పీర్ పంజాల్ శ్రేణి: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (2)
పంక్తి 1:
[[దస్త్రం:Pir_Panjal_2478293509_8000ae5902_o.jpg|thumb| పీర్ పంజాల్ రేంజ్ ]]
[[దస్త్రం:Kashmir-sat-nasa.jpg|thumb| ఉపగ్రహం నుండి కాశ్మీర్ లోయ దృశ్యం. చిత్రంలో ఎడమ, దిగువ భాగంలో మంచు కప్పేసిన పీర్ పంజాల్ శ్రేణి ఉంటుంది. ]]
'''పీర్ పంజాల్ శ్రేణి''' అంతర [[హిమాలయాలు|హిమాలయాల్లోని]] పర్వత సమూహం. [[హిమాచల్ ప్రదేశ్|హిమాచల్ ప్రదేశ్‌]], [[జమ్మూ కాశ్మీరు]], పాక్ ఆక్రమిత కాశ్మీరుల్లో తూర్పు-ఆగ్నేయం నుండి పశ్చిమ-వాయువ్యంగా ఇది విస్తరించి ఉంది. దీన్ని హిందూ మత గ్రంథాల్లో ''పాంచాలదేవ'' అని పేర్కొన్నారు. ఇక్కడ సగటు ఎత్తు 1400 మీ. - 4,100 మీ. మధ్య ఉంటుంది. ధౌలాధార్, పీర్ పంజాల్ శ్రేణుల వైపు పోతూ ఉంటే హిమాలాయల ఎత్తు పెరుగుతూ పోతుంది. మధ్య హిమాలయాల్లో పీర్ పంజాల్ అత్యంత పెద్ద శ్రేణి. సట్లెజ్ నది ఒడ్డున, ఇది హిమాలయాల నుండి విడిపోయి, [[బియాస్ నది|బియాస్]], [[రావి నది|రావి]] నదులను వేరు చేస్తూ పోతుంది.
 
== పేరు వ్యుత్పత్తి ==
పీర్ పంజాల్ కనుమ పేరిట పీర్ పంజాల్ శ్రేణికి ఈ పేరు వచ్చింది. దీని అసలు పేరు పాంచాలదేవ. [[పాంచాలము|పాంచాల]] అనేది [[మహా భారతము|మహాభారతంలో]] పేర్కొన్న దేశం. ప్రస్తుత వాయవ్య [[ఉత్తర ప్రదేశ్]] లోని ప్రాంతం. అయితే, మహాభారత ప్రాంతాలను పశ్చిమ పంజాబ్, దక్షిణ కాశ్మీర్లకు చెందినవిగా చూపించే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. పండిత దినేశ్‌చంద్ర సిర్కార్ ''శక్తి -సంగమ తంత్రంలో'' వివరించిన భౌగోళిక విశ్లేషణ ప్రకారం కూడా ఇలాగే ఉంది. ఈ ప్రాంతం ఇస్లామీకరించబడిన తరువాత దేవత అనే భావన పీర్‌గా మారిందని ఎం ఏ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.
 
== శిఖరాలు, పర్వత శ్రేణి ==
"https://te.wikipedia.org/wiki/పీర్_పంజాల్_శ్రేణి" నుండి వెలికితీశారు