గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35:
| weight =
}}
'''గౌతు లచ్చన్న''' ([[ఆగష్టు 16]], [[1909]] - [[ఏప్రిల్ 19]], [[2006]]) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో [[సర్దార్ వల్లభభాయి పటేల్|సర్ధార్ వల్లభాయ్ పటేల్]] తరువాత [[సర్దార్]] అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. '''సర్దార్ గౌతు లచ్చన్న''', [[వి. వి. గిరి|వి.వి.గిరి]], [[సుభాష్ చంద్రబోస్|నేతాజి సుభాష్ చంద్రబోస్]]<ref>{{Cite web |url=http://www.glowfoundations.com/biodata.html |title=Latchanna organised reception at Eluru to the soldiers of the Azad Hind Fauz founded by Netaji Subash Chandra Bose |website= |access-date=2016-05-23 |archive-url=https://web.archive.org/web/20110711101828/http://www.glowfoundations.com/biodata.html |archive-date=2011-07-11 |url-status=dead }}</ref>, [[జయంతి ధర్మతేజ]], మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో]] పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]] మరియు, [[బెజవాడ గోపాలరెడ్డి|బెజవాడ గొపాలరెడ్డి]] మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]]<nowiki/>తో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు. చిన్న [[రాష్ట్రాలు]] కావాలన్నాడు. [[తెలంగాణ|తెలంగాణా]] కొరకు [[మర్రి చెన్నారెడ్డి]]<nowiki/>తో చేతులు కలిపాడు. [[తెలంగాణ|తెలంగాణా]] రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధి]] [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] విధించినప్పుడు వ్యతిరేకించి, స్వేచ్ఛ కోసం పోరాడాడు. [[చరణ్ సింగ్|చౌదరి చరణ్ సింగ్,]] [[జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాష్ నారాయణ]], మసాని లతో పనిచేశాడు.
 
తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న. కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, [[ఎన్.జి.రంగా|ఆచార్య గోగినేని రంగా]] ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న.
 
==బాల్యము మరియు, విద్యాభ్యాసము==
సర్దార్ గౌతు లచ్చన్న: ఉత్తర [[కోస్తా]] కళింగసీమలో ఉద్ధానం ప్రాంతాన (నాటి [[గంజాం జిల్లా]]) [[సోంపేట]] తాలూకాలో [[బారువా]] అనే గ్రామంలో [[1909]] [[ఆగష్టు 16]] వ తేదీన ఒక సాధారణ బీద గౌడ కుటుంబములో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8 వ సంతానంగా పుట్టాడు. లచ్చన్న తాత, తండ్రులు [[గౌడ]] కులవృత్తే వారికి కూడుబెట్టేది.<ref>[http://www.hindu.com/2006/04/20/stories/2006042023640100.htm The Hindu]</ref> [[ఈత|ఈతచెట్లను]] కోత వేసి కల్లు నుత్పత్తి చేయడం, అమ్మడం చుట్టు ప్రక్క గ్రామాల్లో గల [[కల్లు]] దుకాణాలకు [[కల్లు]] సరఫరా చేయడం వారి వృత్తి. కుల వృత్తిలోకి తమ పిల్లలన్ని దించకుండా చదువులను చెప్పించాలని బారువాలో గల ప్రాథమిక పాఠశాలలో [[1916]]లో వాళ్ళ నాన్న చిట్టయ్య చేరిపించాడు. లచ్చన్న బారువా ప్రాథమికోన్నత పాఠశాలలో 8 వ తరగతి వరకు చదివి ప్రక్కనే ఉన్న [[మందస|మందసా]] రాజావారి హైస్కూల్లో 9 వ తరగతిలో చేరాడు. అక్కడ లచ్చన్న చదువు కొనసాగలేదు. దురలవాట్లు, చెడుసహవాసాలు కొనసాగాయి. ఫలితంగా 9వ తరగతి తప్పాడు. [[శ్రీకాకుళం]]<nowiki/>లో లచ్చన్నను ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడ జగన్నాధం పంతులుగారి ఇంటిలో ఉండి చదువుసాగించాడు. ఆ స్కూల్లో డ్రిల్ మాష్టారు నేమాని నరసింహమూర్తి శిక్షణలో జాతీయ భావాల్ని అలవర్చుకున్నాడు. విద్యార్థి జీవితంలో మార్పు జీవన విధానంలో మార్పు. ఆలోచన ధోరణిలో మార్పు, జాతి, జాతీయత అనే ప్రాథమిక రాజకీయ పాఠాల్ని నరసింహమూర్తి వద్దనే నేర్చుకోవడం జరిగింది. లచ్చన్నకు ఆనాటికి 21 సవంత్సరాలు. 1929-30 విద్యా సంవత్సరం స్కూల్ పైనల్ పరీక్షకు ఎంపికై హాజరయ్యాడు.
 
"https://te.wikipedia.org/wiki/గౌతు_లచ్చన్న" నుండి వెలికితీశారు