సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 29:
==='''[[పసిఫిక్ మహాసముద్రం]]'''===
 
ట్రెంచ్ లు ఎక్కువగా [[పసిఫిక్ మహాసముద్రం]]లోను అందులోను పశ్చిమ భాగంలో విస్తరించి ఉన్నాయి. భూగోళం మీద గల 20 ప్రధాన ట్రెంచ్ లలో 17 ట్రెంచ్ లు [[పసిఫిక్ మహాసముద్రం]]లోనే కేంద్రీకరించబడి ఉన్నాయి. పసిఫిక్ తీరం అంచు వెంబడి రెండు రకాలకు ([[ద్వీప వక్రత]] మరియు, మార్జినల్ రకాలు) చెందిన ట్రెంచ్ లు కనిపిస్తాయి.
 
పసిఫిక్ మహాసముద్ర ఉత్తర భాగంలో అలూషియన్ ద్వీప వక్రతకు సమీపంలో అలూషియన్ ట్రెంచ్ ఏర్పడింది. ఈ ట్రెంచ్ తూర్పు భాగం, ఖండభాగం అంచులలో ఏర్పడటం వల్ల మార్జినల్ ట్రెంచ్ రకానికి చెందుతుంది. అటుపైన పశ్చిమ [[అలస్కా]] నుండి కంచట్కా ద్వీపకల్పం వరకూ గల ప్రాంతంలో ఈ ట్రెంచ్ [[ద్వీప వక్రత]]కు సమాంతరంగా ఏర్పడింది. గరిష్ఠ లోతు 7,822 మీటర్లు బుల్దిర్ దీవికి 145 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది.
పంక్తి 37:
పపువా న్యూ గినియాకు తూర్పు దిశలో వున్న సోలమన్ సముద్రంలో న్యూ బ్రిటన్ ట్రెంచ్, శాన్ క్రిస్టోబాల్ ట్రెంచ్ లు ఏర్పడ్డాయి. బిస్మార్క్ దీవులకు దక్షిణంగా సోలమన్ సముద్రంలో ఏర్పడిన న్యూ బ్రిటన్ ట్రెంచ్ (9,140 మీటర్లు) [[సోలమన్ దీవులు|సోలమన్ దీవులకు]] చెందిన బోగన్ విల్లా దీవి వరకూ కొనసాగుతుంది. దీనిని 'న్యూ బ్రిటన్ ట్రెంచ్' లేదా 'న్యూ బ్రిటన్ - బోగన్ విల్లా ట్రెంచ్' గా వ్యవహరిస్తారు. సోలమన్ సముద్రపు తూర్పు కొనలో వున్న శాన్ క్రిస్టోబాల్ దీవికి దక్షిణంగా శాన్ క్రిస్టోబాల్ ట్రెంచ్ ఏర్పడింది. ఇది మరింత దక్షిణంగా కొనసాగి న్యూ హేబ్రిడ్స్ ట్రెంచ్ తో కలుస్తుంది.
'న్యూ హేబ్రిడ్స్ ట్రెంచ్' (గరిష్ఠ లోతు 7,600 మీటర్లు) [[నైరుతి]] పసిఫిక్ సముద్రం లోని వాన్వాటు దీవుల (Vanuatu Islands) మరియు, న్యూ కేలడోనియా (New Caledonia) దీవుల మధ్య 1200 కిలోమీటర్ల పొడుగునా ఏర్పడింది. దీనికి తూర్పున టోంగా ట్రెంచ్, కెర్మాడేక్ ట్రెంచ్ అనే రెండు ట్రెంచ్ లు ఏర్పడి అవిచ్ఛిన్నంగా కనిపిస్తాయి. టోంగా దీవుల సమీపంలో టోంగా ట్రెంచ్ (గరిష్ఠ లోతు 10,882 మీటర్లు). [[న్యూజిలాండ్]] దీవులకు ఈశాన్యంగా కెర్మాడేక్ ట్రెంచ్ (గరిష్ఠ లోతు 10,047 మీటర్లు) ఏర్పడ్డాయి.
 
[[File:Pacific Ring of Fire.svg|thumb|300 px|right|పసిఫిక్ మహాసముద్ర అంచులలో విస్తరించిన పసిఫిక్ అగ్ని వలయం (Pacific Ring of Fire) -దానిలో భాగంగా వున్న ట్రెంచ్ లు]]
పంక్తి 49:
==='''అట్లాంటిక్ మహాసముద్రం'''===
 
[[అట్లాంటిక్ మహాసముద్రం]]లో ట్రెంచ్ లు ఎక్కువగా ఏర్పడలేదు. ప్యూర్టోరికో ట్రెంచ్ (Puerto Rico Trench), రోమాంచి ట్రెంచ్ (Romanche Trench) లు ముఖ్యమైనవి. కరేబియన్ పలకను ఉత్తర అమెరికా పలక మరియు, దక్షిణ అమెరికా పలకలు డీ కొట్టినపుడు [[ప్యూర్టోరికో]] దీవి మరియు, ఆంటిల్లస్ చిన్న దీవులతో (lesser Antillas) కూడిన ఒక [[ద్వీప వక్రత]] ఏర్పడింది. దీనికి సమాంతరంగా లోతైన ప్యూర్టోరికో ట్రెంచ్ ఏర్పడింది. ఉత్తర [[అట్లాంటిక్ మహాసముద్రం]]లో ఏర్పడిన ట్రెంచ్ లలో ముఖ్యమైనదైన ఈ ట్రెంచ్, [[ప్యూర్టోరికో]] దీవికి ఉత్తరంగా 115 కిలోమీటర్ల దూరంలో ఉత్తర [[అట్లాంటిక్ మహాసముద్రం]]లో 280 కిలోమీటర్ల పొడవుతో ఏర్పడింది. ఈ ప్యూర్టోరికో ట్రెంచ్ లో అత్యధిక లోతు సముద్ర మట్టం నుండి 8,400 మీటర్లు. ఇది మిల్ వకీ డీప్ (Milwaukee Deep) వద్ద నమోదయ్యింది.
 
