మోసగాళ్ళకు మోసగాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎థీమ్స్, ప్రభావాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 23:
మోసగాళ్ళకు మోసగాడు సినిమాను [[రాజస్థాన్]]లో ఎడారులు, [[బికనీర్|బికనీర్ కోట]], [[పంజాబ్]] లోని [[సట్లెజ్ నది]] తీరం, [[హిమాచల్ ప్రదేశ్]] లోని [[సిమ్లా]] పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు, [[టిబెట్]] పీఠభూమి, [[పాకిస్తాన్]]-[[చైనా]] సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్తాన్ కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకువెళ్ళారు. సినిమాలో కృష్ణని మొట్టమొదటిసారి కౌబాయ్ గా కాస్ట్యూంస్ చేసిన బాబూరావు, వెంకట్రావు, మేకప్ మేన్ మాధవరావు తీర్చిదిద్దారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్">{{cite web|last1=ఎం.|first1=సికిందర్|title=నాటి రహస్యం!|url=http://sikander-cinemascriptreview.blogspot.in/2015/06/blog-post_15.html|website=సినిమా స్క్రిప్ట్ & రివ్యూ|accessdate=14 August 2015}}</ref> సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[వి.ఎస్.ఆర్.స్వామి]] వ్యవహరించారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడు గురించి రెంటాల జయదేవ" />
 
== థీమ్స్ మరియు, ప్రభావాలు ==
మోసగాళ్ళకు మోసగాడు అమెరికన్ సినిమాల్లోని కౌబాయ్ సినిమాల జానర్ తో వచ్చింది. కౌబాయ్ అంటే ఉత్తర అమెరికాలో పశువుల మందలను మేపుతూ, వాటికి కాపలాగా ఉంటూ గుర్రాలపై సంచరించే వ్యక్తి. 19వ శతాబ్ది ఉత్తర మెక్సికోలో ఈ పాత్ర జానపద నాయకుని పాత్రగా రూపాంతరం చెంది పలు సాహసగాథలకు ముఖ్యమైన దినుసు అయింది.<ref name="Malone1">Malone, J., p. 1.</ref> 19, 20వ శతాబ్దాల్లో అమెరికాలో ఈ కౌబాయ్ పాత్రలను, స్థానిక అమెరికన్ల పాత్రలను రొమాంటిసైజ్ చేస్తూ ''వెల్డ్ వెస్ట్ షోలు'' ప్రాచుర్యం పొందాయి.<ref>Malone, J., p. 82.</ref> 1920ల నుంచి నేటివరకూ ఆంగ్లంలో పలు కౌబాయ్ సినిమాలో వచ్చాయి. వీటిలో కౌబాయ్ లు నెగిటివ్ గానూ, పాజిటివ్ గానూ కూడా కనిపిస్తారు. కొన్ని సినిమాల్లో కౌబాయ్ లు గ్యాంగ్ స్టర్లుగానూ, మరికొన్నిటిలో దేశభక్తి, సాహసం, ధైర్యం వంటి గుణాలతో కౌబాయ్ కోడ్ వంటి సద్లక్షణాలతోనూ కనిపిస్తారు. మొత్తానికి ఆంగ్ల చిత్రాల్లో కౌబాయ్ ఓ ప్రత్యేకమైన జానర్ గా రూపుదిద్దుకుంది.<ref>[http://geneautry.com/geneautry/geneautry_cowboycode.html "Gene Autry's Cowboy Code" © Autry Qualified Interest Trust.] Web page accessed February 3, 2009.</ref><br />
ఇలాంటి పూర్తిగా అమెరికన్ సంస్కృతికి చెందిన కౌబాయ్ నేపథ్యంలో సినిమాను రూపొందించి తెలుగు వారిని ఆకట్టుకునేందుకు రచయిత [[ఆరుద్ర]] చాలా కృషి చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిది పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన నేరస్తుల్ని పట్టించి డబ్బు సంపాదించే బౌంటీ హంటర్ పాత్ర. నేపథ్యం కౌబాయ్. ఇలాంటివి సమకాలీన సమాజంలో కానీ, సమీప గతంలో కానీ లేవు కనుక ఈ సినిమా కాలాన్ని బ్రిటీష్ వారూ, ఫ్రెంచ్ వారూ దేశంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న రోజుల్లో సెట్ చేశారు. [[బొబ్బిలి యుద్ధం]] కాలంలో బ్రిటీష్ వారు అమరవీడు అనే సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడిచేసిన రోజుల్లో కథ ప్రారంభమవుతుంది. ఆ అమరవీడు సంస్థానపు నిధి కోసం జరిగే అన్వేషణ [[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానం]], [[కర్నూలు]] రాజ్యాల వరకూ సాగుతుంది. ప్రతినాయకులకు బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య అంటూ పేర్లను తెలుగు పట్టణాల పేర్లు కలసివచ్చేలా పెట్టారు. విదేశీ సంస్కృతిలోని నేపథ్యానికి తెలుగు వాతావరణం కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఇవి.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్" /><br />
"https://te.wikipedia.org/wiki/మోసగాళ్ళకు_మోసగాడు" నుండి వెలికితీశారు