండలో ఉన్న జగదేవరావు, రాజ్యపాలన క్షీణించడం మరియు, సైఫ్ ఖాన్ పాలనపై ఉన్న అసంతృప్తిని గమనించి, ఇదే అదనుగా ''పిచ్చి యువరాజు''గా పేరొందిన దౌలత్ ఖాన్ (కులీ కుతుబ్‌షా యొక్క మరో కుమారుడు) ను నామమాత్రపు సుల్తానును చేసి అధికారం చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఆ అనిశ్ఛిత పరిస్థితుల్లో [[భువనగిరి]]కి వెళ్ళి అక్కడ బందీగా ఉన్న దౌలత్ ఖాన్‌ను విడిపించాడు. జగదేవరావు పన్నాగాన్ని పసిగట్టిన సైఫ్‌ఖాన్ [[భువనగిరి]] కోటపై ముట్టడి చేసి జగదేవరావును తెచ్చి గోల్కొండ కోటలో బంధించాడు.
 
గోల్కొండ సేనానులు ఇబ్రహీంను రాజ్యం చేపట్టడానికి రావలసిందిగా ఆహ్వానించారు కానీ ఇబ్రహీంకు సై‌ఫ్‌ఖాన్‌ను ఎదుర్కొనేందుకు సైనిక సహాయం కావలసి ఉంది. అటువంటి సహాయం కేవలం నాయక్వారీల నుండి కానీ [[విజయనగరం]] రాజునుండి కానీ అందగలదు. విజయనగరం రాజు నుండి సహాయం తీసుకోవటానికి వారు ఇష్టపడలేదు. ఇక నాయక్వారీల నాయకున్ని సైఫ్‌ఖాన్ బంధించడంతో వాళ్లను సై‌ఫ్ ఖాన్ వ్యతిరేకంగా కూడగట్టడానికి అట్టే సమయం పట్టలేదు. నాయక్వారీలతో ఒప్పందం కుదరగానే ఇబ్రహీం విజయనగరం నుండి బయలుదేరి [[గోల్కొండ]] రాజ్యపు సరిహద్దులలో [[కోయిలకొండ]]లో ముస్తఫా ఖాన్, సలాబత్ జంగ్ తదితర సేనానులను కలుసుకొని, కోయిలకొండలోని నాయక్వారీ సైన్యంతో గోల్కొండ వైపు కదిలాడు. ఇబ్రహీం వస్తున్నాడన్న వార్త అందగానే గోల్కొండ కోటలోని నాయక్వారీలు తిరగబడి, సుభాన్ కులీని బంధించి,<ref name=bilgrami>[http://books.google.com/books?id=wgo97XF0XuYC&pg=PA197&lpg=PA197&dq=naikwaris#v=onepage&q&f=false Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains By Syed Ali Asgar Bilgrami]</ref> జగదేవరావును చెరనుండి విడిపించారు. అలా నాయక్వారీలు, ఇతర సేనానుల మద్దతుతో ఇబ్రహీం, సైఫ్ ఖాన్ ను ఓడించి, గోల్కొండను చేజిక్కించుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయిన సైఫ్‌ఖాన్ పారిపోయి బీదరులో తలదాచుకున్నాడు. కోటలోకి అడుగుపెట్టి ఇబ్రహీం పట్టాభిషిక్తుడయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/ఇమ్మడి_జగదేవరావు" నుండి వెలికితీశారు