రోమాంచి ట్రెంచ్ [[అట్లాంటిక్ మహాసముద్రం]]లో [[బ్రెజిల్]], పశ్చిమ ఆఫ్రికాల నడుమ [[భూమధ్య రేఖ]]కు కొద్దిగా ఉత్తరంగా ఏర్పడింది. సగటున 300 కిలోమీటర్ల పొడవుతో, 19 కిలోమీటర్ల వెడల్పుతో వున్న ఈ ట్రెంచ్ మద్య అట్లాంటిక్ రిడ్జ్ లను రెండుగా ఖండిస్తూ పోతుంది. దీని గరిష్ఠ లోతు 7,761 మీటర్లు.
పంక్తి 67:
[[File:Oceanic-oceanic convergence Fig21oceanocean.gif|thumb|300px|right|రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడిన [[ద్వీప వక్రతలు]], ట్రెంచ్ లు (చొచ్చుకొనిపోతున్న పలక: సముద్ర పలక; పైభాగంలో వున్న పలక: సముద్ర పలక) ]]
 
విరూపకారిక ప్రక్రియ (Tectonic activity) వలన సముద్ర భూతలంపై ట్రెంచ్ లు ఏర్పడతాయి. ట్రెంచ్ ల ఆవిర్భావానికి దారి తీసిన విరూపక ప్రక్రియ రెండు విధాలైన పలకల చలనం వలన సంభవిస్తుంది. [[పలక విరూపణ సిద్ధాంతం]] ప్రకారం రెండు సముద్రపు పలకలు ఢీ కొన్నప్పుడు కాని లేదా సముద్రపు పలక-ఖండ పలక రెండూ ఢీ కొన్నప్పుడు కాని ఆ పలకల సరిహద్దులలో సబ్‌డక్షన్ మండలం ఏర్పడి దాని వెంబడి లోతైన సముద్ర కందకాలు (Trenches) మరియు, సముద్త భూతలంపై [[ద్వీప వక్రతలు]] (Island Arcs) లేదా ఖండ భూతలంపై అగ్నిపర్వత వక్రతలు (volcanic arc) ఏర్పడతాయి. ఉదాహరణకు సముద్ర-సముద్ర పలకలు ఎదురెదురుగా ఢీ కొన్నప్పుడు పలకల సరిహద్దు అయిన సబ్‌డక్షన్ మండలం వెంబడి సముద్ర భూతలంపై [[ద్వీప వక్రతలు]], లోతైన [[ట్రెంచ్]]లు ఏర్పడతాయి. సముద్ర-ఖండ పలకలు ఎదురెదురుగా ఢీ కొన్నప్పుడు పలకల సరిహద్దు అయిన సబ్‌డక్షన్ మండలం వెంబడి సముద్ర భూతలంపై లోతైన ట్రెంచ్ లు, ఖండ భూతలంపై అగ్నిపర్వత వక్రతలు (volcanic arc) ఏర్పడే అవకాశం ఉంది.
 
రెండు పలకలు (సముద్ర-సముద్ర పలకలు లేదా సముద్ర-ఖండ పలకలు) ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీ కొన్నప్పుడు అభిసరణ సరిహద్దుల వద్ద సబ్‌డక్షన్ మండలం ఏర్పడుతుంది. ఈ సరిహద్దు మండలంలో అధిక వేగంతో చలించే సాంద్రతర సముద్ర పలక వేరొక పలక (సముద్ర లేదా ఖండ పలక ఏదైనా కావచ్చు) లోనికి చొచ్చుకొనిపోతుంది. ఆ విధంగా భూ ప్రావారం (mantle) లోనికి చొచ్చుకుపోయిన సముద్ర పలక లోని కొంత పటల (Crust) భాగం అధిక లోతుల వద్ద, అధిక ఉష్ణోగ్రతల వలన కరిగిపోతుంది. ఇలా కరిగిన పటలం, మాగ్మా రూపంలో చీలికల ద్వారా నిరంతరం పైకి ఉబికి వస్తుంది.
పంక్తి 111:
==ట్రెంచ్ ల ప్రాముఖ్యత==
 
సముద్ర భూతలం పైన ఏర్పడిన అత్యంత లోతైన ప్రాంతాలు ట్రెంచ్ లు. భూగోళం మీద ఇప్పటి వరకూ మనకు తెలిసిన మరియు, సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత లోతైన ప్రాంతాలు ఇవే.
 
* భూగోళపు లితోస్ఫియరిక్ పలకల యొక్క సహజ సరిహద్దుల వద్ద ట్రెంచ్ లు ఏర్పడ్డాయి. ఈ ట్రెంచ్ ల అధ్యయనం వలన పలకల అభిసరణ సరిహద్దుల యొక్క విలక్షణమైన, అధ్బుతమైన లక్షణాలు తెలుస్తాయి.
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు