ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎సారాంశం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 18:
యువకుడైన నావికుడు తన 200 సహచరులతో కలిసి ఓడలో ప్రయాణిస్తుంటాడు. ఓడ భూమధ్య రేఖ (Equator) ను చేరే వరకూ ఓడ ప్రయాణం చక్కగా సాగుతుంది. ఒక్కసారిగా తుఫాను ప్రభావంతో ఓడ మంచు ఉండే పడమర దిశగా వెళుతుంది. మంచు ముక్కలను బ్రద్దలగొట్టుకుంటూ ఓడ అతి కష్టం మీద ఆల్బెట్రాస్ (Albatross) అనే పక్షి కనిపించే వరకూ ముందుకు వెళుతుంది . ఆల్బెట్రాస్ కనిపించడంతో శుభమని భావించిన నావికులు దానిని ప్రేమతో చేరదీస్తారు.
 
ఒక రోజు వారి నాయకుడు ఆల్బెట్రాస్ ను బాణంతో గురిచూసి కొట్టి చంపేస్తాడు. దానితో తుఫాను మరియు, మంచు తేలిపోయి ఓడ ఉన్నఫళంగా అక్కడే నిలిచిపోతుంది. మిగిలిన నావికులంతా తమ నాయకుడిని నిందిస్తారు, మరోవైపు పొగమంచును మాయం చేశాడని భావించి ప్రశంసిస్తారు. ఎండ వేడి తీవ్రమవడంతో ఉప్పు నీటి సముద్రంలోనుండి భయకర జీవులు పైకొచ్చి తిరుగుతూవుంటాయి. దాహం వల్ల వారి పెదాలు పగిలిపోయి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. కోపోద్రిక్తులైన ఇతర నావికులు జరిగిన పాపానికి ప్రతీకగా చచ్చిన ఆల్బెట్రాస్ ను తమ నాయకుడి మెడకు తగిలిస్తారు.
 
సముద్రంలో ఓడ సూర్యబింబాన్ని చేరుకొన్న తర్వాత నావికుడు తన చేతిని కరచుకొని స్వరక్తంతో పెదాలను తడుపుకొని ఇతర నావికులను పిలుస్తాడు . సూర్య బింబాన్ని దాటగానే దూరంగా మరొక ఓడ కనిపిస్తుంది. అందులో పురుషుడి రూపంలో 'డెత్' (మరణం /Death) మరియు, అందమైన నగ్న స్త్రీ రూపంలో 'లైఫ్ ఇన్ డెత్' (మరణంలో జీవం/ Life in Death) అను దెయ్యాలు ఉంటాయి . ఆ దెయ్యాలు నావికుడి ఆత్మ కొరకు జూదం ఆడుకుంటాయి. ఆ జూదంలో లైఫ్ ఇన్ డెత్ నావికుడి ఆత్మను గెలుచుకొనగా, డెత్ ఇతర నావికుల ఆత్మలను గెలుచుకుంటుంది . దెయ్యాల ఓడ అక్కడనుండి వెళ్ళిపోయే సరికి ఆకాశం నల్లగా మారిపోతుంది. దెయ్యాల ఓడ అక్కడనుండి వెళ్ళిపోయే సరికి ఆకాశం నల్లగా మారిపోతుంది. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఇతర నావికులందరూ తమ కళ్ళతో నావికుడిని నిందించి ఉన్నచోటనే కుప్పకూలిపోయి మరణిస్తారు. వారి ఆత్మలు నావికుడిని దూషిస్తూ బాణాల వలె శబ్దాలు చేస్తూ వెళ్ళిపోతాయి. విచిత్రంగా కుళ్ళిపోకుండా ఉన్న శవాలు మాత్రం నావికుడివైపు శపిస్తున్నట్లుగా చూస్తుంటాయి.
 
ఒక రాత్రి వెన్నెలలో ఓడ ముందు భాగంలో అటూ ఇటూ వెళుతున్న నీటి పాములను చూసి ఆనందపడి వాటిని తెలియకుండానే ఆశీర్వదిస్తాడు. నావికుడు ప్రార్థించడం మొదలుపెట్టే సరికి మెడలో ఉన్న ఆల్బెట్రాస్ నీటిలో పడిపోతుంది. ప్రార్థన పూర్తి అయిన తరువాత పడుకొని నీటిని గురించి కలగంటాడు. నిద్దుర లేచేసరికి ఉరుములు మెరుపులతో వర్షం వస్తూ ఉంటుంది. నావికుడు ఆ వర్షపు నీటిని త్రాగుతాడు. ఓడ గాలి వీస్తున్న దిశలో కదులుతుంది. మరణించిన వారందరూ తిరిగి లేచి మాట్లాడకుండా కీర్తనలు పాడుతూ ఓడను నడుపుతారు. ఓడ మరోసారి భూమధ్య రేఖకు చేరే సరికి వెంటనే ఆగిపోతుంది. దానితో నావికుడు స్పృహ కోల్పోతాడు. ఆ స్పృహలేమిలో ఆల్బెట్రాస్ ను చంపినందుకుగాను నావికుడుకి శిక్ష కొనసాగుతుంది అని రెండు గొంతులు వినబడతాయి. స్పృహలోకి వచ్చి లేచిన నావికుడిని చూచి గుంపుగా ఉన్న తోటి నావికులు తమ కళ్ళతో మరలా దూషించి ఆఖరిసారిగా అదృశ్యమైపోతారు.
 
గాలి వీయడంతో నావికుడు తన ఊరు ఒడ్డుని చూస్తాడు. శవాల వద్ద దేవదూతలు కాగడాల వలె ప్రత్యక్షమై ఓడను ఒడ్డుకు చేర్చసాగారు. ఒడ్డు వద్ద నుండి చిన్న పడవలో వస్తున్న ఓడల సంరక్షకుడు (Pilot) ని, అతని కుమారుడుని, మరియు ఒక బైరాగి (Hermit) ని చూచి ఆనందపడతాడు. పడవలోని ముగ్గురూ దగ్గరకు రాగానే సుడిగుండమేర్పడి ఓడ మునిగిపోతుంది. ఆ ముగ్గురూ చివరికి నావికుడిని రక్షిస్తారు. చనిపోయాడనుకున్న నావికుడు వెంటనే లేచి పడవను నడపడం చూచి ముగ్గురుకీ మతిపోతుంది. ఆనాటినుండి జ్ఞాపకం వచ్చినప్పుడు అందరికీ తన గాథ చెప్పాలనుకుంటాడు.
 
ఈ విధంగా నావికుడు తన కథను ముగిస్తాడు. తాను దేశాలు తిరుగుచూవున్నానని, ఎవరికైతే తన కథను చెప్పవలెననియున్నదో వానిపై ప్రత్యేక ఆభిమానం ఉంటుందని, కథను చెప్పిన తర్వాత తన మనసు కుదుటపడుతుందని నావికుడు వివాహ వేడుక అతిధితో చెబుతాడు. నిజమైన ఆనందం అందరితో కలిసి ప్రార్థన చేయడంలో ఉందని, దేవుడికి దగ్గరవ్వాలంటే ఆయన సృష్టించిన జీవరాసులను ప్రేమించాలని చెప్పి నావికుడు అక్కడినుండి అదృశ్యమవుతాడు. విస్మయం చెందిన వివాహ వేడుక అతిధులు వివాహానికి హాజరు కాకుండా ఇంటిదారి పడతారు.