"రసాయన శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
 
మౌలికంగా చెప్పుకోవాలంటే, రసాయనశాస్త్రంలో పదార్థ లక్షణాలని (material properties) అధ్యయనం చేస్తాం. ఒక పదార్థం (matter) మరొక పదార్థంతో సంయోగం చెందినప్పుడు ఏమవుతుంది? ఒక పదార్థం శక్తి (energy) తో కలసినప్పుడు ఏమవుతుంది? ఒక పదార్థం మరొక పదార్థంగా ఏయే సందర్భాలలో మారుతుంది? ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు రసాయనశాస్త్రంలో దొరుకుతాయి. ఒక పదార్థం మరొక పదార్థంతో కలసినప్పుడు జరిగే పనినే [[రసాయన ప్రక్రియ]] (chemical reaction) అంటారు. ఈ ప్రక్రియలో పదార్థంలో ఉన్న కొన్ని [[రసాయన బంధాలు]] (chemical bonds) సడలి కొత్త కొత్త బంధాలు ఏర్పడతాయి.
 
పదార్థం, (ఉదాహరణకి: మనం కూర్చునే కుర్చీ, పీల్చే గాలి) [[అణువు]] (molecule) ల సముదాయం. ప్రతి అణువు లోను కొన్ని [[పరమాణువు]] (atom) లు ఉంటాయి. పరమాణువు అంతర్భాగంలో ఎలక్ట్రాన్, ఫోటాన్ మరియు, న్యూట్రాన్ వంటి ఉపపరమాణు భాగాలు (sub-atomic particles) లు ఉంటాయి. అయినప్పటికీ, మన దైనందిన జీవితంలో మనకి తారసపడేవి, మన అనుభవ పరిధిలో ఇమిడేవి అణువులు, వాటి రసాయన లక్షణాలు. కాని ఈ రసాయన లక్షణాలని నిర్ణయించేది అణువులు, వాటి మధ్య ఉండే రసాయన బంధాలు. ఉదాహరణకి, [[ఉక్కు]] దృఢంగా ఉందంటే దానికి కారణం ఉక్కు బణువులో ఉన్న అణువుల అమరిక, వాటి మధ్య ఉన్న రసాయన బంధాల శక్తి. కర్ర మండుతున్నదంటే కర్రలో ఉన్న [[కర్బనం]] (carbon) గాలిలో ఉన్న [[ఆమ్లజని]] (oxygen) తో రసాయన సంయోగం చెందింది కనుక. [[గది ఉష్ణోగ్రత]] (room temperature) వద్ద నీరు ద్రవ రూపంలో ఉందంటే దానికి కారణం నీటి బణువులలో ఉన్న అణువులు వాటి ఇరుగు పొరుగు అణువులతో ప్రవర్తించే విధానం అనుకూలించింది కనుక. ఆ మాటకొస్తే ఈ వాక్యాలు మీరు చదవగలుగుతున్నారంటే దానికి కారణం ఈ వాక్యాల మీద పడ్డ కాంతి పుంజం పరావర్తనం చెంది, మీ కంట్లో ప్రవేశించి, కంటి వెనుక రెటీనా మీద ఉన్న [[ప్రాణ్యము]] (protein) బణువులతో రసాయన సంయోగము చెందటమే. ఆఖరు మాటగా, ఈ వాక్యాలు చదువుతున్న చదువరులకి ఇదంతా అర్ధం అవుతోందంటే దానికి కారణం కూడా వారి వారి మెదడులలో జరిగే రసాయన ప్రక్రియలే.
 
రసాయనశాస్త్రంలో చాలా విభాగాలున్నాయి. ఈ విభాగాల్లో కొన్ని ఇతర విభాగాలతో మిళితమయి గాని, సంబంధాన్ని కలిగి గాని ఉన్న విభాగాలు కూడా చాలా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2889544" నుండి వెలికితీశారు