మార్లిన్ మన్రో: కూర్పుల మధ్య తేడాలు

File
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 53:
1953లో ఆమె నటించిన [[నయాగరా]] చిత్రం హాలివూడ్ చరిత్రలోనే ఒక సెంసేషన్ గా నిలిచిపోయింది...ప్రియుడితో కలిసి తన భర్తనే హాత్య చేయాలనుకునే స్త్రీ ఉదంతంతో తెరకెక్కించబడిన ఈ చిత్రం హాలివూడ్ లో అడల్ట్ చిత్రాలకు పునాదిగా నిలిచింది...ఈ చిత్రంతోనే మన్రో గాయనిగా కూడా తన ప్రతిభను నిరూపించుకొని అంతర్జాతీయ స్థాయిలో యువత కలల రారాణిగా వెలిగిపోయింది.
 
1959లో మన్రో జాక్ లెమోన్ మరియు, టోనీ కర్టిస్ తోకలిసి నటించిన సం లైక్ హాట్ అనే హాస్యాభరిత చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది...ఈ చిత్రంలో ఒక మల్టీ మిలియన్ ని పెళ్ళి చేసుకోవాలనే ప్రయత్నంలో ఒక గాయని ఎన్ని ఇబ్బందులు పడవలసి వచ్చిందనే కథాంశంతో రూపొందించబడిన సుగర్ కెన్ అనే పాత్రలో ఆమె అత్యద్భుత నటనకుగాను 1959లో బెస్ట్ ఆక్ట్రేస్స్ ఇన్ కామెడీ అవార్డ్ తో పాటు 1959సంవత్సరానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది.
 
Spot
పంక్తి 76:
కొందరు హత్య అన్నారు. మరి కొందరు ఆత్మహత్య అన్నారు. ఇంకొందరు ‘డ్రగ్’ ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అన్నారు. చివరికి చివరి కారణాన్నే అధికారికంగా ధ్రువీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చకు దారితీసిన కుట్రసిద్ధాంతాలలో మన్రో మరణం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.
ఒక జీవితానికి 36 ఏళ్ల వయసు ఏమంత పెద్దది కాదు. ఆమె మరణ వార్త విని తప్పుకోలేక ప్రపంచ వ్యాప్తంగా 24 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ అడపాదడపా ఆమె ధరించిన [[దుస్తులు]], వాడిన వస్తువుల్లాటివి వేలం వేస్తే, లక్షల డాలర్లలో శ్రీమంతులు సొంతం చేసుకున్నారనే వార్తలు వెలువడుతూనే ఉంటాయి. 1950లో ఆమె నాయికగా నటించిన తొలి చిత్రం 'డోన్ట్ బాదర్ టు నాక' విడుదలవుతున్న సందర్భంగా - ఓ క్యాలెండర్ పై ఆమె నగ్న చిత్రాన్ని విడుదల చే సె సరికి అది హాలీవుడ్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ''ఎందుకు అలాంటి ఫోజ్ ఇచ్చారు'' అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే ''ఆకలీ బాధకు తాళలేక'' అని జవాబిచ్చింది మర్లిన్.
ఇంతగా ప్రపంచ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న మన్రో తన జీవిత కాలంలో కనీసం ఒక సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయింది.కానీ తన జీవితంలో ఒక మరుపురాని గిఫ్ట్ మాత్రం తన దగ్గరే ఉంచుకుంది.ఆయీన్ స్టీన్ తన ఆటోగ్రాఫ్ తో కూడిన ఫోటోను ఇచ్చి మనోను surpriseకి గురిచేసాడు. తన నటనా జీవితంలో, మార్లిన్ మన్రో సినిమాలు $ 200 మిలియన్లను వసూలు చేసింది. ఇప్పటికీ ఆమె సెక్స్ అప్పీల్ మరియు, అందం ప్యాషన్ ప్రపంచంలో ప్రఖ్యాత చిహ్నంగా భావించబడుతుంది.
ఆమె జీవితం, ఆమె వివాహాలు, వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యాలూ అన్నీ సంచలనాత్మకంగా ఉండేవి. నటిగా పరిణత చెంది మరెన్నో విజయాలు సాధించవలసిన తరుణంలో మార్లన్ అర్ధాంతరంగా జీవితరంగం నుంచి నిష్రమించింది. ఆమె పేదరికాన్ని ఎదిరించ గలిగింది కానీ లెక్కకు మించిన సిరి సంపదలను, పేరు ప్రఖ్యాతలనూ తట్టుకోలేకపోయింది!
చిన్న వయసులోనే కష్టాల దారుల నుంచి, కన్నీటి సుడిగుండాల నుంచి నడిచొచ్చిన మన్రో ఎవరి అండా లేకుండానే, ఎవరి ఆశీస్సులు లేకుండానే తనను తాను నిరూపించుకుంది. ‘అంతర్జాతీయ అందాల తార’గా మన హృదయాల్లో నిలిచి నవ్వుతూ ఉంది!
 
'''మార్లిన్ మన్రో''' ([[జూన్ 1]], [[1926]]—[[ఆగస్ట్ 5]], [[1962]]) అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు, అభినేత్రి, మరియు సినీ నిర్మాత.
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/మార్లిన్_మన్రో" నుండి వెలికితీశారు