ఎల్.ఆర్.అంజలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
'''ఎల్.ఆర్.అంజలి''' ఒక సినిమా నేపథ్య గాయని. ఈమె గాయని [[ఎల్.ఆర్.ఈశ్వరి]]కి చెల్లెలు. ఈమె తల్లి నిర్మల 1950లలో సినిమాలలో కోరస్ పాడేది. ఈమె తండ్రి దేవరాజన్ మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు.ఈమె బాల్యంలోనే తండ్రి మరణించాడు. ఈమె చదువు [[మద్రాసు]] ఎగ్మోర్‌లోని ప్రెసిడెన్సీ హైస్కూలులో గడిచింది. తర్వాత రాజారాం అయ్యంగార్ వద్ద సంగీతాన్ని, మీనాక్షి సుందరం పిళ్లై వద్ద శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించింది<ref>[https://antrukandamugam.wordpress.com/2016/10/25/l-r-anjali-playback-singer/ సినిమా ఎక్స్‌ప్రెస్ పత్రిక నుండి]</ref>. ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో పాటలు పాడింది.
==తెలుగు సినిమా పాటల జాబితా==
ఎల్.ఆర్.అంజలి [[ఎం.ఎస్.విశ్వనాథన్]], [[జె.వి.రాఘవులు]], [[రమేష్ నాయుడు]], [[కె.చక్రవర్తి]], [[చెళ్లపిళ్లచెళ్ళపిళ్ళ సత్యం]], [[టి.చలపతిరావు]], విజయభాస్కర్ వంటి సంగీత దర్శకులు స్వరపరచిన పాటలను, [[ఆరుద్ర]], [[కొసరాజు రాఘవయ్యచౌదరి]], [[సి.నారాయణరెడ్డి]], [[రాజశ్రీ]], [[దాశరథి రంగాచార్య]], [[అప్పలాచార్య]], [[దాసం గోపాలకృష్ణ]], [[ఆత్రేయ]], [[అనిసెట్టి సుబ్బారావు]], [[ఉత్పల సత్యనారాయణాచార్య]], [[వేటూరి సుందరరామమూర్తి]] మొదలైన కవులు వ్రాసిన గేయాలను పాడింది. ఈమె [[ఎల్.ఆర్.ఈశ్వరి]], [[పి.బి.శ్రీనివాస్]], [[వాణీ జయరామ్‌జయరామ్]], [[బి.వసంత]], [[పిఠాపురం నాగేశ్వరరావు]], [[పి.సుశీల]], [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[రమోలా]], మాధవపెద్ది రమేష్, [[జి.ఆనంద్]] వంటి గాయకులతో కలిసి అనేక పాటలు పాడింది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఎల్.ఆర్.అంజలి" నుండి వెలికితీశారు