ది లైవ్స్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 29:
'''అధ్యాయము 13:''' అంతట దెయ్యము ఇట్లు పలికెను - ఏమంటివి? నీ వలననే నేను ఆ చోటనుండి గెంటివేయబడితిని. నీవు ఏర్పడినప్పుడు దేవుని దృష్టినుండి గెంటివేయబడితిని, దేవదూతల సహవాసమునుండి బహిష్కరింపడితిని. ఆ దేవుడు నీలో ఊపిరి ఊదినప్పుడు, నిన్ను ఆయన స్వరూపములో సృష్టించినప్పుడు, మిఖాయేలు (Michael) దూత మమ్మల్ని దేవుని ఎదురుగా నిన్ను ఆరాధింపజేసెను. దేవుడు కూడా ఇదిగో ఆదాము, నా రూపములో ఇతనిని నేను చేసితిననెను.
 
'''అధ్యాయము 14:''' మరియు, మిఖాయేలు దూత బయటకు వెళ్ళి సమస్త దేవదూతలను పిలిచి - ఆ దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన ప్రతిరూపమును ఆరాధించుడి - అని చెప్పెను. మిఖాయేలు తనంతట తానే ముందుగా ఆరాధించి తర్వాత నన్ను పిలిచి 'దేవుని స్వరూపమును ఆరాధించుడి అని చెప్పెను. ఆదామును నేను ఆరాధించవలసిన అవసరం నాకు లేదని చెప్పితిని. మిఖాయేను నన్ను బలవంతము చేయసాగెను. నేను ఆగ్రహించి - నన్ను ఎందుకు బలవంతము చేయుచుంటివి? నాకంటే అల్పుడిని నేను ఎలా ఆరాధింతును? ఈ సృష్టిలో నేను అతనికంటే గొప్పవాడను, అతనికంటే ముందు చేయబడితిని. నన్ను ఆరాధించుట అతని బాధ్యత అని అంటిని.
 
'''అధ్యాయము 15:''' ఇది విన్న నా తోటి దేవదూతలందరూ నిన్ను ఆరాధించుట నిరాకరించిరి. అప్పుడు మిఖాయేలు - దేవుని ప్రతిరూపమును ఆరాధించుడి. లేకున్నచో ఆయన ఆగ్రహము మీమీదికి దిగివచ్చును అని హెచ్చరించెను. అప్పుడు నేను - ఆయన నా పై కోపగించినచో నా సింహాసనమును నక్షత్రమండలము పైకి మార్చుకొని పైన ఉండెదను - అని పలికితిని.
పంక్తి 63:
'''అధ్యాయము 28:''' ఈ మాటలను విన్న నేను నేలపై సాగిలపడి - నీవు నిత్య దేవుడవు, దేవాతి దేవుడవు, సమస్త జీవరాశులు నిన్ను ఆరాధించుచున్నవి. అన్ని వెలుగులకంటే పై వెలుగు నీవు. నీ కృపవలన కలిగిన మనుష్య జాతిని నడిపించుచుంటివి - అని అంటిని. నేను దేవుడిని ఇలా కొనియాడిన తరువాత దేవ దూత అయిన మిఖాయేలు దేవుని ఆజ్ఞ చొప్పున నా చేయి పట్టుకొని నన్ను పరలోకమునుండి గెంటివేసెను. మిఖాయేలు దండముతో పరలోకము చుట్టూరా ఉన్న నీటిని ముట్టగా అది మంచుగా మారెను.
 
