జాయప సేనాని: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
 
 
'''జాయప సేనాని''' సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి [[గణపతి దేవుడు|గణపతిదేవు]]<nowiki/>ని వద్ద పనిచేసిన సేనాధిపతి. ప్రాచీన పత్రాల్లో ఇతడిని ''జాయప నాయుడు'' అని, ''జాయన'' అనీ కూడా ఉదహరించారు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను [[దివిసీమ]]<nowiki/>ను పాలించాడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడు లోని 'క్రోయ్యూరు'. ఈతని తండ్రి తాతలు [[చందోలు|చందవోలు]] రాజధానిగా తెలుగు దేశమును పరిపాలించిన వెలనాటి చోళ మహీపతులను సేవించారు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు, బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యంలో పనిచేసారు.
 
వెలనాటి రెండవ చోళుని కాలములో, కృష్ణా నది సముద్రమున కలియు చోటనున్న దీవిలో నారప్ప ఒక నగరాన్ని నిర్మించాడు. అప్పటి నుండి వీరు అక్కడే నివసింప సాగారు. క్రీ. శ. 1203లో [[గణపతి దేవుడు|కాకతి గణపతిదేవ చక్రవర్తి]] ఈ దీవిపై దండెత్తి, అయ్య కులజుడైన పిన్న చోడుని (జాయన తండ్రి) ఓడించి దీవిని వశపరచుకొన్నాడు. కాని, అతను అయ్యకులజుల పరాక్రమాదులను మెచ్చుకొని వారితో సఖ్యము చేసికొన్నాడు. అంతేకాక, జాయన ఇద్దరు అక్కలను - నారమ, పేరమ అనువారిని - పెళ్ళి చేసుకున్నాడు.<ref>{{Cite book|title=ఎపిగ్రాఫియా ఇండికా|publisher=డైరెక్టర్ జనరల్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా|year=1979|isbn=|location=న్యూ ఢిల్లీ|pages=126,127|editor-last=హల్ట్ష్|publication-place=|volume=3|editor-first=ఇ|url=https://archive.org/details/EpigraphiaIndica3/page/n5}}</ref>. అప్పటికి జాయన చాలా చిన్నవాడు. అతని సౌమ్యాకారమును, నయ వినయ శౌర్య గాంభీర్యములను గమనించిన గణపతి దేవుడు వానికి ఆందోళీకాతపత్రాది గౌరవములను ప్రసాదించి, గజ సైన్యాధిపతిని కావించి, క్రీ. శ. 1213లో 'తామ్రపురి'ని (నేటి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని చేబ్రోలును పరిపాలింపనిచ్చెను. (Epi. Ind. Vol. V, PP - 142, 143). అంతేకాక, కౌమార దశ నుండి జయన ప్రతిజ్ఞాశయముల నెరింగిన, గణపతి దేవుడు స్వయముగా శ్రద్ధ వహించి, గుండా మాత్యుల వారిచే జాయనకు కళల నేర్పించెను. (1-13)
"https://te.wikipedia.org/wiki/జాయప_సేనాని" నుండి వెలికితీశారు