పొట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎వరిపొట్టు-ఇంధనంగా వినియోగము: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 42:
40-50 సంవత్సరాల క్రితము పరిశ్రమలలోని బాయిలరులలో కలప, రాక్షసిబొగ్గు (coal), ఫర్నెస్‍ఆయిల్‍ వంటివి ఇంధనంగా వినియోగించేవారు. కలప వాడకం వలన చెట్లను నరకడం వలన ఆరణ్యసంపద తరగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని బాయిలర్‍లలో కలప వాడకాన్ని నిషేధించారు. రాక్షసిబొగ్గు, ఫర్నెస్‍ ఆయిల్‍ వంటి శిలాజ ఇంధనాలు పునరుత్ప్పత్తి కాని ఇంధనాల వాడకాన్ని తగ్గించుటకై (లేనిచో శిలాజ ఇంధననిల్వలు అతికొద్దికాలంలోనే హరించుకపొయ్యే ప్రమాదమున్నది) ప్రత్యామ్నాయ ఇంధన వాడకం పై దృష్టిసారించడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులనుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధాలు/ఉపౌత్పత్తుల (agro waste) ను ఇంధనాలుగా వాడటం ప్రారంభించారు.
 
ధాన్యాలను, అపరాలను మిల్లింగ్‍చెయ్యగా వచ్చు వరిపొట్టు, వేరుశనగకాయలపొట్టు, కందికాయలపొట్టు, సొయాగింజలకాయలపొట్టు, మొక్కజొన్నలకాళి కంకులు వంటి వాటి వాడకం బాయిలరు ఇంధనంగా వాడటం క్రమంగా పెరిగింది. అంతేకాదు రంపరుపొట్టు, పత్తిగింజల పొట్టును కూడా బాయిలరు ఇంధనంగా వాడుచున్నారు. వరిని ప్రధానంగా పండించు ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‍, మరియు పంజాబులలో తగిన ప్రమాణంలో రైసు మిల్లింగ్‍ వలన వరిపొట్టు ఉత్పత్తి అవుతున్నందున ఈ రాష్ట్రాలలో వరిపొట్టు/ఊకను బాయిలర్‍ ఇంధనంగా వాడటం మొదలైనది. ఆంధ్రప్రదేశ్‍లోని మిని పవర్‍ప్లాంట్‍ (2-5 మెగావ్యాట్‍ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యమున్న) లలో వరిపొట్టును ఇంధనంగా వాడుచున్నారు. బాయిల్డ్‍ రైసుమిల్లువారు తమ మిల్లులలోని బాయిలర్‍లకు వారి మిల్లులో ఉత్పత్తి అవుచున్న పొట్టునే ఇంధనంగా వినియోగిస్తారు. వరిఊక/పొట్టు యొక్క సాంద్రత (bulk density) చాలా తక్కువగా వుండటం వలన తక్కువ భారంవున్న పొట్టు ఎక్కువ ప్రాంతం అక్రమించును. ఒక ఘనమీటరు నీటి బరువు 1000 కేజిలుండగా, ఒక ఘనమీటరు పొట్టు భారం 80-100 కేజిలు మాత్రమే వుండును. కొంచెం దగ్గరిగా నొక్కిన పొట్తు భారం110-120 కీజిల వరకు వచ్చును. అందుచే పొట్టును నిల్వచేయుటకు ఎక్కువ స్థలం అవసరం. అందుచే పరిశ్రమలలో వరిపొట్టును ఇంధనంగా వాడు పరిశ్రమలవారు బాయిలరు షెడ్‍ముందు భాగంలో, పెద్దబయలు ప్రదేశంలోఅధికభాగం పొట్టును నిల్వవుంచెదరు. కొద్దిపాటి వరిపొట్టును చిన్న షెడ్‍లో నిల్వచేయుదురు. ఈ చిన్నషెడ్‍లోని ఊకను వర్షకాలంలో, వర్షం పడునప్పుడు బాయిలర్‍కు వాడెదరు.
 
==వరిపొట్టు యొక్క భౌతిక,రసాయనిక లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/పొట్టు" నుండి వెలికితీశారు