నంది తిమ్మన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 23:
ఇతను [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాలలో]] ఒకడు. ఇతను రాయల భార్య [[తిరుమల దేవి]]కి అరణంగా [[విజయనగరం]] వచ్చిన కవి. నంది తిమ్మన, ఆరువేల నియోగ [[బ్రాహ్మణ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. ఈయన కౌశిక గోత్ర, అపస్తంభ సూత్రానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. ఈయన [[అనంతపురం]] పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది.
 
తిమ్మన జన్మతః [[శైవుడు]], అఘోర శివాచార్యుల శిష్యుడైనా, వైష్ణవ రాజాస్థానంలో ఉన్నందువలన, అప్పటి రాజకీయ-సామాజిక పరిస్థితుల వల్ల కొన్ని వైష్ణవ రచనలు కూడా చేశాడు. ఈయన తాత [[నంది మల్లయ్య]] మరియు, మేనమామ [[ఘంట సింగన్న]] (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన [[వీరనరసింహ రాయలు|వీరనరసింహరాయల]] ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు.
 
1521లో ముక్కు తిమ్మన రాయల తరఫున [[గయ]]ను సందర్శించి అక్కడ నావాడ నాయకులపై కృష్ణదేవరాయల విజయానికి ప్రతీకగా ఒక విజయశాసనం ప్రతిష్ఠించాడని చరిత్రకారులు భావిస్తున్నారు.<ref>[http://books.google.com/books?id=dE1mAAAAMAAJ&q=nandi+timmana&dq=nandi+timmana Epigraphia Andhrica, Volume 1]</ref> ఈ ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల గయ శాసనం క్రింద రాజప్రశస్తిని కీర్తిస్తూ చెక్కబడిన కంద పద్యం ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణంలోనిది కావటం, కృష్ణదేవరాయలు [[గయ]]<nowiki/>ను సందర్శించిన ఆధారం లేకపోవటం ఈ సంభావ్యతకు మద్దతునిస్తున్నాయి.<ref>[http://books.google.com/books?id=quXUAAAAMAAJ&q=nandi+timmana&dq=nandi+timmana Epigraphia Indica, Volume 2]</ref>
"https://te.wikipedia.org/wiki/నంది_తిమ్మన" నుండి వెలికితీశారు