'''అధ్యాయము 29:''' మిఖాయేలు నన్ను ఆ మంచుపై నడిపించి, తిరిగి నన్ను కలసిన చొట దించెను. నా కుమారుడా, విను. నేను జ్ఞాన ఫలమును తిని ఈ వయసులో ఏమి జరుగనున్నదో, మానవజాతి పట్ల దేవుడు ఏమి చేయగోరుచున్నాడో అప్పుడు నాకు ముందే తెలినప్పుడు - రహస్యములు, సంస్కారములు నాకు తెలియపరచబడినవి. దేవుడు అగ్ని కీలల్లో ప్రత్యక్షమై తన మహాత్మ్యము గల నోటితో ఆజ్ఞలు జారీ చేసి పటిష్ఠపరచును; ఆయన నోటినుండి రెండంచుల ఖడ్గము వెలువడును; అవి ఆయనను మహిమలో ఘనపరచును. వాటికి ఆయన అద్భుతమైన స్థలము చూపించును. అవి ఆయన సిద్ధపరచిన స్థలములో దేవునికి నివాసము ఏర్పరచును, అవి ఆయన ఆజ్ఞలను అతిక్రమించుటవలన వాటి పవిత్రత కాలిపోవును, వాటి నివాస స్థలము విడువబడును, దేవుని కోపమునకు గురై వాటంతట అవే విడిపోవును. దేవుడు మరలా వాటిని వెనక్కి రప్పించును, అవి దేవునికి నివాసము నిర్మించును, అప్పుడు ఆ దేవుని నివాసము పూర్వము కంటే హెచ్చించబడును. మరలా పాపము నీతిని అతిక్రమించును. పిమ్మట దేవుడు మనుష్యులతో భూమిపై ఉండును; అప్పుడు నీతి ప్రకాశించుట మొదలవును. మరియు దేవుని నివాసము స్తుతించబడును, శత్రువులు దేవుని ప్రేమించు మనుష్యులను గాయపరచలేకపోవును, దేవుడు తాను నిత్యత్వానికి తీసుకొనిపోయే నీతిమంతుల పక్షముగానుండును, దేవుడు ఆయన ప్రేమను తృణీకరించిన దుష్టులను శిక్షించును. పరలోకమును, భూమియూ, పగలు, రాత్రియు మరియు, సమస్త జీవరాశులు అన్నీ ఆయన ఆజ్ఞకు లోబడును, అవి ఆయన ఆజ్ఞను మీరవు. మనుష్యులు వారు పనులను మార్చుకొనరు కాని దేవుని ధర్మ శాస్త్రమును మీరుదురు. కనుక దేవుడు ఆయన నుండి చెడును విసర్జించి సూర్యుని వలె ప్రకాశించును. అప్పుడు మనుష్యులందరూ నీటిచే వారి పాపములనుండి శుద్ధిచేయబడుదురు. శుద్ధిచేయబడుట ఇష్టము లేనివారు శిక్షింపబడుదురు. తీర్పు తీర్చబడునప్పుడు, మనుష్యుల్లో దేవుని గొప్పదనము కనిపించినప్పుడు, దేవుడు వారి కార్యాలు గూర్చి తెలిసికొన్నపుడు, ఆత్మను నియంత్రిచుకొను మనుష్యులు సంతోషిచెదరు.
 
'''అదాము మరణము:'''
పంక్తి 91:
'''అధ్యాయము 41:''' వారు గంటలతరబడి ప్రార్థనలో వేడుకొనుచుండగా, అదిగో వారియొద్దకు మిఖాయేలు దూత వచ్చి ఇట్లనెను: నేను దేవునిచే మీ యొద్దకు పంపబడితిని. సెత్తూ, నేను చెప్పునది ఏమనగా, ఏడువకుము, నీ తండ్రి ఆదామును తైలముతో అంటుటకు కరుణ తైలము కోసం ప్రార్థించవద్దు.
 
'''అధ్యాయము 42:''' నేను చెప్పునది ఏమనగా, ఆఖరి దినములలో పొందుకొని రక్షించుకోగలవని అనుకొనుట వివేకము కాదు. ఐదు వేల ఐదు వందల సంవత్సరములు సంపూర్తి అయిన తరువాత ఆదాము శరీరమును, మరియు చనిపోయిన శరీరములను లేపుటకు రాజు, దైవ కుమారుడైన [[యేసు క్రీస్తు]] భూమ్మీదకు వచ్చును. దైవ కుమారుడైన ఆయన తనకు తానే యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది, ఆ నది నుండి బయటకొచ్చి, ఆయనను నమ్మిన వారందరినీ తైలాభిషేకము చేయును. నీటి మూలముగానూ, పరిశుద్ధాత్మ మూలముగాను క్రొత్తగా జన్మించుటకు సిద్ధమైన వారందరికీ తరతరాలు ఆ అభిషేకము ప్రాప్తించును.
 
'''అధ్యాయము 43:''' సెత్తూ, కాలము పరిపూర్ణమైనది కనుక నీవు నీ తండ్రియొద్దకు వెళ్ళుము. ఆరు రోజులు అతని ఆత్మ శరీరమును విడిచిపెట్టి వెళ్ళును. ఆపిమ్మట స్వర్గమందును, భూమియందును, ప్రకాశించువాటియందును అద్భుతములు జరుగును - ఈ మాటలు చెప్పి మిఖాయేలు వెళ్ళిపోయెను. అంతట సెత్తు, అవ్వ - [[కుంకుమపువ్వు]], వసకొమ్ములు, దాల్చిన చెక్క, నిమ్మగడ్డి వంటి సుగంధ మూలికలతో తిరిగి వచ్చెను.